వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంత రాద్దాంతమా?, అప్పట్లో వైఎస్ చేయలేదా?:జగన్‌కు అమరనాథ్ రెడ్డి ప్రశ్న

వైఎస్ హయాంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోలేదా? అని జగన్ ను సూటిగా ప్రశ్నించారు

|
Google Oneindia TeluguNews

తిరుపతి: చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా తిరుపతికి వచ్చారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు టీడీపీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది.

ఈ సందర్బంగా అమరనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ తీరు తప్పుపట్టారు. 2019లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందన్న భయంతోనే ఫిరాయింపులపై వైసీపీ రాద్దాంతం చేస్తుందన్నారు. ఆ కారణంగానే వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఫిరాయింపుదారులకు మంత్రిపదవులు ఇవ్వడాన్ని ప్రశ్నించే హక్కు జగన్ కు లేదని స్పష్టం చేశారు.

my blood is always in yellow colour says amarnath reddy

వైఎస్ హయాంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోలేదా? అని జగన్ ను సూటిగా ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల పేరు చెప్పి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. మీ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బతకాల్సిన అవసరం తనకు లేదని అమరనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన నాటి నుంచి తామంతా టీడీపీలోనే కొనసాగుతున్నామని, కానీ మధ్యలో ఏ ప్రలోభంతో తనను వైసీపీలోకి తీసుకెళ్లారని జగన్‌ను నిలదీశారు. తన ఒంట్లో రక్తం ఎప్పుడూ పచ్చగానే ఉంటుందని, ఎప్పటికి టీడీపీలో ఉంటానని తెలిపారు. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉన్నందునా.. కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

English summary
Ap minister Amaranath Reddy made some interesting comments on Friday at Tirupati. He said his blood is always in yellow colour
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X