వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా అన్న సీఎం కావటం ఖాయం .. బై బై బాబు అన్నారు ప్రజలు .. షర్మిల సంచలనం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Morning News Roundup

ఏపీలో సార్వత్రిక ఎన్నికల యుద్ధం ముగిసింది. ఇక పార్టీల నేతలు ఎవరి అంచనాలలో వారు విజయంపై ధీమాతో ఉన్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో.. అందరి చూపు ఇప్పుడు ఎన్నికల ఫలితాలపై పడ్డాయి. అయితే సర్వేలన్నీ తమకే అనుకూలమని వైసీపీ భావిస్తుంటే, మరోవైపు టీడీపీ మాత్రం చివరకు అధికారం చేజిక్కించుకునేది మేమేనన్న ధీమాలో ఉన్నారు.

సంచలనం రేపుతున్న షర్మిల వ్యాఖ్యలు

సంచలనం రేపుతున్న షర్మిల వ్యాఖ్యలు

130 స్థానాలలో విజయం సాధిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్తుంటే, సిఎం ప్రమాణ స్వీకారం ముహూర్తాన్ని దేవుడే నిర్ణయిస్తాడు అంటున్నాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఇక తానేమీ తక్కువ కాదంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.జగనన్న వదిలిన బాణం షర్మిలమ్మ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

వైసీపీ నవరత్నాల ముందు టీడీపీ పథకాలు పనిచెయ్యలేదు

వైసీపీ నవరత్నాల ముందు టీడీపీ పథకాలు పనిచెయ్యలేదు


ఈసారి ఎన్నికల్లో గెలుపు వైసీపీదే అని చాలా ధీమాగా చెప్పిన షర్మిల, పసుపు... కుంకుమ, పెన్షన్లు, అన్నదాత , సుఖీభవ లాంటి పధకాలు చంద్రబాబు ఎన్ని పెట్టినా అవి, వైసీపీ ప్రకటించిన నవరత్నాల ముందు పనిచేయలేదని వ్యాఖ్యానించారు.పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి , ప్రజల సమస్యలను దగ్గర నుంచి చూసిన వ్యక్తి జగన్ అని, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు షర్మిళ.

ఏపీలో వైసీపీదే అధికారం : పీకే టీంను అభినందించనున్న జగన్ఏపీలో వైసీపీదే అధికారం : పీకే టీంను అభినందించనున్న జగన్

చంద్రబాబుకు బైబై చెప్పిన ఏపీ ప్రజలు అంటున్న షర్మిల

చంద్రబాబుకు బైబై చెప్పిన ఏపీ ప్రజలు అంటున్న షర్మిల

అంతేకాదు మా అన్న జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని.. ఈసారి ప్రజలందరూ వైసీపీకి అనుకూలంగా ఓట్లేశారని ఆమె చాలా బలంగా విశ్వసిస్తున్నారు. ఎన్నికలు వన్ సైడ్‌గానే జరిగాయని షర్మిళ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. చివరిగా చంద్రబాబుకు బైబై చెప్పాల్సిన సమయం వచ్చిందని, ఏపీ ప్రజలు చంద్రబాబుకు బై బై చెప్పారని షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి షర్మిళ వ్యాఖ్యల పై టిడిపి నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

English summary
Sharmila made sensational comments on the elections . Pasupu Kumkuma, pensions and Annadatha Sukhibhava which has been very much acknowledged to win this election, said that no matter how many things TDP have done, they did not work before the announcements made by the YCP.Sharmila is expressing the courage of the YSR Congress party to ensure that Jagan is a person who has gone through people through the padayathra to konw the people's problems. Sharmila confident on AP's next CM will be Jagan .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X