వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా గొంతు మార్ఫ్ చేశారు: మేకప్ మెన్ ఇష్యూనే...: రాజీనామాపై పృథ్వీరాజ్ కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు పృథ్వీ రాజ్. ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. తనపై కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు.

ముఖంపై పిడిగుద్దులు గుద్దారు: ఎస్వీబీసీ పదవికి రాజీనామా చేశా: అందుకే కుట్రంటూ పృథ్వీముఖంపై పిడిగుద్దులు గుద్దారు: ఎస్వీబీసీ పదవికి రాజీనామా చేశా: అందుకే కుట్రంటూ పృథ్వీ

అదే ఇంత పెద్ద ఇష్యూ అయ్యింది..

అదే ఇంత పెద్ద ఇష్యూ అయ్యింది..

సీఐటీయూ యూనియన్ అనేది తనకు తెలియదని అన్నారు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో తాను మేకప్ మెన్ వెంకట్ రెడ్డిని హైదరాబాద్‌లో మూడు నెలలు పనిచేయాలని చెప్పానని తెలిపారు. అతను యూనియన్‌లో ఉన్నాడని తెలియదని.. వరదరాజు అనే అతడ్ని కలిసి తాను ఇచ్చిన ఆదేశాల గురించి చెప్పాడని తెలిపారు.అదే ఇష్యూ ఇంత పెద్దదైందని పృథ్వీ అన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి మా అత్తగారని.. అతడు చెప్పాడని పృథ్వీ అన్నాడు. ఎస్వీబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కు సీఐటీయుకు సంబంధం ఉందని తనకు తెలియదన్నారు.

అందుకే రాజీనామా చేశా..

అందుకే రాజీనామా చేశా..

తనను లేబర్ ఆఫీసుకు పిలిపించారని.. మురళీ అనే వ్యక్తి తనను నియంతృత్వ పోకడలంటూ విమర్శించారని పృథ్వీ చెప్పారు. తాను ఉద్యోగులను ఎవర్నీ తొలగించలేదని అన్నారు. ఉద్యోగల తొలగింపు నిర్ణయం టీటీడీ తీసుకుంటుందని అన్నారు. తనకు యూనియన్ల మీద కోపాలు లేవని అన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించినందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

నా గొంతో మార్ఫ్ చేశారు..

నా గొంతో మార్ఫ్ చేశారు..

తనను దెబ్బ కొట్టాలని కొందరు ప్రయత్నించారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశానని చెప్పారు. మహిళలతో అసభ్యంగా తాను మాట్లాడలేదని, తన గొంతును ఎవరో మార్ఫ్ చేశారని అన్నారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని పృథ్వీ తెలిపారు. అన్ని శక్తులు ఒక్కటై తనపై కుట్ర పన్నాయని అన్నారు. తాను తాగుబోతును కాదని, కావాలంటే టెస్టులు చేసుకోవాలని అన్నారు.

అప్పుడే తిరిగొస్తా..

అప్పుడే తిరిగొస్తా..

తాను తన సొంతంగా రూ. 1.40లక్షలు పెట్టి యాడ్స్ తీసుకున్నామని చెప్పారు పృథ్వీ.తనకు విజిలెన్స్ కమిటీ నుంచి క్లీన్ చిట్ వచ్చిన తర్వాత తాను మళ్లీ ఎస్వీబీసీకి వస్తానని అన్నారు. వైసీపీలో టీడీపీలా ఉండదని, అందుకే తాను వెంటనే రాజీనామా చేసినట్లు చెప్పారు. రైతులు, ప్రజలందరికీ సంక్రాంతి, బోగీ శుభాకాంక్షలు తెలిపారు.

English summary
my voice is morphed, says prudhvi raj.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X