హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుపై మైనంపల్లి వర్గం తిట్లు, ఎపిలో బిజెపి సీట్లు ఇవే!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: మల్కాజిగిరి సీటును పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించారనే వార్తల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హన్మంత రావు, ఆయన అనుచరులు ఆదివారం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఆందోళన చేపట్టారు.

బిజెపి, టిడిపి పొత్తుపై మైనంపల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. మల్కాజిగిరి సీటు బిజెపికి ఇచ్చినా తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని మైనంపల్లి అన్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా తాను మల్కాజిగిరి నుండి పోటీ చేయాలని కోరుతోందన్నారు. చంద్రబాబు దీనిని గుర్తించాలన్నారు. తాను పార్టీకి లాయల్ వ్యక్తినన్నారు. మైనంపల్లి అనుచరులు చంద్రబాబుపై తిట్ల పురాణం వినిపించారు.

ఎపిలో బిజెపికి కేటాయించిన సీట్లు ఇవే...

తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు పొడిచినట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో 47 అసెంబ్లీ, 8 లోకసభ స్థానాలు, సీమాంధ్రలో 15 అసెంబ్లీ, 5 పార్లమెంటు స్థానాలు బిజెపికి రానున్నాయి.

కొత్త ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో బిజెపికి కేటాయించిన సీట్లలో మదనపల్లి, కడప, అనంతపురం, రాజోలు, నెల్లూరు రూరల్, నర్సారావుపేట, రాజమండ్రి, నర్సన్నపేట, విశాఖ నార్త్, విజయవాడ సెంట్రల్ ఉన్నాయి. మరో ఐదు సీట్లు బిజెపికి రానున్నాయి.

English summary
Mynampally Hanumantha Rao may contest as indipendent 
 
 from Malkajgiri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X