వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ అపరిచితుడు: మైసూరా కొత్త ట్విస్ట్, ఆయన్ని చూసి ఆర్నెళ్లు: జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

కడప: సీనియర్ రాజకీయ నాయకుడు మైసూరా రెడ్డి మరో ట్విస్ట్ ఇచ్చారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పలేదని, పుస్తకాలు రాస్తానని చెప్పలేదని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పలేదు. మానవతా దృక్పథం అంటే తనకు రాజ్యసభ సీటు ఇవ్వడం కాదని, అదేమిటో జగన్‌కు తెలుసునన్నారు.

ఆయన మాట్లాడుతూ... తాను పదవులు ఆశించి నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరలేదని చెప్పలేదు. ప్రస్తుతానికి భవిష్యత్తు విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తన కార్యకర్తలతో మాట్లాడి తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

తాను సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతుల కోసం పార్టీని వీడుతున్నట్లుగా వచ్చిన వార్తలను ఆయన కొట్టి పారేసారు. సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతుల కోసం వైసిపిని వీడలేదన్నారు. జగన్‌లో తనకు మానవతా దృక్పథం కనిపించలేదని, మానవతా దృక్పథం అంటే రాజ్యసభ కాదని, అదేమిటో జగన్‌కు తెలుసన్నారు.

విజయ సాయి రెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తారనే అక్కసుతో తాను పార్టీని వీడలేదని చెప్పారు. సాయి రెడ్డికి రాజ్యసభ ఇస్తానంటే తాను అడ్డు చెప్పలేదన్నారు. జగన్ 'అపరిచితుడు' అనేందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయని చెప్పారు. ఆధారాలు లేకుండా తాను లేఖ రాయలేదని చెప్పారు.

Mysoora Reddy news twist, he is not quitting politics

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డితో తనకు ఉన్న విభేదాలతో జగన్‌కు సంబంధం లేదని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డికి, జగన్‌కు పోలిక చెప్పడం అప్రస్తుతం అన్నారు. జగన్ ఎప్పుడూ మాట మీద నిలబడలేదన్నారు. జగన్ నిర్ణయాలతో పార్టీకి తీవ్ర నష్టం అన్నారు.

జగన్ వద్ద తనకు తగిన గౌరవం దక్కలేదన్నారు. రాజ్యసభ రెన్యువల్ కాలేదని తాను టిడిపి నుంచి వైసిపిలో చేరలేదని చెప్పారు. చంద్రబాబు పైన జగన్ పుస్తకం విడుదల చేయడానికి, తన లేఖకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ నెలాఖరున తాను రాజీనామా చేస్తానని జగన్‌కు కూడా తెలుసునని చెప్పారు.

మైసూరా రెడ్డిని చూసి ఆరు నెలలవుతోంది: జగన్

మైసూరా రెడ్డి తనకు దూరమై ఆరు నెలలు అవుతోందని, ఆయన వైసిపికి దూరమై చాలా రోజులు అవుతోందని వైసిపి అధినేత జగన్ అన్నారు. కాగా, మైసూరా రెడ్డి బుధవారం ఉదయం జగన్‌కు ఘాటైన లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆయన పార్టీకి రాజీనామా చేశారు. దీనిపై జగన్ పైవిధంగా స్పందించారు.

English summary
Mysoora Reddy news twist, he is not quitting politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X