కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీవిత బీమా డబ్బుల కోసమే హత్య.. నిందితుడు టీడీపీ నేత... 4 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ

|
Google Oneindia TeluguNews

తన వద్ద పనిచేసే వారిని కుటుంభ సభ్యుల్లా చూసుకోవాల్సిన నాయకుడే... ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం హత్య చేయించాడు... రెండు పాలసీలు చేయించి వాటిని తీసుకునేందుకు హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారు..అనంతరం 32లక్షల ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులను కాజేశారు. కాగా ప్రమాదం తర్వాత అనుమానస్పద మృతిని కాజేసిన హత్య కోణాన్ని కర్నూలు జిల్లా పోలీసులు చేధించారు.

నాలుగు సంవత్సరాల తర్వాత కర్నూల్ జిల్లాలో జరిగిన అనుమాదస్పద మృతిని జిల్లా పోలీసులు చేధించారు. జిల్లాలోని సంచలనం రేపిన సుబ్బారాయుడి హత్య కేసు మిస్టరీ వీడింది. ఇన్సూరెన్స్ కోసమే తన వద్ద పనిచేసే సుబ్బారాయుడిని అవుకు మండలం టీడీపీ నాయకుడు సీ.జే భాస్కర్ రెడ్డి హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. కాగా సుబ్బారాయుడు మెట్టుపలి గ్రామంలో 2015 డిశంబర్ 5న సుబ్బారాయుడు ప్రమాదంలో మృతి చెందినట్టు కేసు నమోదు అయింది.

mystery of Subbarayudus murder in the district has disappeared

అయితే సుబ్బారాయుడు ప్రమాదాన్ని అనుమానస్పద మృతిగా కేసు నమోదైంది. దీంతో పోలీసులు నాలుగు సంవత్సరాల తర్వాత తిరగదోడారు. దీంతో అసలు నిజాలు బయటపడ్డాయి. సుబ్బారాయుడుపై తాను చేసిన ఇన్సూరెన్స్ డబ్బులు కాజేసేందుకు భాస్కర్ రెడ్డి ఆయన్ను హత్య చేయించాడని, అనంతరం హత్యను ప్రమాదంగా చీత్రికరించేదుక ప్రయత్నాలు చేశాడు. కాగా సుబ్బారాయుడుపై చనిపోకపముందే 32 లక్షల జీవిత బీమా ఉండేదని ,వాటి కోసమే హత్యకు గురయ్యారనిన పోలీసులు తెలిపారు. ఇక హత్య జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత హత్యకేసును చేధించిన పోలీసులను జిల్లా అధికారులు అభినందించారు. ఇక హత్య చేసిన నలుగురు నిందుతులను పోలీసులను అరెస్ట్ చేశారు.

English summary
Avuku Mandal TDP leader CJ Bhaskar Reddy has killed Subbarayudu for insurance money, who works for him Four years later, a mysterious death revealed by Kurnool police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X