వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ ముఖం పెట్టుకుని పార్టీ పెడ్తారు: కిరణ్ రెడ్డిపై మైసురా

By Pratap
|
Google Oneindia TeluguNews

 Mysura Reddy questions Kiran Reddy
రాజమండ్రి: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ ముఖం పెట్టుకుని కొత్త పార్టీ పెడతారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసిపి) నాయకుడు మైసూరారెడ్డి ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ఏం చెబితే అదిచేసి, కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలుచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఇపుడు ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటిస్తున్నారని ఆయన విమర్శించారు.

తెలుగు ప్రజలకు అన్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం పంపినపుడు ఆగమేఘాల మీద ఆ బిల్లును అసెంబ్లీలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం కోరిన సమాచారాన్ని సమగ్రంగా అందించి, రాష్ట్ర విభజన ప్రక్రియను కిరణ్‌కుమార్‌రెడ్డి సులభతరం చేశారన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత సమైక్యవాదాన్ని వినిపిస్తామంటే అర్ధంలేదని మైసూరారెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా రాష్ట్రాన్ని విభజించిందని అభిప్రాయపడ్డారు. రానున్న మున్సిపల్, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని మైసూరారెడ్డి పిలుపునిచ్చారు. దేశ సమగ్రతను కాపాడేందుకు ఆర్టికల్ 3ను రాజ్యాంగ నిర్మాతలు రూపొందిస్తే, యుపిఏ ప్రభుత్వం దాన్ని ప్రయోగించి దేశ సమగ్రతను, ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తోందన్నారు.

సమర్ధవంతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన తెలుగుదేశం పార్టీ తెర వెనుక ఒకటి, తెర ముందు మరొకటిగా నాటకాలాడుతోందన్నారు. కేంద్రంలోని ప్రధాన ప్రతిపక్షం బిజెపి కూడా అలాగే వ్యవహరిస్తోందన్నారు. అధికారపక్షంతో ప్రతిపక్షాలు మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకోవటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టన్నారు.

English summary

 YSR Congress party leader MV Mysura Reddy has lashed out at former CM Kiran kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X