వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయన కమెడియన్.. నేను హీరోగా నాటకం వేశాం.. శివప్రసాద్‌‌ను తలుచుకొని చంద్రబాబు ఉద్వేగం

|
Google Oneindia TeluguNews

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత ఎన్ శివ ప్రసాద్‌కు నివాళులర్పిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన పార్ధీవ దేహాన్ని తిరుపతికి తరలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్ నివాళులర్పించారు. అంతిమ యాత్రలో చంద్రబాబుతోపాటు లోకేష్ పాల్గొన్నారు. బాధాతప్త హృదయంతో అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నేతలు శివప్రసాద్ కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..

శివప్రసాద్ అజాత శత్రువు

శివప్రసాద్ అజాత శత్రువు

శివప్రసాద్ నాకు అత్యంత ఆప్తుడు. ఆయన అజాత శత్రువు. అలాంటి వ్యక్తికి నేను నివాళులర్పిస్తానని అనుకోలేదు. మేమిద్దరం మంచి మిత్రులం. ఆయన వైద్య వృత్తిలో కొనసాగుతూనే కళలపై మమకారం పెంచుకొన్నారు. కేవలం నామీద నమ్మకంతోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచడానికి శివప్రసాద్ ఎనలేని పోరాటం చేశారు అని చంద్రబాబు అన్నారు.

ఆయన కమెడియన్.. నేను హీరో

ఆయన కమెడియన్.. నేను హీరో

ప్రజా సమస్యలను, ప్రభుత్వ వ్యతిరేకతను తన కళారూపంలో తెలియజేసి ప్రజలను చైతన్యపరిచారు. ఓ నాటకంలో ఆయన కమెడియన్‌గా వేషం వేస్తే.. నేను హీరోగా వేషం వేశాను. శివప్రసాద మృతి పార్టీకి తీరని లోటు అని చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు.

 తెలుగు రాజకీయాల్లో శివ ప్రసాద్

తెలుగు రాజకీయాల్లో శివ ప్రసాద్

ఇక తెలుగు రాజకీయాల్లో శివ ప్రసాద్‌ది ప్రత్యేకమైన శైలి. దేశ పాలిటిక్స్‌లోనూ తన మార్కును వదిలిన ఘనత ఆయనది. తనదైన శైలిలో వివిధ వేషాల్లో కనిపిస్తూ తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడంలో శివ ప్రసాద్ సఫలమ్యారు. బలమైన కార్యకర్తలను, అభిమానులను సంపాదించుకోవడం ఆయన నాయకత్వ ప్రతిభకు సాక్ష్యంగా నిలిచింది.

పార్టీ కష్టాల్లో ఉన్నా..

ఇక తెలుగు దేశం పార్టీ ఎందరో నాయకులు వీడిపోయినా.. శివప్రసాద్ మాత్రం చంద్రబాబుకు వెన్నంటి నిలిచారు. పార్టీ కష్టాల్లో ఉన్నా.. అధికారంలో ఉన్న చివరి శ్వాస వరకు తన సేవలను టీడీపీకి అందించారు. రాజకీయంగా ఎన్ని ఒత్తిడులు ఎదురైనా గానీ టీడీపీని వదలకపోవడం అతని క్లీన్ పాలిటిక్స్‌కు ఓ మచ్చు తునక అని రాజకీయ వర్గాలు వెల్లడిస్తాయి.

చంద్రబాబుతో అనుబంధం

చంద్రబాబుతో అనుబంధం

తెలుగు దేశం అధినేత చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన వాడు కావడంతో ఆయనతో మంచి అనుబంధం ఉండేది. చిత్తూరులో అభివృద్ది పనుల కోసం శివ ప్రసాద్ ఎంతో పాటు పడ్డారని చెబుతారు. ప్రభుత్వ పథకాలను ప్రేక్షకులకు అందించడంలో తన వంతు పాత్రను సమర్థంగా పోషించాడని చెప్పుకొంటారు.

English summary
N Siva Prasad death given shock to TDP leader. His last rites completed at Tirupati on Sunday evening. At that point N Chandra Babu Naidu gets emotional.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X