వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీతో ఢీ : చంద్రబాబు దీక్షను విరమింపజేసిన దేవేగౌడ

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష‌కు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. విభజన హామీలను ప్రధాని నరేంద్ర మోడీ తుంగలో తొక్కారని మండిపడుతున్నారు. తొలుత రాజ్ ఘాట్ లో మహాత్మగాంధీకి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు.

N Chandrababu Naidu fast in Delhi LIVE Updates: Came all the way here to protest against Centre, says Andhra CM

Newest First Oldest First
8:21 PM, 11 Feb

మాజీ ప్రధాని దేవేగౌడ.. చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు.
7:47 PM, 11 Feb

చంద్రబాబు సోమవారం సాయంత్రం తన ధర్మపోరాట దీక్షను ముగించారు. ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు రాష్ట్రపతి వద్దకు వెళ్తున్నామని, పదకొండు మంది ప్రతినిధులతో కలిసి వెళ్తున్నామని చెప్పారు.
7:26 PM, 11 Feb

చంద్రబాబు దీక్ష సోమవారం సాయంత్రం ముగియనుంది.
5:50 PM, 11 Feb

ద్రబాబు నాయుడు ఢిల్లీలో చేస్తున్న దీక్షకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ మద్దతు పలికారు. చంద్రబాబు, కమల్ నాథ్‌లు పరస్పరం ప్రశంసించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో వైసీపీతో తమతో కలిస్తే మంచిదేనని చెప్పారు. ఒకటి రెండు ఎంపీ సీట్లు వైసీపీ గెలిచినా మాతో కలిసి వస్తే తప్పేమీ లేదన్నారు. 1
5:25 PM, 11 Feb

చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమల్ నాథ్, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మద్దతు పలికారు.
4:19 PM, 11 Feb

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే, నరేంద్ర మోడీలు దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, వారు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
3:36 PM, 11 Feb

మద్దతు ప్రకటించిన ప్రతి ఒక్కరికీ ఆంధ్ర ప్రజల తరపున ధన్యవాదాలు : చంద్రబాబు
3:35 PM, 11 Feb

ధర్మ పోరాట దీక్షకు ఇంత పెద్ద ఎత్తున సంఘీభావం లభించడం ఆనందంగా ఉంది : చంద్రబాబు
3:34 PM, 11 Feb

ఏపీకి నష్టం జరుగుతోందని ఓ వ్యక్తి ఢిల్లీ వచ్చి ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగిస్తోంది : చంద్రబాబు
3:33 PM, 11 Feb

ఆశయం కోసం రాజీపడే సమస్యే లేదు.. ఎంతవరకైనా వెళతాం : చంద్రబాబు
3:32 PM, 11 Feb

చిన్నప్పటి నుంచి మోడీకి దోస్తులు తక్కువ.. ఫ్యామిలీ అటాచ్‌మెంట్ తక్కువ.. అందుకే ఆయనకు బంధాలు తెలియదు : చంద్రబాబు
3:31 PM, 11 Feb

ప్రజల సెంటిమెంట్‌తో మోడీకి సంబంధం లేదు.. ఎవరినీ గౌరవించరు : చంద్రబాబు
3:30 PM, 11 Feb

ఇటీవల తమిళనాడుకు మోడీ వెళ్లినప్పుడు గో బ్యాక్ అంటూ తీవ్ర నిరసన తెలిపారు : చంద్రబాబు
3:29 PM, 11 Feb

తమిళనాడుతో పెట్టుకుంటే అక్కడి ప్రజలు మోడీకి తగిన బుద్ధి చెప్పారు : చంద్రబాబు
3:28 PM, 11 Feb

విభజన చట్టం అమలు చేయకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం కక్ష సాధింపు ధోరణి అవలంభిస్తోంది : చంద్రబాబు
3:27 PM, 11 Feb

గులాం నబీ ఆజాద్ నాకు 40 ఏళ్లుగా తెలుసు.. ఆయనది ఫ్రెండ్లీ నేచర్ : చంద్రబాబు
3:26 PM, 11 Feb

ఏపీకి కేంద్రం సాయం చేయకున్నా.. అభివృద్ధి పథంలో నడిపించడానికి చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు : ఆజాద్
3:24 PM, 11 Feb

మోడీ ప్రభుత్వం వెనక్కి తిరిగిపోవాల్సిందే.. మళ్లీ అధికారంలోకి రాదు : ఆజాద్
3:23 PM, 11 Feb

ప్రాజెక్టులు వస్తే ఉపాధి దొరుకుతుంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది : ఆజాద్
3:22 PM, 11 Feb

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే అక్కడి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది : ఆజాద్
3:21 PM, 11 Feb

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారు.. ఇచ్చిన మాట మీద నిలబడటం మోడీ వల్ల కాదు : ఆజాద్
3:12 PM, 11 Feb

ప్రజా పాలనకు మోడీ అనర్హులు : ఆజాద్
3:11 PM, 11 Feb

మోడీ హయాంలో రైతులు దేశరాజధానిలో ఆందోళన చేయడం ఫస్ట్ టైమ్ చూశా : ఆజాద్
3:10 PM, 11 Feb

మోడీ రైతులను పట్టించుకోరు, ప్రజల సెంటిమెంట్‌ను పట్టించుకోరు.. ఆయన ఓ నియంత : ఆజాద్
3:09 PM, 11 Feb

దేశ చరిత్రలో మోడీ లాంటి ప్రధానిని ఎన్నడూ లేదు : ఆజాద్
3:02 PM, 11 Feb

చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించిన ఆజాద్
3:02 PM, 11 Feb

దీక్ష శిబిరానికి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ గులాం నబీ ఆజాద్
2:58 PM, 11 Feb

ధర్మ పోరాట దీక్ష శిబిరానికి వచ్చి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తున్న జాతీయ నేతలు
2:55 PM, 11 Feb

ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించిన దివ్వెల అర్జునరావు మృతి పట్ల సంతాపం తెలిపిన చంద్రబాబు
2:50 PM, 11 Feb

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రానికి వచ్చిన అడ్డంకులు ఏమిటి? : శరద్ పవార్
READ MORE

English summary
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu Monday began a day-long fast in New Delhi seeking special category status for the state as well as fulfilment of assurances given during its bifurcation. The Chief Minister paid tributes to Mahatma Gandhi at Raj Ghat before heading to Andhra Pradesh Bhavan to observe the fast. Leaders of several Opposition parties are expected to extend solidarity to Naidu’s protest. He will submit a memorandum to the President Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X