• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్‌ను ఓసారి అమెరికా పంపిస్తే: బాబు భావోద్వేగం, 2003లో దాడిపై వైయస్ మీద సంచలనం

|

అమరావతి: ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న తనను చెప్పుతో కొట్టాలని వ్యాఖ్యానించడం శాడిస్ట్ గుణమే అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నన్ను ఎందుకు కాల్చి చంపాలి? ఏం తప్పు చేశానని జగన్ అలా మాట్లాడుతున్నారన్నారు.

జగన్! నన్నెందుకు కాల్చాలి, పవన్‌పై జాగ్రత్త: బాబు, సర్వేలో వైసిపికి 30 సీట్లే

ప్రజల కోసం పని చేస్తున్నందుకు చంపుతారా? నేను చేసిన పనులేమిటి? ఆయన చేస్తున్న పనులేమిటి? తండ్రిలాంటి వయసున్న వ్యక్తిని, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నన్ను ఓసారి చెప్పుతో కొట్టాలని అంటారని, మరోసారి నడిరోడ్డుపై కాల్చినా తప్పులేదన్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

కలెక్టర్‌ను జైల్లో పెడతానంటారా

కలెక్టర్‌ను జైల్లో పెడతానంటారా

జైలులో పెడతానని కలెక్టర్‌ను, పెన్షన్‌ కట్ చేస్తామని పోలీస్‌ కమిషనర్‌ను బెదిరించారన్నారు. ఇది జగన్ నిదర్శనమన్నారు. జగన్ ఉన్మాదాన్ని భరించడం ఎవరి తరమైనా అవుతుందా అన్నారు. ఇదంతా ప్రజలకు అర్థమవుతుందన్నారు.

  Nandyal By-poll : Chandrababu Naidu Tense Over Elections | Oneindia Telugu
  చంద్రబాబు భావోద్వేగం

  చంద్రబాబు భావోద్వేగం

  జగన్‌ వ్యాఖ్యలపై చంద్రబాబు భావోద్వేగంతో స్పందించారు. ఉన్మాద వ్యాఖ్యలే వైసిపిని పతనం చేస్తాయన్నారు. ఏ సర్వే తీసుకున్నా వైసిపికి 30 సీట్లకు మించి రావనే వస్తోందన్నారు. చివరకు ప్రశాంత్ కిషోర్ సర్వేలోను టిడిపియే గెలుస్తుందని తేలిందని చంద్రబాబు అన్నారు.

  మనం రెచ్చిపోవద్దు

  మనం రెచ్చిపోవద్దు

  ప్రతిపక్షం ఎంత రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోవద్దని, సంయమనం పాటించాలని చంద్రబాబు అన్నారు. ఎక్కడ అవకాశం దొరికినా అశాంతిని రేకెత్తించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని, టిడిపిపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని చెదరగొట్టాలని గట్టి ప్రయత్నం జరుగుతోందన్నారు. తప్పులు చేయొద్దన్నారు.

  నిద్రపోయే సమయంలో తప్ప

  నిద్రపోయే సమయంలో తప్ప

  నిద్రించే సమయం తప్ప మిగతా కాలమంతా రాష్ట్ర అభివృద్ధికే వెచ్చిస్తున్నానని, తన శ్రమకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిస్తే శాశ్వతంగా అధికారంలో ఉంటామని, మేనిఫెస్టోలో తొంభై శాతం హామీలు మూడేళ్లలోనే నెరవేర్చామని, గతంలో దూరమైన వర్గాలు కూడా ప్రభుత్వ పనితీరుతో దగ్గరయ్యాయన్నారు. అందరం సమష్టిగా పనిచేస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయన్నారు.

  జగన్‌ను ఓసారి అమెరికా పంపితే

  జగన్‌ను ఓసారి అమెరికా పంపితే

  జగన్‌ను సొంత తండ్రే భరించలేకపోయారని, జగన్‌కు ఒకసారి అమెరికా పంపితే తిరుగు టపాలో వచ్చేశారని చంద్రబాబు అన్నారు. వైయస్ సీఎం అయ్యాక తన పదవికే ఎసరు వస్తుందని జగన్‌ను బెంగళూరు పంపేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని రోశయ్య స్వయంగా చెప్పారన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి నాయకులు లేరన్నారు. శివారెడ్డి, పరిటాల రవిలను చంపినప్పుడు తనకు విపరీతమైన కోపం వచ్చిందని, కానీ మాట తూలలేదన్నారు.

  అందుకే వైయస్ ధర్నాలో పాల్గొన్నారు

  అందుకే వైయస్ ధర్నాలో పాల్గొన్నారు

  అలిపిరిలో తనపై మావోయిస్టులు దాడి చేసినప్పుడు రాజకీయాలకు అతీతంగా వైయస్ ధర్నాలో పాల్గొనడంపై చంద్రబాబు స్పందించారు. నాడు నక్సలైట్లకు ఎర్రచందనం స్మగ్లర్‌, వైయస్ అనుచరుడు గంగిరెడ్డి సహకారం అందించాడని, సెల్‌ఫోన్‌, డబ్బు ఇచ్చాడని, ఆ వ్యవహారంలో తనపేరు బయటకొస్తుందన్న భయంతోనే వైయస్ నిరసనలో పాల్గొన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత అలిపిరి ఘటనపై విచారణకు వేసిన ఏకసభ్య కమిషనకు వైయస్ పలుమార్లు ఫోన్లు చేశారన్నారు. 14 ఏళ్ల క్రితం 2003లో చంద్రబాబుపై అలిపిరిలో దాడి జరిగిన విషయం తెలిసిందే.

  మంచి చేస్తే ఎప్పటికీ మనదే అధికారం

  మంచి చేస్తే ఎప్పటికీ మనదే అధికారం

  మంచి చేస్తే ప్రజలు మనతోనే ఉంటారని, చెడు చేస్తే క్షమించరని, విశ్వసనీయతే అన్నింటికంటే ముఖ్యమని చంద్రబాబు అన్నారు. మనం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఇంటింటికీ టిడిపి కార్యక్రమం గొప్ప వేదిక అవుతుందన్నారు. సెప్టెంబరు ఒకటి నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని ఒక పండగలా అన్ని గ్రామాలు, వార్డుల్లో జరపాలన్నారు. రేపే ఎన్నికలు అన్నంత ఉత్సాహంగా పని చేయాలన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh CM N Chandrababu Naidu made a sensational statement on Tuesday hinting that the deadly bid on his life in 2003 at Alipiri could have been planned by his one-time political arch-rival, former CM the late Y S Rajasekhara Reddy.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more