గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్‌కు భారీ షాక్, జనసేనలోకి నాదెండ్ల, పవన్‌తో భేటీ: ఆ రోజే పవన్‌తో 2 గంటలు భేటీ

|
Google Oneindia TeluguNews

గుంటూరు/తిరుపతి: ఆంధ్రప్రదేశ్ (సమైక్య) మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాకిచ్చారు. మరో ఆరేడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న సమయంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. ఆయన బుధవారం సాయంత్రం తిరుపతి విమానాశ్రయంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌ను కలిశారు.

పవన్‌ను కలిసేందుకుఆయన ఉదయం గుంటూరు నుంచి తిరుపతికి బయలుదేరారు. సాయంత్రం జనసేనాని తిరుపతి వచ్చారు. శుక్రవారం ఉదయం పవన్, నాదెండ్ల మనోహర్ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత పార్టీలో నాదెండ్ల జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. ఒక్క అసెంబ్లీ, లోకసభ స్థానంలో కూడా గెలవలేదు. పైగా డిపాజిట్లు కోల్పోయింది.

 జనసేనలోకి నాదెండ్ల, జీర్ణించుకోలేకపోతున్న నేతలు

జనసేనలోకి నాదెండ్ల, జీర్ణించుకోలేకపోతున్న నేతలు

2019లో తిరిగి పుంజుకుందామని భావిస్తోంది. ప్రత్యేక హోదాపై ఉద్యమించడం ద్వారా ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో పలువురు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ వంటి నేత పార్టీకి రాజీనామా చేసి, జనసేనలోకి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నాదెండ్లకు క్లీన్ ఇమేజ్ ఉంది.

తెలంగాణకు ఇచ్చి మాకివ్వరా, జగన్ దొరికిపోయారు!: మోడీపై బాబు, పవన్‌కు ప్రశ్నతెలంగాణకు ఇచ్చి మాకివ్వరా, జగన్ దొరికిపోయారు!: మోడీపై బాబు, పవన్‌కు ప్రశ్న

 తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు

తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు

నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. ఇతను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు కొడుకు. మనోహర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీయే పట్టా పొందారు.

 కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో

కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో

నాదెండ్ల మనోహర్ 2011 జూన్ నెలలో స్పీకర్ అయ్యారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. స్పీకర్‌గా ఎన్నికకాకముందు ఆయన డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో పని చేశారు. ఏపీ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా చేశారు. ఆ సమయంలో ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇతను టెన్నిస్ ఆడుతారు. పలు పోటీల్లో పాల్గొన్నారు. 1986లో నేషనల్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించారు.

 వైసీపీలోకి వెళ్తారనీ ప్రచారం కానీ, నాడే పవన్‌తో భేటీ

వైసీపీలోకి వెళ్తారనీ ప్రచారం కానీ, నాడే పవన్‌తో భేటీ

నాదెండ్ల మనోహర్ జూన్ నెలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. అప్పుడే ఆయన పార్టీ మారుతారనే చర్చ సాగింది. పవన్, నాదెండ్లలు అప్పుడు దాదాపు రెండు గంటల పాటు భేటీ అయ్యారు. అంతకుముందు ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా సాగింది. కానీ ఆయన అప్పుడు పవన్‌తో భేటీ అయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

Recommended Video

హైదరాబాద్ లో పవన్, నాదెండ్ల మనోహర్ భేటి

English summary
former speaker of United Andhra Pradesh Nadendla Manohar will join Jana Sena soon. He had one to one meeting with Janasena chief Pawan Kalyan in june month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X