వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్ద‌రికీ ఒక‌టే ఆయుధం, బాల‌కృష్ణ‌కు నోటీసులు : వైశ్రాయ్ వ‌ర్సెస్ నాదెండ్ల‌...!

|
Google Oneindia TeluguNews

ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమా లో మ‌రో కొత్త ట్విస్ట్. ఇప్ప‌టి దాకా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా లో వెన్నుపోటు పాట తో ఆర్జీవి వివా దాస్ప‌దం అయ్యారు. ఆ పాట పై టిడిపి శ్రేణులు ఫైర్ అయ్యారు. ఆర్జీవి పై టిడిపి నేత‌లు...టిడిపి నేత‌ల పై ఆర్జీవి కేసులు న‌మోదు చేసుకున్నారు. తాజాగా, బాల‌కృష్ణ తీస్తున్న బ‌యోపిక్ పై మ‌రో వివాదం మొద‌లైంది. ఇప్పుడు రెండు సినిమాల్లోనూ వెన్నుపోటు అంశ‌మే ప్ర‌ధాన అస్త్రంగా మారుతోంది. వైశ్రాయ్ వ‌ర్సెస్ నాదెండ్ల గా సినిమా వార్ మొద లైంది..

బాల‌కృష్ణ సినిమా పై.. వివాదం..

బాల‌కృష్ణ సినిమా పై.. వివాదం..

నంద‌మూరి బాల‌కృష్ణ తీస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ పై సందేహాలు మొద‌ల‌య్యాయి. ఆ సినిమా లో త‌న‌ను విల‌న్ గా చూ పించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర‌రావు సందేహిస్తున్నారు.త‌న‌ను ఆ సినిమా లో విల‌న్ గా చూపిస్తే కోర్టుకు వెళ‌తాన‌ని నాదెండ్ల హెచ్చ‌రిస్తున్నారు. త‌న‌తో ఇంత‌వ‌ర‌కు చిత్ర నిర్మాణ సంస్థ వారెవ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని చెప్పుకొచ్చారు. రాజ‌కీయ అవ‌స‌రాల కోసం త‌న‌ను విల‌న్ గా చూపించే ప్ర‌య‌త్నాలు జ‌రిగుతున్నాయ ని..నెగ‌టివ్ గా చూపిస్తున్నార‌నే స‌మాచారం వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. ఈ ప్ర‌య‌త్నాల‌ను తాను ఊరుకోన‌ని నాదెండ్ల చిత్ర యూనిట్ ను హెచ్చ‌రిస్తున్నారు. త‌న‌కు ఉన్న స‌మాచారం ఆధారంగా చిత్ర య‌నిట్ కు చెందిన వారికి నోటీసులు పంపిన‌ట్లు తెలిపారు. హీరో బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు క్రిష్‌, సెన్సార్ బోర్డు స‌భ్యుల‌కు ఈ నోటీసు లు పంపించిన‌ట్లు నాదెండ్ల వెల్ల‌డించారు.

ఎయిర్ షోకు నిరాక‌ర‌ణ, ఏపిని దేశంలో భాగంగా చూడ‌టం లేదు : సాధింపులో భాగమే..ఎయిర్ షోకు నిరాక‌ర‌ణ, ఏపిని దేశంలో భాగంగా చూడ‌టం లేదు : సాధింపులో భాగమే..

ఇప్ప‌టికే కేసుల్లో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌..

ఇప్ప‌టికే కేసుల్లో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌..

ల‌క్ష్మీ పార్వ‌తి పుస్త‌కం ఆధారంగా ఆర్జీవి తీస్తున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఇప్ప‌టికే వివాదాస్పదం అయింది. సినిమా లో ఆర్జీవి విడుద‌ల చేసిన వెన్నుపోటు పాట లో చంద్ర‌బాబు ను చూపించ‌టం పై టిడిపి నేత‌లు ఫైర్ అయ్యారు. దీని పై ఆర్జీవికి నోటీసులు ఇచ్చారు. మ‌రి కొంద‌రు టిడిపి నేత‌లు హైకోర్టులో కేసు దాఖ‌లు చేసారు. దీనికి ఆర్జీవి సైతం సీరి య‌స్‌గానే స్పందించారు. వారి కి రివ‌ర్స్ నోటీసులు పంపారు. తాను ఎవ‌రినీ ఉద్దేశ‌పూర్వ‌కంగా అవ‌మానించటం లేద‌ని .. వాస్త‌వాల ఆధారంగానే సినిమాను తీస్తున్నామ‌ని స్ప‌ష్టం చేసారు. ఆర్జీవి సినిమాలో ప్ర‌ధానంగా ఎన్టీఆర్ జీవితంలో ల‌క్ష్మీ పార్వ‌తి ప్ర‌వేశం త‌రువాత జ‌రిగిన ఘ‌ట‌న‌ల ఆధారంగా సినిమా తీస్తున్నారు. ప్ర‌ధానంగా వైశ్రాయ్ హోట‌ల్ ఎపి సోడ్ ను హైలైట్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇది టిడిపి నేత‌ల‌ను రుచించ‌టం లేదు. దీంతో..ఏపిలో అస‌లు ఈ సినిమా విడుద‌ల‌కు అనుమ‌తి వ‌స్తుందా లేదా అనేది కూడా సందేహ‌మే..

వాళ్ల‌కు వైశ్రాయ్‌..వీరికి నాదెండ్ల‌..

వాళ్ల‌కు వైశ్రాయ్‌..వీరికి నాదెండ్ల‌..

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ సినిమా లో వివాదాల జోలికి పోకుండా చిత్రీక‌ర‌ణ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఎన్టీఆర్ కె నాదెండ్ల వెన్నుపోటు అంశాన్ని మాత్రం ప్ర‌ధాన అస్త్రంగా మ‌ల‌చుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇదే అంశం పై ఇప్పుడు నాదెండ్ల ముందుగానే న్యాయ పోరాటానికి దిగారు. ఇప్ప‌టికీ నాదెండ్ల మాత్రం టిడిపి పార్టీ పెట్టిందే తానే అని చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ ను చూపించ‌టం ద్వారా టిడిపికి మైలేజ్ వ‌స్తుంద‌ని బాల‌కృష్ణ భావిస్తున్నారు. ఇక‌, ఇదే ర‌క‌మైన వెన్నుపోటు అంశం వైశ్రాయ్ ఎపిసోడ్ ను ఆర్జీవి త‌న సినిమా లో ప్ర‌ధానంగా చిత్రీక‌రిస్తున్నారు. ఎన్టీఆర్ 1995 లో ఏర‌కంగా ప‌ద‌వీచ్యుతుడైందీ.. ఏ ర‌కంగా రాజ‌కీయాలు చోటు చేసుకుందీ ఈ సినిమా లో చూపిస్తున్న ట్లు స‌మాచారం. దీంతో..ఈ ఎపిసోడ్‌లు చూపిస్తే...రాజ‌కీయంగా ఎన్నిక‌ల వాతావ‌రణంలో త‌మ‌కు న‌ష్టం కలుగుతుంద ని..ప్ర‌ధానంగా చంద్ర‌బాబు ను నెగ‌టివ్ క్యారెక్ట‌ర్ గా చూపిస్తే...ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక సంకేతాలు వ‌స్తాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు రెండు సినిమాల‌కు ఈ వెన్నుపోట్లు ప్ర‌ధాన అంశాలుగా మారుతున్నాయి.

English summary
Nadendla bhaskara Rao issued legal notices to Balakrishna. Nadendla say in NTR bio pic Director planning to show him as a villain in TDP politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X