వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగబాబు కోరిక ... నేనుగానీ ఎంపీ అయితే ఆ పని తప్పక చేస్తా

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ap Assembly Election 2019 : నేనుగానీ ఎంపీ అయితే ఆ పని తప్పక చేస్తా || Oneindia Telugu

ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసినా పొలిటికల్ హీట్ మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు . ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, సెటైర్ల మోతాదు పెరిగిందే కానీ ఏ మాత్రం తగ్గటం లేదు. ఏపీ ఎన్నికల అధికారిపైనా , కేంద్ర ఎన్నికల సంఘంపైనా నిప్పులు చెరుగుతున్న చంద్రబాబు ఢిల్లీ వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు . ఇక చంద్రబాబు విమర్శలపై వైసీపీ నేతలు, ఇటు తెలంగాణా రాష్ట్ర గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు .

<strong>అంబటి సంచలనం...పోలింగ్ రోజు దాడులు చేసింది టీడీపీ నేతలే </strong>అంబటి సంచలనం...పోలింగ్ రోజు దాడులు చేసింది టీడీపీ నేతలే

ఎన్నిక‌ల ప్ర‌చారానికి ముందు నుండీ సంచలనాలకు కేరాఫ్ గా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు సందట్లో సడేమియా అంటూ మరో సంచలనం సృష్టించారు . యూట్యాబ్ ఛాన‌ల్‌లో వ‌రుస సంచ‌ల‌న వీడియోల‌తో వార్త‌ల్లో నిలిచిన మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు తాజాగా మ‌ళ్లీ తన వీడియోలతో హల్ చల్ మొదలు పెట్టారు. న‌ర‌సాపురం ఎంపీగా జ‌న‌సేన త‌రుపున నాగ‌బాబు పోటీ చేసిన విష‌యం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన కుటుంబం మొత్తం ప్రచారం చేసి దుమ్ము లేపారు .ఈ ద‌ఫా ఎంపీగా గెలిస్తే ఆకాశ‌మే హ‌ద్దుగా ప‌నిచేస్తాన‌ని నాగ‌బాబు త‌న యూట్యూబ్ చానల్లో పేర్కొన‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Naga Babus wish ... I will do the work if I am MP

తాజాగా ఆయన పోస్ట్ చేసిన యూట్యూబ్ వీడియోలో "చాలా రోజుల త‌రువాత మ‌ళ్లీ మీ ముందుకు వ‌చ్చా. తాజాగా జ‌రిగిన‌ ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేశాను. ఫ‌లితం కోసం ఎదురుచూస్తున్నాను. ఈ నియోజ‌క వ‌ర్గం ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఫ‌లితం ఎలా వ‌స్తుందో తెలియ‌దు. అయితే ఇక్క‌డ గెల‌వ‌డం నాకు చాలా ముఖ్యం. అయితే పాజిటీవ్ రిజ‌ల్టే వ‌స్తుంద‌ని భావిస్తున్నా. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌జ‌లు నాపై చూపిన ప్రేమ‌కు నా జీవితాన్ని వాళ్ల‌కి అంకితం చేయాల‌నిపించింది. నేను ఎంపీగా గెలిస్తే హ‌ద్దులు లేకుండా ప‌నిచేస్తా. ఒక ఎంపీ ఏం చేయ‌గ‌ల‌డో..ఎంత చేయ‌గ‌ల‌డో చేసి చూపిస్తా" అని ఫేస్‌బుక్ లైవ్ ద్వారా నాగ‌బాబు తన మనసులోని కోరిక చెప్పారు. అయితే ఇది చూసిన నెటిజన్లు ఆయన కోరిక ఫలిస్తుందా లేదా అన్న చర్చల్లో పడ్డారు. ప్రస్తుతం ఆయన యూట్యూబ్లో షేర్ చేసిన ఈ వీడియో ఆసక్తికరంగా మారింది.

English summary
Nagababu was contesting as the Narasapur MP in the recent elections. He creating sensation with his videos . I'm looking forward to the result. Thank you for all the seven assembly constituencies in this lok sabha constituency. The result is unknown. But winning here is very important to me. If I win as MP, I will work without boundaries. An MP can show what he can do, "said Naga Babu's wish in his mind via Facebook Live.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X