• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్ కళ్యాణ్ ఓ బ్రహ్మాస్త్రం అంటూ ఎమోషనల్ అయిన నాగబాబు ... ఎందుకంటే

|

పవన్ కళ్యాణ్ ఒక బ్రహ్మాస్త్రం అంటూ మెగా బ్రదర్ నాగబాబు ఎమోషనల్ అయ్యారు. అమరావతి పార్టీ కార్యాలయంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నాయకులతో సమావేశం అయిన తరువాత ఆయన జనసేన పార్టీ గురించి, జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. అసలు ఇంతకీ నాగబాబు ఏం చెప్పాలనుకున్నారు.. ఎందుకు ఇంతగా ఎమోషనల్ అయ్యారు అంటే అందుకు కారణాలు లేకపోలేదు .

పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..! అలా చేస్తే అభిమానులు నన్ను ముక్కలు చేస్తారు..!

నెవర్ క్వశ్చన్ టూ యువర్ లీడర్ .. పవన్ ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అవ్వండన్న నాగబాబు

నెవర్ క్వశ్చన్ టూ యువర్ లీడర్ .. పవన్ ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అవ్వండన్న నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు జనసేన పార్టీలో కీలకంగా మారిన నేత . జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీలోనూ, అలాగే పార్టీ కో ఆర్డినేషన్ ఇంచార్జ్ గానూ బాధ్యులు . వన్ కళ్యాణ్ గొప్ప విజన్ ఉన్న నాయకుడు అని, అలాంటి నాయకుడు ఏం చెప్పినా సరే బ్లైండ్ గా ఫాలో అవ్వాల్సిందే నని, తిరిగి ఆయన ఎవరు ప్రశ్నించొద్దు అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు. నెవర్ క్వశ్చన్ టూ యువర్ లీడర్ అంటూ నాగబాబు జనసేన పార్టీ నాయకులను ఉద్దేశించి పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ కంటే తాను ఇంట్లో పెద్ద వాడినైనా తాను పార్టీ పరంగా ఏనాడు ప్రశ్నించలేదని, ప్రశ్నించబోనన్నారు. పార్టీ నేతలు కూడా విజన్ ఉన్న నాయకుడు కాబట్టి పవన్ కళ్యాణ్ బాటలో ముందుకు సాగాలని ఆయన తెలిపారు. జనసేన పార్టీలో ఎంతోమంది నాయకులు తెరవెనుక ఉండి పార్టీని నడిపిస్తున్నారని వారందరికీ తాను రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. అయితే జనసేన పార్టీలో తాజాగా నాదెండ్ల మనోహర్ విషయంలో బాగా అసంతృప్తితో ఉన్న జనసైన్యానికి ఈ సూచన చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది .

రాష్ట్రం కోసం నిరంతరం తపించే వ్యక్తి పవన్ అని ఎమోషనల్ అయిన నాగబాబు

రాష్ట్రం కోసం నిరంతరం తపించే వ్యక్తి పవన్ అని ఎమోషనల్ అయిన నాగబాబు

పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ గా జనసేన పార్టీలో కీలకంగా బాధ్యత నిర్వహిస్తున్న నాగబాబు, జనసేన పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా పనిచేయాలని అనుకుంటే ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు . అలాగే పార్టీ బలోపేతం చేసేందుకు తనను పార్టీ కో ఆర్డినేషన్ ఇంచార్జ్ గా మరో బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. గత నాలుగేళ్లలో పవన్ కళ్యాణ్ ను రెండుసార్లు మాత్రమే కలిసానని, అది కూడా ఫంక్షన్లలో అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం కోసం నిరంతరం తపించే వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లోకి రావడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని నాగబాబు పేర్కొన్నారు.

జనసేన ఓ మహావృక్షం .. దాన్ని బ్రతికించుకుందాం అన్న మెగా బ్రదర్

జనసేన ఓ మహావృక్షం .. దాన్ని బ్రతికించుకుందాం అన్న మెగా బ్రదర్

ఇక జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ జనసేన పార్టీ ఒక మహావృక్షం లాంటిదని, అది ఎంత బాగుంటే కార్యకర్తలు ప్రజలు అంత బాగుంటారని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ వృక్షాన్ని బ్రతికిస్తే అది ఎంతో మందికి నిలువ నీడ ఇస్తుందని మెగా బ్రదర్ పేర్కొన్నారు.ఇక అంతే కాదు సినీ గ్లామర్ ఉన్న వ్యక్తి, ఒక విజన్ ఉన్న వ్యక్తి, రాష్ట్రం బాగుపడాలనే నిత్యం పరితపిస్తూ ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పిన మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ కు పార్టీ అధినేతగా ఎన్నో బాధ్యతలు ఉంటాయని అందర్నీ కలుసుకునే అవకాశం లేనప్పుడు అందరికీ అందుబాటులో తానుంటానని, తనను కలవాలని సూచించారు.

ప్రజల కోసం అహర్నిశలు పనిచేసే నాయకుడైన పవన్ కళ్యాణ్ బాటలో ముందుకు నడవాలి తప్ప, ఎవరు ఆయనను కిందికి లాగే ప్రయత్నం చేయొద్దు అంటూ నాగబాబు పేర్కొన్నారు.

బ్రహ్మాస్త్రంగా పవన్ ను వాడుకుందాం .. లోకల్ బాణం గా కాదు అని క్లాస్ పీకిన నాగబాబు .. రీజన్ ఇదే

బ్రహ్మాస్త్రంగా పవన్ ను వాడుకుందాం .. లోకల్ బాణం గా కాదు అని క్లాస్ పీకిన నాగబాబు .. రీజన్ ఇదే

రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం రాజకీయాల్లోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ ఒక బ్రహ్మాస్త్రం అని నాగబాబు అభిప్రాయపడ్డారు. ఇక ఆయనను అదే తరహాలో ఉపయోగించాలి తప్ప లోకల్ బాణంగా ప్రయోగించకూడదని నాగబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. ఇటీవల జనసేన లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏంటో అర్ధమయ్యేలా చెప్తూ నాగబాబు జన సైనికులకు క్లాస్ పీకడం వెనుక నాదెండ్ల మనోహర్ విషయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై జనసేన నేతల అసంతృప్తి ఒక కారణంగా భావించవచ్చు. అంతేకాకుండా గత ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయినప్పటికీ, పవన్ కళ్యాణ్ ఒక గొప్ప నాయకుడు అని జనసేన పార్టీ పైన నమ్మకంతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ గురించి అర్థమయ్యేలా చెప్పడానికి చేసిన ప్రయత్నంగా కూడా నాగబాబు వ్యాఖ్యలపై చర్చ జరుగుతుంది .

English summary
Mega Brother Nagababu is now a prominent leader in the Janasena party. He is also responsible for the Political Affairs Committee janasena , as well as the party co-ordination incharge. He said " Kalyan is a great Visionary leader,Never Question to Your Leader". He said he never questioned the party, even if he was bigger than Pawan Kalyan at home. He added that Pawan Kalyan should move forward as the party leaders are also need to move blindly in the path that the leader shows to us . He emotionally said that Pawan is a brahmasthra ... use that brahmasthra in important times only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X