వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను-నా అవినీతి: 'అధికార', 'ప్రతిపక్షా'లకు నాగబాబు పెట్టిన జబర్దస్త్ పరీక్ష

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన మెగా బ్రదర్ నాగబాబు తాజాగా సరికొత్తగా ముందుకు వచ్చారు. తాము జబర్దస్త్‌లో చేస్తున్నాం కాబట్టి, అలాంటి స్కిట్‌తో మీ ముందుకొస్తున్నామని వీడియోలో ముందే చెప్పారు. తాజా వీడియోలో 'అధికార', 'ప్రతిపక్షా'లకు జబర్దస్త్ పరీక్షపెట్టారు.

 అధికార, ప్రతిపక్షాలకు పరీక్ష

అధికార, ప్రతిపక్షాలకు పరీక్ష

పరోక్షంగా ఏపీలోని అధికార, ప్రతిపక్షాలను ఉద్దేశించి ఈ పరీక్ష పెట్టారు. కంటెంట్ తనది అని, పేరు మీరే పెట్టుకోమని చెప్పారు. ఈ స్కిట్‌లో నాగబాబు ఓ ఉపాధ్యాయుడిగా వచ్చారు. తన ఎదురుగా ఇద్దరు విద్యార్థులను కూర్చోబెట్టుకొని వారి వీపుపై 'అధికార పక్షం', 'ప్రతిపక్షం' అని పేర్కొన్నారు. 2019 ఎన్నికల నేపథ్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థులారా, మీకు ఓ పరీక్ష పెట్టబోతున్నానని, 2019లో మీకు ఇది చాలా ముఖ్యమని, ఈ పరీక్షలో మీరిద్దరు డిస్టింక్షన్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నానని, అది మన రాష్ట్రానికి ఉపయోగకరమని చెప్పారు.

 నేను - నా అవినీతి

నేను - నా అవినీతి

అనంతరం 'నేను - నా అవినీతి' అనే టాపిక్ పైన రాయాలని చెప్పారు. దానికి అధికార, ప్రతిపక్షాలు (విద్యార్థులుగా కూర్చున్న వారు) తమ తమ అవినీతి గురించి రాయడానికి అడిషనల్స్ మీద అడిషనల్స్ తీసుకుంటారు. తన వద్ద ఉన్న అడిషనల్స్ పూర్తిగా ఇచ్చే వరకు వారు అడుగుతూనే ఉంటారు. చివరకు ఓ అడిషనల్ షీట్ మిగులుతుంది. దాని కోసం ఇద్దరు కొట్లాడుతారు. చివరకు దానిని చించేస్తారు.

అవినీతిపై జబర్దస్త్ ఆయుధం

అవినీతిపై జబర్దస్త్ ఆయుధం

వారు పదేపదే అడిషనల్ షీట్స్ తీసుకుంటుండటంతో.. నేను అడిగింది మీ అవినీతి గురించి మాత్రమేనని గుర్తు చేస్తారు. అయితే మొత్తంగా అధికార, ప్రతిపక్షాల అవినీతి ఎంత రాసినా తక్కువే అన్న విషయాన్ని చెప్పేందుకు సింబాలిక్‌గా ఈ స్కిట్ చేశారు. తద్వారా పరోక్షంగా ఏపీలోని అధికార, ప్రతిపక్షాలు భారీ అవినీతిలో కూరుకుపోయాయని చెప్పకనే చెప్పే ప్రయత్నాలు చేశారు.

English summary
Naga Babu Political Message. This skit showcases about 2019 elections and he conveys the message by saying 2019 Elections will be the battle for India's Soul.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X