• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా వస్తువుల్ని, యాప్స్ ని బ్యాన్ చేద్దామన్న నాగబాబు..కొందరు నెటిజన్ల చురకలు

|

భారత్-చైనా దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు,అదేవిధంగా కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమన్న భావన వెరసి భారతీయులు చైనా ఉత్పత్తులను వాడటం మానేయాలన్న వాదన కొత్తగా మొదలైంది. భారతదేశంలో చాలాకాలం నుండి చైనా ఉత్పత్తుల వాడకం అధికంగా ఉంది. నిత్యం ఉపయోగించే వస్తువుల నుండి, సెల్ ఫోన్లు, చైనా వారు తయారుచేసిన సోషల్ మీడియా యాప్ లు వాడకుండా బ్యాన్ చేయాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

  China Goods And Apps బ్యాన్ - Netizens Reaction
   చైనా వస్తువులు, యాప్స్ బ్యాన్ చెయ్యాలని నాగబాబు పిలుపు

  చైనా వస్తువులు, యాప్స్ బ్యాన్ చెయ్యాలని నాగబాబు పిలుపు

  ఇక ఇదే సమయంలో ఇటీవల సంచలనాత్మక వ్యాఖ్యలకు కేరాఫ్ గా మారిన జనసేన నేత నాగబాబు మరోమారు భారత్ చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసక్తికర ట్వీట్ చేశారు. మన దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న చైనా వస్తువులు, సెల్ ఫోన్లు,మొబైల్ యాప్స్ ని బహిష్కరిద్దాం అంటూ నాగబాబు పిలుపునిచ్చారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నాగబాబు మనదేశంలో తయారైన వస్తువులను కొందామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే మన దేశంలో ఉంది చాలా పెద్ద మార్కెట్ అని అన్ని దేశాల వస్తువులు ఇక్కడ అమ్మి సొమ్ము చేసుకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

  స్వదేశీ వస్తువులే వాదదామని చెప్పిన నాగబాబు

  స్వదేశీ వస్తువులే వాదదామని చెప్పిన నాగబాబు

  అదే మన ప్రొడక్ట్స్ ని మనమే కొంటే మన దేశమే లాభపడుతుంది అంటూ నాగబాబు తెలిపారు. మన ప్రొడక్ట్స్ ని మనం కొనడం వల్ల వచ్చే డబ్బు మన దేశంలోనే ఉంటుంది మనమే బాగుపడతామని అన్నారు. అంతేకానీ మన డబ్బుతో బాగుపడి, మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి చూస్తున్న చైనా వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను బ్యాన్ చేద్దామని పేర్కొన్నారు నాగబాబు. అయితే నాగబాబు ట్వీట్ పై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన లభిస్తుంది.కొందరు నాగబాబు చెప్పిన చైనా యాప్స్, చైనా ప్రొడక్ట్స్ వాడకాన్ని బ్యాన్ చేద్దామన్న అభిప్రాయంతో ఏకీభవించారు.

  ముందు మీ కుటుంబ సభ్యులను టిక్ టాక్ మానెయ్యమనండి అంటూ చురకలు

  ముందు మీ కుటుంబ సభ్యులను టిక్ టాక్ మానెయ్యమనండి అంటూ చురకలు

  కొందరు ముందు మీ కుటుంబ సభ్యులను టిక్ టాక్ లాంటివి వాడడం మానేయమని చెప్పండి అంటూ విమర్శించారు.ఇంకొందరు మన జీవితంలో భాగంగా మారిన చైనా వస్తువుల వాడకాన్ని ఆపాలనే ఉద్దేశం మంచిదే అయినా అది ఆచరణలో సాధ్యం కాదని పేర్కొన్నారు. మరికొందరు సెల్ ఫోన్లు, వాచ్ లు ,టీవీలు చాలావరకు ఎలక్ట్రానిక్ వస్తువులు చైనా ప్రొడక్ట్స్ కావడంతో ఇంకేదైనా మెరుగైన ఉపాయం ఆలోచించాలి అంటూ నాగబాబుకు సలహా ఇచ్చారు.

  పెద్దఎత్తున చైనా వస్తువులను బ్యాన్ చెయ్యాలని ప్రచారం .. కానీ సాధ్యమేనా ?

  పెద్దఎత్తున చైనా వస్తువులను బ్యాన్ చెయ్యాలని ప్రచారం .. కానీ సాధ్యమేనా ?

  ఏది ఏమైనా చైనా వస్తువుల వినియోగాన్ని, అలాగే చైనా యాప్స్ వినియోగాన్ని బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా అది ప్రచారంగానే ఉండిపోయింది. అలా ప్రచారం చేస్తున్న వాళ్లు కూడా వాళ్ల చేతిలో ఉన్న సెల్ ఫోన్లు చైనా ఫోన్లు అని గుర్తించకపోవడం గమనార్హం.ఇక అలాంటి సమయంలో సెలబ్రిటీలు చెప్పిన ఎవరు చెప్పినా చైనా ప్రొడక్ట్స్ బ్యాన్ చేయడం సాధ్యమవుతుందా అనేది ఆలోచించాల్సిన విషయమే.

  English summary
  Amid tensions between India and China, an interesting tweet was made by Nagababu. Mega brother has called for the ban of Chinese goods, cell phones and mobile apps Commenting on his Twitter platform.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more