• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే తాట తీస్తా: టీడీపీ నేతలకు రోజా సీరియస్ వార్నింగ్

|

నగరి ఎమ్మెల్యే రోజా తాజాగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్నఆరోపణల నేపధ్యంలో రోజాపై టీడీపీ నేతలు విమర్శల వర్షం కురిపించారు . సామాజిక దూరం అంటే ఇదేనా ? బంతి పూలతో కరోనా రాదా ? లాక్ డౌన్ నిబంధనలు ఇష్టారాజ్యంగా ఉల్లంఘిస్తారా ? వంటి విమర్శలపై రోజా భగ్గుమన్నారు . చిత్తూరు జిల్లా వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా పుత్తూరు సుందరయ్యనగర్ లో బోరుబావి ప్రారంభోత్సవానికి వెళ్ళిన సందర్భంగా రోజాపై వైసీపీ శ్రేణులు బంతి పూలు చల్లి మరీ ఆమెకు ఘన స్వాగతం పలకటంతో మొదలైన మాటల యుద్ధం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. సొంత పార్టీ నేతల్లోనూ అసహనం వ్యక్తం అవుతుంది.

టీడీపీ నేతల విమర్శలకు ఘాటుగా బదులిచ్చిన ఎమ్మెల్యే రోజా

టీడీపీ నేతల విమర్శలకు ఘాటుగా బదులిచ్చిన ఎమ్మెల్యే రోజా

తాజాగా రోజా టీడీపీ నేతల విమర్శలకు ఘాటుగా జవాబిచ్చారు. ఇక నగరి ఎమ్మెల్యే రోజా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని టీడీపీ నేతలు ఆరోపించారు . ఇక దీనిపై స్పందించిన రోజా పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు . తన నియోజవర్గంలోని సుందరయ్యనగర్‌ ప్రజలు నీళ్లు, కరెంట్ లేక ఇబ్బందులు పడుతుంటే గత ప్రభుత్వం ఏమీ చేయలేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఇక తమ ప్రభుత్వం పెద్దమనసుతో ఆ ప్రాంత ప్రజలకు నీళ్లు ఇస్తే దాని కోసం ఆ ప్రాంత ప్రజలు సంతోషంగా తనను ఆహ్వానించారని పేర్కొన్నారు .

పూలు చల్లటం వాళ్ళ ప్రేమకు ప్రతీక .. దానికే రాద్దాంతమా ?

పూలు చల్లటం వాళ్ళ ప్రేమకు ప్రతీక .. దానికే రాద్దాంతమా ?

అయితే అక్కడ వాళ్లు పూలు చల్లుతారని తాను ఊహించలేదని అన్నారు. అక్కడ వారు చేసిన పనిలో వారి ప్రేమ కనిపించిందని పేర్కొన్న రోజా ప్రేమతో వారు చేసిన పనికి ఇబ్బందిపెట్టకూడదని అనుకున్నానని వివరణ ఇచ్చారు . ఇకకోటికి కొబ్బరి చిప్ప దొరికినట్టు దాన్ని టీడీపీ నేతలు పెద్ద రాద్దాంతం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. ప్రజా సంక్షేమం కోసం మంచి పేరు వచ్చే విధంగా పని చేస్తుంటే ఓర్వలేక తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు .

  Tested Negative People And States Situation After ICMR Advises Not to Use Rapid Testing Kits
  తాటాకు చప్పుళ్లకు భయపడను .. తాట తీస్తా అన్న నగరి ఎమ్మెల్యే

  తాటాకు చప్పుళ్లకు భయపడను .. తాట తీస్తా అన్న నగరి ఎమ్మెల్యే


  ఇక తాటాకు చప్పుళ్లకు భయపడమని ఆమె టీడీపీ నాయకులను ఉద్దేశించి పేర్కొన్నారు . సోషల్ మీడియా ఉందికదాని పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే చూస్తూ ఊరుకోనని, తాట తీస్తానని రోజా హెచ్చరికాలు జారీ చేశారు . కరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కావటం, అక్కడజనాలు గుమి కూడటం జరుగుతుందని సామాజిక దూరంపాటించకుండా ఉంటె కరోనా ప్రబలే అవకాశం వుందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు . ఇక టీడీపీ ప్రతీ దాన్ని రాజకీయం చేస్తుందని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా రోజా ఎపిసోడ్ లో కూడా జరిగింది ఇదే . రోజాపై బంతిపూలు చల్లుతూ స్వాగతం చెప్పటమే తాజా వివాదానికి , తాజా మాటల యుద్ధానికి కారణం .

  English summary
  TDP leaders have been criticizing the marigold flowers showering on Roja in welcoming her. Responding to this, Roja warned that she would go mad if she got angry she will punish them . YCP MLA Roja has criticized the previous government for not doing anything if the people of Sundaraiah nagar in her constituency are suffering water, current trouble. She said that the people of the area would gladly invited her for her government provide water to the people of the area.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X