వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నింట అనుకూలం: రాజధాని రేసులో నాగార్జునసాగర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagarjuna Sagar in race for new Andhra Pradesh capital
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాజధాని రేసులో నాగార్జున సాగర్ కూడా ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డిటిసిపి) నాగార్జున సాగర్ కొత్త ఆంధ్రప్రదేశ్ రాజధానిగా సూచిస్తోందని సమాచారం. రాజధాని పైన ఏర్పాటు చేసిన సబ్ కమిటీకి ఇందుకు సంబంధించిన ప్రెజంటేషన్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఏర్పాటైన కమిటీ విశాఖపట్నం, కర్నూలు, దొనకొండ (ప్రకాశం జిల్లా), హనుమాన్ జంక్షన్ (కృష్ణా) తదితరాలను పరిశీలిస్తున్నారు. వీటితో పాటు గుంటూరు జిల్లాలో గల నాగార్జున సాగర్‌ను కూడా పరిశీలిస్తున్నారు.

నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయితే అన్నింటి పరంగా బాగుంటుందని డిటిసిపి అధికారులు చెబుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాంతం మధ్యన ఉంది. రాజధానికి అవసరమైన నీటి కొరత ఉండదు. అలాగే ఇప్పటికే ఉన్న రన్ వే కండిషన్ కూడా బాగుంది. ఇలా పలు కోణాల్లో ఆలోచిస్తే నాగార్జున సాగర్ రాజధానిగా బెట్టర్ అంటున్నారు.

విశాఖపట్నం, కర్నూలు, దొనకొండలలో రాజధాని ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే, ఈ ప్రాంతాల్లో కొన్ని డిస్ అడ్వంటేజెస్ ఉన్నాయని కొందరు చెబుతున్నారు. విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న నగరమైనప్పటికీ... భౌగోళికంగా అన్ని ప్రాంతాలకు దగ్గరగా ఉండదని, భారీగా వర్షాలు కురిస్తే కర్నూలు జలమయమై, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, దొనకోండ బ్యాక్ వర్డ్ అని చెబుతున్నారు. కొత్త రాజధాని కోసం కమిటీ భారీ కసరత్తు చేస్తోంది.

English summary
The Directorate of Town and Country Planning favours Nagarjuna Sagar as the new capital city of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X