వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజేష్, స్వాతి పారిపోవడానికి ప్లాన్, కానీ, 'నా కొడుకు చనిపోయాడు'

By Narsimha
|
Google Oneindia TeluguNews

నాగర్‌కర్నూల్: సుధాకర్‌రెడ్డిని హత్య చేయడమే బెస్ట్ ప్లాన్‌గా స్వాతి భావించింది. ఈ ప్లాన్ ద్వారానే ప్రయోజనం కలుగుతోందని భావించారు. పారిపోదామని రాజేష్ చేసిన ప్రతిపాదనను స్వాతి వారించింది.

ప్రియుడి కోసం పిల్లలకు దూరంగా, సుధాకర్‌రెడ్డికి గాయమిలా, రాజేష్‌కు స్వాతి గిప్ట్‌లుప్రియుడి కోసం పిల్లలకు దూరంగా, సుధాకర్‌రెడ్డికి గాయమిలా, రాజేష్‌కు స్వాతి గిప్ట్‌లు

ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు: ఐసీయూలో చీకట్లోనే, నోట్లో గుడ్డలతో, రాజేష్‌పై అనుమానమిలా..ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు: ఐసీయూలో చీకట్లోనే, నోట్లో గుడ్డలతో, రాజేష్‌పై అనుమానమిలా..

నవంబర్ 27వ, తేదిన తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న సుధాకర్‌రెడ్డిని ప్రియుడు రాజేష్‌తో కలిసి స్వాతి హత్య చేయించింది.అయితే రాజేష్‌ను సుధాకర్‌రెడ్డి స్థానంలో కి తీసుకురావాలని స్వాతి తీవ్రంగా ప్రయత్నించింది.

ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు: ఆసుపత్రిలోనే రాజేష్ ఆత్మహత్యాయత్నం, అన్నా, స్వాతి ఎక్కడంటూ యాక్షన్...ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు: ఆసుపత్రిలోనే రాజేష్ ఆత్మహత్యాయత్నం, అన్నా, స్వాతి ఎక్కడంటూ యాక్షన్...

అయితే తన ప్లాన్‌లో భాగంగా స్వాతి కొంత సక్సెస్ అయింది. కానీ, చివరికి అసలు విషయం వెలుగు చూసింది. సాక్ష్యాధారాలతో స్వాతి, రాజేష్ పన్నిన కుట్రను పోలీసులు బయటపెట్టారు.

ఇంట్లో నుండి పారిపోవాలని రాజేష్ ప్రతిపాదన

ఇంట్లో నుండి పారిపోవాలని రాజేష్ ప్రతిపాదన

రాజేష్, స్వాతి మధ్య సుమారు రెండేళ్ళుగా వివాహేతర సంబంధం కొనసాగుతోందని పోలీసులు గుర్తించారు. అయితే తమ మధ్య వివాహేతర సంబంధానికి సుధాకర్ రెడ్డి అడ్డుగా ఉన్నాడని వారిద్దరూ భావించారు. అయితే ఇంట్లో నుండి పారిపోదామని రాజేష్ స్వాతి వద్ద ప్రతిపాదించాడు. కానీ, ఈ ప్రతిపాదనకు స్వాతి అంగీకరించలేదు. పిల్లలున్నారని సుధాకర్ రెడ్డి అడ్డు తొలగించుకొంటే అన్ని సవ్యంగా సాగుతాయని స్వాతి భావించింది. కానీ, కథ అడ్డం తిరిగింది.

రాజేష్‌ను విచారించిన పోలీసులు

రాజేష్‌ను విచారించిన పోలీసులు

హైద్రాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్‌ను గురువారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రి నుండి రాజేష్‌ను నేరుగా నాగర్‌కర్నూల్‌కు తీసుకెళ్ళారు. నాగర్‌కర్నూల్‌కు తీసుకెళ్ళారు. జిల్లా ఎస్పీ రాజేష్‌ను విచారించారు. సుధాకర్ రెడ్డి హత్యకు చోటు చేసుకొన్న పరిణామాలపై విచారణ చేశారు. స్వాతి పరిచయంతో పాటు పలు విషయాలపై ఆరా తీశారు.

మూడు గంటల పాటు గాలింపు

మూడు గంటల పాటు గాలింపు


రాజేష్ విచారణ సమయంలో ఆయన ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు స్వాతి నివాసంలో మూడు గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను పోలీసులు సేకరించారు. స్వాతి నివాసంలో భారీగా ఖాళీ బీర్ సీసాలున్నట్టు గుర్తించారు.

కొడుకు చనిపోయాడనంటున్న రాజేష్ తల్లి

కొడుకు చనిపోయాడనంటున్న రాజేష్ తల్లి

తన కొడుకు చనిపోయాడని రాజేష్ తల్లి చెబుతున్నారు. రాజేష్ చేసిన ఘటనలపై ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. నా కొడుకును ఏమైనా చేయాలని పోలీసులను కోరుతోంది. విషయం తెలిసినప్పుడు రాజేష్ చనిపోయాడని రాజేష్ తల్లి ప్రకటిస్తోంది.మూడు మాసాల క్రితమే రాజేష్ తండ్రి శ్రీనివాస్ చనిపోయాడు.

ఆసుపత్రి బిల్లులు ఎలా చెల్లించాలి

ఆసుపత్రి బిల్లులు ఎలా చెల్లించాలి


రాజేష్ ట్రీట్‌మెంట్ కోసం చేసిన ఖర్చును చెల్లించాలని పోలీసులు కొరుతున్నారని రాజేష్ తల్లి చెప్పారు. అయితే తనకు అంత స్తోమత తమకు లేదన్నారు.తమ కుటుంబానికి అప్పులున్నాయని చెప్పారు. ఎకరం భూమిని విక్రయించి ఎలా చెల్లించాలని ఆమె ప్రశ్నిస్తోంది.

English summary
Nagarkurnool sp interrogated rajesh over sudhakar reddy murder issue on thursday. Police search for 3 hours in Swati's house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X