• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీట్లా, కోరుకున్న స్థానాలా, చంద్రబాబులా ఆలోచించండి!: కోదండరాంకు కాంగ్రెస్ షాక్

|

హైదరాబాద్: టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం, కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి, సీపీఐలు మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. సీట్ల పంపకాలపై పార్టీలలో అసంతృప్తి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కోదండరాం పార్టీ, సీపీఐ కూటమి నుంచి వెళ్లిపోతాయనే ప్రచారం సాగింది. కానీ దీనిని ఆ పార్టీ నేతలు కొట్టి పారేస్తున్నారు.

  Telangana Elections 2018 : మహాకూటమిలో పూర్తైన సీట్ల పంపిణీ..!

  అదే సమయంలో మహాకూటమి భాగస్వామ్య పార్టీలకు ఒకటీ, రెండు రోజుల్లో సీట్ల పంపకాలు జరగనున్నాయి. ఆదివారంలోగా అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా విడుదల చేయాలని టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐలు నిర్ణయించాయి. ఈ మూడు పార్టీల ముఖ్యనేతలు మంగళవారం సమావేశమై చర్చించారు. తొలి జాబితాలో అన్ని పార్టీల తరపున ప్రధాన నేతల టిక్కెట్లను ప్రకటించనున్నారు. రెండు రోజుల్లో సీట్ల పంపకాలపై ఉత్కంఠకు తెరపడనుంది.

  సర్వేలన్నీ టీఆర్ఎస్ వైపే, నువ్వు గెలుస్తున్నావ్.. లక్కీ, అదే జగన్ కొంపముంచింది: కేసీఆర్ జాగ్రత్తలు

  కచ్చితంగా గెలిచే స్థానాల కోసం టీడీపీ

  కచ్చితంగా గెలిచే స్థానాల కోసం టీడీపీ

  ఆయా పార్టీలకు సీట్ల కేటాయింపు విషయమై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణ జన సమితి, సీపీఐలు కూడా తమకు కావాల్సిన సీట్లపై గట్టిగానే మాట్లాడుతున్నాయి. మరోవైపు, తమకు సీట్లు ముఖ్యమే, అలాగే కూటమి నుంచి విడిపోమని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రం సీట్ల కంటే కేసీఆర్ ఓటమి, కూటమి గెలుపు ముఖ్యమని చెబుతోంది. ఖచ్చితంగా గెలిచే స్థానాలను తీసుకోవాలని భావిస్తోంది.

  కోదండరాం అసంతృప్తి

  కోదండరాం అసంతృప్తి

  తెలంగాణలో 36 స్థానాలు, వాటిల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను తెలంగాణ జన సమితి గతంలో కాంగ్రెస్‌కు అందించింది. దీనిపై చర్చలు జరిగాయి. కనీసం ఒక్కో పార్లమెంటు స్థానంలో ఒక అసెంబ్లీ స్థానం చొప్పున రాష్ట్రంలో 17 సీట్లను కేటాయించాలని ప్రతిపాదించింది. ఈ విషయంపై ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర బాధ్యుడు కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కోదండరాం చర్చించారు. ఈ చర్చల్లో కోదండరాం పార్టీకి ఎనిమిది, తొమ్మిది స్థానాలు ఇస్తామని చెప్పారు. దీనిపై కోదండ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు తమ పార్టీకి బలం లేనిచోట ప్రతిపాదిస్తున్నారంటున్నారు. అయితే తెలంగాణ జన సమితికి పదిలోపు సీట్లు ఇచ్చి, స్థానాలు మార్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది.

  సీట్ల సంఖ్యనా, కోరుకున్న స్థానాలు.. కాంగ్రెస్ అల్టిమేటం

  సీట్ల సంఖ్యనా, కోరుకున్న స్థానాలు.. కాంగ్రెస్ అల్టిమేటం

  బలం లేని స్థానాలను ఒకటి రెండు ఎక్కువగా ఇచ్చినా ఉపయోగం లేదనే అభిప్రాయంతో టీడీపీ ఉంది. అదే అంశంపై తెలంగాణ జన సమితిని, సిపిఐని టీడీపీ ఒప్పించే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా ఈ మూడు పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తాయా అనేది చూడాలి. సీట్ల సంఖ్యా కావాలా లేక కోరుకున్న స్థానాలు కావాలా... ఈ రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోవాలనే ప్రతిపాదననూ కాంగ్రెస్‌ పార్టీ టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితిల ముందు ఉంచిందని తెలుస్తోంది. టీడీపీ మాత్రం గెలిచే సీట్ల పైనే దృష్టి సారించింది. ఎన్ని సీట్లు కావాలన్న దానిపై పెద్దగా పట్టింపులేదు. చంద్రబాబు నుంచే కాంగ్రెస్ పార్టీ సంతోషించే ప్రకటన వచ్చింది. దీనిపై కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబులా ఆలోచించాలని కాంగ్రెస్ నేతలు ఇతర కూటమి పార్టీలకు చెబుతున్నారు.

  తక్కువ సీట్లు వద్దు, కూటమిని విడువం

  తక్కువ సీట్లు వద్దు, కూటమిని విడువం

  సీబీఐ నేత చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ... కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నాయని చెప్పారు. తమకు రెండు సీట్లు అని చెబుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని, అదే సమయంలో కూటమి నుంచి బయటకు వెళ్లేది లేదన్నారు. కేసీఆర్‌ను ఓడించేందుకు కూటమిలో కొనసాగుతామన్నారు. తాను హుస్నాబాద్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. రామగుండం నుంచి పోటీ చేస్తానని ప్రచారం సాగుతోందని, అది నిజం కాదన్నారు.

  కాంగ్రెస్‌లో మూడు రకాల జాబితా

  కాంగ్రెస్‌లో మూడు రకాల జాబితా

  ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ తన జాబితాను నవంబర్ తొలి వారంలో విడుదల చేయనుంది. ఎంపిక ప్రక్రియ పకడ్బంధీగా జరుగుతోందని చెప్పారు. మహాకూటమిలో పొత్తులు, సీట్లు కొలిక్కి రాకపోవడం, మరోవైపు కాంగ్రెస్‌లో పోటీ ఎక్కువగా ఉండటంతో ఆలస్యమవుతోందని చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై వివిధ కసరత్తుల అనంతరం స్క్రీనింగ్‌ కమిటీ ప్రాథమికంగా మూడు జాబితాలను రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి పోటీ లేకుండా, విధిగా ప్రకటించాల్సిన అభ్యర్థుల జాబితా ఒకటి. ఇందులో కాంగ్రెస్‌ ముఖ్యనేతలు బరిలో దిగే 40 స్థానాలు ఉన్నాయి. రెండో జాబితాలో ఇద్దరు అభ్యర్థులు పోటీపడుతున్న స్థానాలు. సర్వేలు, సామాజిక సమీకరణల ఆధారంగా టిక్కెట్ ఇస్తారు. మూడో జాబితాలో ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది పోటీపడిన సీట్లు. ఆశావహులతో ఈ జాబితాను ప్రాధాన్యతా క్రమంలో తయారు చేశారు.

  అసంతృప్తులకు బుజ్జగింపులు

  అసంతృప్తులకు బుజ్జగింపులు

  పొత్తులో భాగంగా కొన్ని స్థానాలు టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐకి పోగా కాంగ్రెస్ 90కి అటు ఇటు స్థానాల్లో పోటీ చేయవచ్చు. కాంగ్రెస్ గెలుపొందే స్థానాలు కూడా ఇందులో ఉండే అవకాశాలు ఉండొచ్చు. ఈ నేపథ్యంలో టిక్కెట్లు దక్కని వారిని బుజ్జగించడం, వారి మద్దతును కూడగట్టేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.

  టిక్కెట్ల పంపిణీ తర్వాత ఇది చాలా కీలకమని భావిస్తోంది. తిరుగుబాటు అభ్యర్థులు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా పీసీసీ తీసుకోవాల్సి ఉంది.

  English summary
  Andhra Pradesh chief minister and TDP national president N Chandrababu Naidu has reportedly given his nod to seat sharing formula primarily proposed by the Congress party for formation of Mahakutami
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X