వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ న‌డిబొడ్డున..సై..! ధ‌ర్మ పోరాట దీక్ష : త‌ర‌లి రానున్న జాతీయ నేత‌లు

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Election 2019: AP CM Chandra Babu Started His Dharma Porata Deekhsa At AP Bhavan| Oneindia Telugu

ముఖ్య‌మంత్రి హోదాలో చంద్రబాబు కేంద్ర తీరుకు నిర‌స‌న‌గా ధర్మ పోరాట దీక్ష‌కు దిగారు. ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధానిలో దీక్ష చేప‌ట్టారు. ఏపీ భవన్‌ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరగనున్న దీక్ష కోసం భారీ స్థాయిలో వేదికను ఏర్పాటు చేశారు. చంద్ర‌బాబుకు సంఘీభావంగా జాతీయ నేత‌లు త‌ర‌లి రానున్నారు.

ఢిల్లీలో దీక్ష ఇలా..

ఢిల్లీలో దీక్ష ఇలా..

ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం.. ఆ వెంటనే ఇండియన్‌ హాబిటేట్‌ సెంటర్‌లో టీడీపీపీ సమావేశాన్ని నిర్వహిం చా రు. ఢిల్లీలో దీక్షను ప్రారంభించే ముందు ఉదయం 7 గంటలకు రాజ్‌ఘాట్‌ను సందర్శిం చి మహాతా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఏపీ భవన్‌ చేరుకుని అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాల వే సి 8 గంటలకు దీక్షను ప్రారంభించారు. రాత్రి 8 గంటల వరకు కొనసాగిస్తారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం.. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు కోసం రాష్ట్రప్రభుత్వం, టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటం, ప్రధాని గుంటూరు వచ్చినా.. హోదా, హామీల పై స్పందించకపోవడం, దీనిపై ఆంధ్ర ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని చంద్రబాబు దేశ ప్రజలకు తెలియజేయ‌టం తో పాటుగా ప్ర‌ధాని మోదీ వైఖ‌రి ని ఢిల్లీ వేదిక‌గా నిర‌సించ‌నున్నారు.

బాబు నాతో చెప్పారు కానీ, నిధుల లెక్క అడిగినందుకే, కాంగ్రెస్ దోస్తీకి 4 కారణాలు: గుంటూరులో మోడీబాబు నాతో చెప్పారు కానీ, నిధుల లెక్క అడిగినందుకే, కాంగ్రెస్ దోస్తీకి 4 కారణాలు: గుంటూరులో మోడీ

ఏపి నుండి మ‌ద్ద‌తుగా..

ఏపి నుండి మ‌ద్ద‌తుగా..

ఢిల్లీలో చంద్ర‌బాబు దీక్ష‌కు మ‌ద్ద‌తుగా ఏపి నుండి రెండు రైళ్ల‌ల్లో పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు దారులు త‌ర‌లి వెళ్లారు. ఇక‌, ఏపి నుండి 26 మంది మంత్రులు, 104 మంది ఎమ్మెల్యేలు, 43 మంది ఎమ్మెల్సీలు, 20 మంది పార్టీ ఎంపీలు, మరో 15 మం ది కార్పొరేషన్ల చైర్మన్లు, 150 మంది పార్టీ ముఖ్య నేతలు, 150 మంది పార్టీ కార్యవర్గ సభ్యులు ధర్మ పోరాట దీక్షలో పాల్గొంటున్నారు. ఢిల్లీకి చెందిన తెలుగు సంఘాలు, ఎన్జీవోలు, పౌర సంఘాలకు చెందిన సుమారు 4,000 మంది హాజ రవుతారని టీడీపీ అంచనా. మంత్రులు, ఇతర ముఖ్యుల కోసం దేశ రాజధానిలోని వివిధ హోటళ్లు, హాస్టళ్లు, టీటీడీ గె స్ట్‌ హౌస్‌లో వసతి సౌకర్యాలు కల్పించారు. కార్యకర్తలకు వసతి, రవాణా, ఫుడ్‌ కోర్ట్‌, సాంకేతిక సహాయం, రైల్వే, ఎయిర్ పోర్ట్‌ వద్ద హెల్ప్‌ డెస్క్‌ కోసం లైజన్‌ ఆఫీసర్లను నియమించారు. సమన్వయకర్తలను కూడా రాష్ట్రప్రభుత్వం నియమిం చింది. మరోవైపు.. చంద్రబాబు దీక్షకు మద్దతుగా రాష్ట్రంలో కూడా ఎక్కడికక్కడ టీడీపీ ఆధ్వర్యంలో దీక్షలు, నిరసన కార్యక్రమాలు కొన‌సాగించాల‌ని పార్టీ నిర్ణ‌యించింది.

త‌ర‌లి రానున్న జాతీయ నేత‌లు..

త‌ర‌లి రానున్న జాతీయ నేత‌లు..

చంద్రబాబు చేస్తున్న దీక్ష‌కు మ‌ద్ద‌తుగా జాతీయ ప్ర‌ముఖులు వ‌చ్చి దీక్ష‌కు సంఘీభావం వ్య‌క్తం చేయ‌నున్నారు. కాంగ్రె స్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఎన్‌సీపీ అధినేత శరద్‌ ప వార్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబుల్లా, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత డెరిక్‌ ఓబ్రెయిన్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజాతోపాటు ఇతర ప్రతిపక్షాల ముఖ్యనేతలు, ప్రతినిధులు కూడా దీక్షా శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం ప్రకటించే అవకాశముందని టీడీపీ వర్గాలు తెలిపాయి. దీక్ష అనంతరం ముఖ్య‌మంత్రి కేంద్ర తీరును ఢిల్లీలోని దీక్ష వేదికగా ఎండ‌గ‌ట్ట‌నున్నారు. ఇక‌, మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో చంద్రబాబు రాష్ట్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులతో కలిసి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో సమావేశమవుతారు. ఏపికి జరిగిన అన్యాయంపై వినతి పత్రం సమర్పిస్తారు.

English summary
AP CM Chandra Babu started his Dharam porata Deekhsa at AP Bhavan in Delhi against central Govt negligence on AP. National Leaders coming to support Babu on his Deeksha. Many people from AP participating in this Deeksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X