వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ బిజెపి మంత్రులు ఔట్!?: వారికి బాబు ప్రధాన్యత, 63 మందిపై అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల ఉప ఎన్నికల తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల ఉప ఎన్నికల తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు.

మహానుభావుడు వస్తాడనుకున్నా, కానీ, జగన్ వ్యాపారం చేసుకొని ప్రశాంతంగా గడపాలి: జెసిమహానుభావుడు వస్తాడనుకున్నా, కానీ, జగన్ వ్యాపారం చేసుకొని ప్రశాంతంగా గడపాలి: జెసి

 మరోసారి మంత్రివర్గ విస్తరణకు ఛాన్స్

మరోసారి మంత్రివర్గ విస్తరణకు ఛాన్స్

ఇందులో భాగంగా చంద్రబాబు మరోసారి తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల ఆయన మంత్రివర్గ విస్తరణ జరిపారు. 2019 ఎన్నికల కోసం మరోసారి ఆయన కొందరిని తప్పించి, మరికొందరిని తీసుకోనున్నారని తెలుస్తోంది.

 రెడ్లకు, బీసీలకు ప్రాధాన్యత

రెడ్లకు, బీసీలకు ప్రాధాన్యత

మరోసారి విస్తరణ జరిపి రెడ్లకు, బీసీలకు మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం. మరోవైపు, ప్రస్తుతం ఉన్న ఇద్దరు బిజెపి మంత్రులను తప్పించి, అదే పార్టీకి చెందిన మరో ఇద్దరిని కేబినెట్లోకి తీసుకునే అవకాశముందని సమాచారం.

 ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే

ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే

పార్టీ ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా చంద్రబాబు ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఈ సర్వేలో 63 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది. అధినేత ఆశించిన విధంగా వారి పని తీరు లేదు.

చంద్రబాబు ఇమేజ్ పైనే ఆధారం

చంద్రబాబు ఇమేజ్ పైనే ఆధారం

ఈ 63 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇమేజ్ పైనే ఆధారపడ్డారని తేలింది. ఈ ఎమ్మెల్యేలకు చంద్రబాబు తుది హెచ్చరిక చేయనున్నారని తెలుస్తోంది.

ఓడిపోయిన చోట్ల సరైన అభ్యర్థి కోసం

ఓడిపోయిన చోట్ల సరైన అభ్యర్థి కోసం

మరోవైపు, 2014లో ఓడిపోయిన చోట ఇంచార్జి కంటే సరైన అభ్యర్థులు ఉంటే.. ఆ దిశలోను టిడిపి సర్వే చేస్తోందని తెలుస్తోంది. 2018 నాటికే ఎక్కువ సీట్లలో అభ్యర్థులు ఖరారు అయ్యే అవకాశముందంటున్నారు. తద్వారా వారికి సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు అవకాశమివ్వనున్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu is reportedly mulling over a reshuffle of his cabinet, months after his last rejig. Reports are emerging that the two BJP Ministers in the cabinet will be replaced by another two of the same party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X