అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'ఫోర్త్ లయన్'ను ప్రారంభించిన బాబు: బ్రాండ్ అంబాసిడర్‌గా సాయి కుమార్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విజయవాడ: 'సమాజంలో పోలీసులు కాదు, పోలీసింగ్‌ కనిపించాలి' అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ సీపీ ఎ.బి.వెంకటేశ్వరరావు ప్రజా భద్రత కోసం రూపొందించిన 'ఫోర్త్‌ లయన్‌' స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ యాప్‌ను ఆదివారం ఉదయం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘సమాజంలో పోలీసులు కనిపించకూడదు. పోలీసింగ్‌ కనిపించాలి. సింగపూర్‌లో రోడ్ల మీద పోలీసులు కనిపించరు. ఎక్కడైనా నేరం జరిగితే క్షణాల్లో సంఘటనా స్థలానికి చేరుకుంటారు. అక్కడ అవినీతి లేదు. ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠినంగా శిక్షిస్తారు.' అని చెప్పారు.

పెట్టుబడులు విజయవాడ, రాజధాని అమరావతికి తరలిరావాలంటే శాంతి భద్రతలు పక్కాగా ఉండాలని అన్నారు. నూతన రాజధాని ప్రపంచంలోనే సురక్షితమైన నగరంగా మారుతుందనే నమ్మకం తనకుందని చెప్పారు. త్వరలో ఈ యాప్‌ను రాష్ట్రమంతా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.

 'ఫోర్త్ లయన్'ను ప్రారంభించిన బాబు: బ్రాండ్ అంబాసిడర్‌గా సాయి కుమార్

'ఫోర్త్ లయన్'ను ప్రారంభించిన బాబు: బ్రాండ్ అంబాసిడర్‌గా సాయి కుమార్

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ పోలీస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌, సినీనటుడు సాయికుమార్‌ మాట్లాడుతూ తనకు అవకాశమిస్తే పోలీస్‌ యూనిఫాం వేసుకుని ప్రజల్లోకి వెళ్తానని చెప్పారు. 'ఐఏఎస్‌, ఐపీఎస్‌ కావాలనుకున్నా, నా కల ఈ రోజు ఫలించింది. నాకెంతో గర్వంగా ఉంది' అని అన్నారు.

 'ఫోర్త్ లయన్'ను ప్రారంభించిన బాబు: బ్రాండ్ అంబాసిడర్‌గా సాయి కుమార్

'ఫోర్త్ లయన్'ను ప్రారంభించిన బాబు: బ్రాండ్ అంబాసిడర్‌గా సాయి కుమార్

'కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్‌' అంటూ వివిధ హిట్‌ చిత్రాల్లోని డైలాగులతో అందరినీ అలరించారు. 'కష్టపడి పనిచేయడం ఎలాగో మీ బాబునడుగు, లేదా చంద్రబాబునడుగు' అని ఒక చిత్రంలో చెప్పిన డైలాగ్‌ను ప్రత్యేకంగా వినిపించారు.

'ఫోర్త్ లయన్'ను ప్రారంభించిన బాబు: బ్రాండ్ అంబాసిడర్‌గా సాయి కుమార్

'ఫోర్త్ లయన్'ను ప్రారంభించిన బాబు: బ్రాండ్ అంబాసిడర్‌గా సాయి కుమార్

పోలీస్‌ శాఖకు ఎటువంటి సహకారాన్ని ఇచ్చేందుకైనా సిద్ధమని చెప్పారు. సాయికుమార్‌ పోలీసు కాకపోయినా, పోలీసు రాయబారిగా గొప్పస్థాయిలో నిలిచారని, చరిత్రలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి అభినందించారు.

 'ఫోర్త్ లయన్'ను ప్రారంభించిన బాబు: బ్రాండ్ అంబాసిడర్‌గా సాయి కుమార్

'ఫోర్త్ లయన్'ను ప్రారంభించిన బాబు: బ్రాండ్ అంబాసిడర్‌గా సాయి కుమార్

అనంతరం ఎఫ్‌ఐఆర్‌ ఎట్‌ డోర్‌స్టెప్‌, కోర్ట్‌ మానిటరింగ్‌ సిస్టం విజయవాడ కమిషనరేట్‌లో ఏవిధంగా పనిచేస్తున్నాయో కమిషనర్‌ ఏబీ వెంకటేశ్వరరావు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. అన్నింటినీ ఆన్‌లైన్‌ చేయడం ద్వారా పోలీస్‌ శాఖపై వచ్చే అభియోగాలు తొలగిపోతాయన్నారు.

 'ఫోర్త్ లయన్'ను ప్రారంభించిన బాబు: బ్రాండ్ అంబాసిడర్‌గా సాయి కుమార్

'ఫోర్త్ లయన్'ను ప్రారంభించిన బాబు: బ్రాండ్ అంబాసిడర్‌గా సాయి కుమార్

పోలీస్‌ స్టేషన్లన్నింటినీ జియో ఫెన్సింగ్‌ పద్ధతిలో అనుసంధానించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్‌, అచ్చెన్నాయుడు, రావెల కిశోర్‌బాబు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

English summary
Chief Minister N. Chandrababu Naidu launched a special App, Fourth Lion, of city police here on Sunday. The App is aimed at taking the police services close to the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X