వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేసీబీ నడిపిన చంద్రబాబు: బాలకృష్ణ హ్యాపీ(పిక్చర్స్)

రాయలసీమలో దుర్భిక్ష పరిస్థితుల్ని అధిగమించి రైతులు, ప్రజలను ఆదుకోవడానికే రాష్ట్రంలో నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.

|
Google Oneindia TeluguNews

అనంతపురం: రాయలసీమలో దుర్భిక్ష పరిస్థితుల్ని అధిగమించి రైతులు, ప్రజలను ఆదుకోవడానికే రాష్ట్రంలో నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అందులో భాగంగా ఇప్పటికే గోదావరి, కృష్ణా జలాలను కరువు ప్రాంతాలకు తరలించామన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌కు హంద్రీనీవా నీటిని శుక్రవారం ముఖ్యమంత్రి విడుదల చేసి ప్రాజెక్టును ప్రారంభించారు.

చంద్రబాబు, బాలకృష్ణ

చంద్రబాబు, బాలకృష్ణ

అనంతరం అక్కడే జరిగిన బహిరంగ సభలో సీఎం బాబు మాట్లాడుతూ.. గొల్లపల్లి రిజర్వాయర్‌కు నందమూరి తారక రామారావు రిజర్వాయర్‌గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. దివంగత నేత ఎన్‌టిఆర్ ప్రారంభించిన హంద్రీ నీవాను పూర్తి చేయడం తన అదృష్టమన్నారు.

నీళ్లు వదిలారు

నీళ్లు వదిలారు

హంద్రీ నీవా నీటిని కుప్పంకు తీసుకెళ్తున్నారంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారని, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల వారు అడ్డుకుని ఉంటే అనంతపురానికి నీరోచ్చేదా అని ప్రశ్నించారు. దూరదృష్టితో ప్రణాళికలు రూపొందించి నదులు అనుసంధానం చేస్తున్నామన్నారు. త్వరలో కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామన్నారు.

చంద్రబాబు ఇలా..

చంద్రబాబు ఇలా..

ఎన్‌టిఆర్ తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ నీవా ప్రాజెక్టుల్ని ప్రారంభించినపుడు సైతం విమర్శలు చేస్తూ అడ్డుకున్నారని, అయితే నదుల అనుసంధానం ద్వారా ఆ ప్రాజెక్టులు పూర్తిచేయగలిగామన్నారు.

పూజ

పూజ

పోలవరం ప్రాజెక్టుకు రూ.29 వేల కోట్లు అవసరమని, ప్రస్తుతం రూ.2519 కోట్లకు నాబార్డు అనుమతి లభించిందని సిఎం అన్నారు. గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు మళ్లించి, కృష్ణానది నుంచి 80 టిఎంసిల నీటిని హంద్రీ నీవా ద్వారా రాయలసీమకు తీసుకొస్తున్నామని అన్నారు. హంద్రీ నీవా నీటితో రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని అన్నారు.

ప్రేయర్

ప్రేయర్

హంద్రీ నీవా ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను కర్నూలు జిల్లామల్యాల నుంచి ఎత్తిపోసి అనంతపురం జిల్లా జీడిపల్లికి తరలించామన్నారు. ప్రస్తుతం జీడిపల్లి నుంచి అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గొల్లపల్లి వరకు తీసుకొచ్చి ఇక్కడి రిజర్వాయర్ నింపుతున్నామన్నారు. ఇక్కడినుంచి మడకశిర మీదుగా హిందూపురానికి తరలిస్తామన్నారు.
అక్కడినుంచి చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్లకు ఈ ఏడాదిలోనే నీటిని తరలిస్తామన్నారు. అలాగే చిత్తూరు జిల్లా కుప్పం, అడవిపల్లి వరకు కృష్ణాజలాలు తరలిస్తామన్నారు.

ప్రార్థన

ప్రార్థన

పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. అంతకుముందు హంద్రీనీవా కాలువకు ముఖ్యమంత్రి గంగపూజ చేసి గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. నీటిని తరలించడంపై బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను సీఎం నెరవేరుస్తున్నారని, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం చంద్రబాబుకే సాధ్యమని బాలకృష్ణ ప్రశంసించారు.

English summary
Andhra Pradesh chief minister N Chandrababu Naidu today asserted that the main aim of the government is to protest interests of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X