వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫలించని బుజ్జగింపులు- ఫిరాయింపులు ఖాయమే- మళ్లీ రానివ్వబోనంటూ చంద్రబాబు హెచ్చరికలు..

|
Google Oneindia TeluguNews

ఏపీలో టీడీపీ నుంచి వైసీపీలోకి ఎమ్మెల్యేల పిరాయింపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కష్టాల్లో ఉన్న తరుణంలో తమ స్వప్రయోజనాలను చూసుకుంటున్నారంటూ మహానాడు వేదికగా అదినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలోనే వీరు వైసీపీ గూటికి చేరే సూచనలున్నాయి. మహానాడు వేళ వైసీపీ వ్యూహాత్మకంగా ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహం చివరకు టీడీపీ పుట్టిముంచేలా కనిపిస్తోంది.

వైసీపీలోకి ఎమ్మెల్యేల జంప్- టీడీపీ ఫిక్సయిపోయిందా ? మహానాడులో నేతల వ్యాఖ్యల వెనుక ?వైసీపీలోకి ఎమ్మెల్యేల జంప్- టీడీపీ ఫిక్సయిపోయిందా ? మహానాడులో నేతల వ్యాఖ్యల వెనుక ?

 గొట్టిపాటితో పాటు ఇతర ఎమ్మెల్యేలకు బాబు హెచ్చరిక...

గొట్టిపాటితో పాటు ఇతర ఎమ్మెల్యేలకు బాబు హెచ్చరిక...

నిన్న టీడీపీ మహానాడు సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రస్తావన వచ్చినప్పుడు అధినేత చంద్రబాబు ఒకింత ఆవేశం, ఆవేదనతో తీవ్రంగా స్పందించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేరి, పదవులు అనుభవించి, పార్టీ ఓటమిపాలైన వెంటనే సొంతలాభం కోసం ఫిరాయించిన ద్రోహులను

తిరిగి టీడీపీలోకి చేర్చుకునేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే, తిరిగి వైసీపీలోకి వెళతారని ప్రచారం జరుగుతున్న గొట్టపాటి రవికుమార్ గురించే అన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉండగా పార్టీలోకి వచ్చి ఇప్పుడు తిరిగి సొంతగూటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే రవి మాత్రమే.

 ఫలించని బుజ్జగింపులు... !

ఫలించని బుజ్జగింపులు... !

రెండురోజుల టీడీపీ మహానాడులో నేతల వ్యాఖ్యలను బట్టి చూసినా, చంద్రబాబు స్పందించిన తీరు చూసినా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు తప్పనిసరిగా కనిపిస్తోంది. అందుకే వీరిపై ఎదురుదాడికి టీడీపీ మానసికంగా సిద్ధమైనట్లు అర్ధమవుతోంది.


వాస్తవానికి నాలుగు రోజుల క్రితం టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ ప్రభుత్వానికి మద్దతిస్తారని ప్రచారం జరిగినా సీఎం జగన్ తో ఎవరూ భేటీ కాలేదు. దీంతో తెరవెనుక బుజ్జగింపులు సాగుతున్నట్లు అర్ధమైపోయింది. అయితే చంద్రబాబు తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే బుజ్జగింపులు కూడా ఫలించలేదని తెలుస్తోంది.

 అప్పుడే ప్రత్యామ్నాయాలపై దృష్టి....

అప్పుడే ప్రత్యామ్నాయాలపై దృష్టి....

ఎమ్మెల్యేలు వైసీపీకి ఫిరాయించనే లేదు. బహిరంగంగా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయడం లేదు. అయినా టీడీపీ మాత్రం కలవరపడుతూనే ఉంది. ఈసారి ఏకంగా వారికి ప్రత్యామ్నాయాలపైనే దృష్టిసారించేస్తోంది. మహానాడు వేదికగా ఫిరాయింపుప్రయత్నాలపై మాట్లాడిన చంద్రబాబు... భవిష్యత్ లో యువత, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు.పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీలు..అనుబంధ సంస్థలను బలోపేతం చేస్తానని,జిల్లా కమిటీలు యాక్టివ్ గా ఉండాలని పిలుపునిచ్చారు. దీంతో ఫిరాయింపులకు చంద్రబాబు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

 ఫిరాయింపులపై నోరెత్తలేని పరిస్ధితి..

ఫిరాయింపులపై నోరెత్తలేని పరిస్ధితి..

గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను అభివృద్ధి పేరుతో పార్టీలో చేర్చుకున్న టీడీపీ... ఇఫ్పుడు కళ్లముందే తమ పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయిస్తుంటే విమర్శించలేని పరిస్ధితికి చేరుకుంది. అదే సమయంలో ఈసారి ఎమ్మెల్యేల ఫిరాయింపుకు చాలా ప్రాధాన్యత ఉంది. అంతా అనుకున్నట్లు జరిగి వైసీపీ చెబుతున్నట్లు ఏడుగురు ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే.. గతంలో వెళ్లిపోయిన ముగ్గురితో కలుపుకుని మొత్తం పది మంది అవుతారు. టీడీపీకి ఉన్న 23 మందిలో పది మంది వెళ్లిపోతే ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోవడంతో పాటు చంద్రబాబు కూడా సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోవాల్సి వస్తుంది. అయినా టీడీపీకి కక్కలేని మింగలేని పరిస్ధితుల్లో ఉండాల్సి రావడం విధి వైచిత్రిగానే చెప్పుకోవచ్చు.

English summary
tdp chief chandra babu naidu warns his party mlas if they defect into ysrcp, won't allow them to come back again. naidu also says that it would not be good for them to defect after enjoyed power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X