వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ గురించా! టైమ్‌వేస్ట్: తేల్చేసిన జలీల్ ఖాన్, ‘విజయసాయి బ్రోకర్‌లా.. 40కోట్లు రిటర్న్ అలానే’

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటానని ఏపీ వక్ఫ్ బోర్డ్ నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. సోమవారం వక్ఫ్ బోర్డ్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. ఛైర్మన్‌గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

 త్వరలో కబ్జా వివరాలు

త్వరలో కబ్జా వివరాలు

అంతేగాక, ఏపీ వక్ఫ్ బోర్డుకు తమిళనాడు తరహా జ్యుడీషియల్ అధికారాన్ని ఇవ్వాలని, బోర్డు అభివృద్ధి కోసం రూ. 100కోట్లు అవసరమని చెప్పారు. ప్రస్తుతం వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎన్ని ఉన్నాయో బయటకి తీసుకొస్తామని, బోర్డు ఆస్తులను కబ్జా చేసిన వారి వివరాలను త్వరలోనే బయటపెడతామని అన్నారు.

 అందుకోసమే ఎన్డీఏ నుంచి బయటకు

అందుకోసమే ఎన్డీఏ నుంచి బయటకు

ఇది ఇలాఉంటే, ఏపీకి అన్యాయం చేస్తోందంటూ కేంద్రంపై జలీల్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి వచ్చిందని చెప్పారు. టీడీపీపై విపక్షాల ఆరోపణలు అవాస్తవమని అన్నారు.

 పవన్ గురించి టైం వేస్ట్!

పవన్ గురించి టైం వేస్ట్!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పైనా జలీల్ ఖాన్ విమర్శలు గుప్పించారు. పవన్ గురించి మాట్లాడటమంటే సమయాన్ని వృథా చేసుకోవడమేనని అన్నారు. అతనో బేస్ లెస్ లీడర్ అని అన్నారు. కాగా, గతంలో బీకాంలో ఫిజిక్స్ అని చెప్పి.. జలీల్ ఖాన్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన మరో పార్టీ: చర్చకు వచ్చేనా?కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన మరో పార్టీ: చర్చకు వచ్చేనా?

బ్రోకర్‌లా విజయసాయి

బ్రోకర్‌లా విజయసాయి

ఇది ఇలా ఉంటే, ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్.. కేంద్ర పక్షమేనని తేలిపోయిందని అన్నారు. బ్రోకర్ పనుల కోసమే ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డిని ఢిల్లీ పంపారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంతో దోస్తి వల్లే ఈడీ అటాచ్ చేసిన రూ.40కోట్ల సొమ్ము తిరిగి వచ్చిందన్నారు.

పవన్ ఇక్కడేం చేస్తున్నారు?

పవన్ ఇక్కడేం చేస్తున్నారు?

పార్లమెంటు సమావేశాల తర్వాత ఎంపీలతో రాజీనామా చేయిస్తాననని జగన్ అనడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎంపీలతో రాజీనామా చేయిస్తున్న జగన్.. ఏ2 నిందితుడు విజయసాయితో ఎందుకు రాజీనామా చేయించరు? అని ఆనందబాబు ప్రశ్నించారు. అవిశ్వాసం పెడితే ఢిల్లీలో పార్టీల మద్దతు కూడగడతానన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏం చేస్తున్నారని మంత్రి నక్కా ఆనందబాబు నిలదీశారు.పవన్‌కు రాష్ట్రం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారని అన్నారు.

English summary
Andhra pradesh minister Nakka Anand Babu and TDP MLA Jaleel Khan fired at Janasena Party president Pawan Kalyan for state issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X