వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నలంద కిశోర్‌ది సహజ మరణం కాదు: రఘురామ, ఉత్తరాంధ్ర జోలికొస్తే ఊరుకోం: మంత్రి అవంతి

|
Google Oneindia TeluguNews

స్వపక్షంలో విపక్షంలా మారిన నరసాపురం వైసీపీ ఎంపీ ఈసారి మంత్రి అవంతి శ్రీనివాసరావు లక్ష్యంగా విమర్శలు చేశారు. నరసాపురంలో తన విజయంలో తన చరిష్మా కూడా ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు రఘురామ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మంత్రి అవంతి శ్రీనివాస్.. జగన్ భిక్షతోనే రఘురామ ఎంపీగా గెలిచారని కామెంట్ చేయడంతో స్పందించారు. భీమిలిలో అవంతి శ్రీనివాస్ జగన్ చరిష్మాతో గెలిచారు.. కానీ నరసాపురంలో తనకు వ్యక్తిగత గుర్తింపు కూడా తోడయ్యిందని స్పష్టంచేశారు. దీనిపై ఇదివరకే చెప్పాను.. ఇప్పుడు చెబుతున్నానని ఉద్ఘాటించారు.

Recommended Video

YSRCP Issued Show Cause Notice To MP Raghu Rama Krishnam Raju || Oneindia Telugu

 నిమ్మగడ్డ వ్యవహారంలో జస్టిస్ కనగరాజ్‌తో మరో పిటిషన్..ఆయనది పోలీస్ హత్యే... : ఎంపీ రఘురామ నిమ్మగడ్డ వ్యవహారంలో జస్టిస్ కనగరాజ్‌తో మరో పిటిషన్..ఆయనది పోలీస్ హత్యే... : ఎంపీ రఘురామ

రాజీనామా అవసరం లేదు..?

రాజీనామా అవసరం లేదు..?

ఎంపీ పదవీకి తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. గత కొంతకాలంగా రఘురామ వైసీపీ నాయకత్వంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్, ప్రభుత్వ నిర్ణయాలు బాహాటంగానే వ్యతిరేకించడంతో.. అతనిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు స్పీకర్‌ను కోరిన సంగతి విదితమే. ఈ క్రమంలో మరోసారి నరసాపురంలో తన విజయంపై రఘురామ చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి.

వర్చువల్ మీటింగ్...

వర్చువల్ మీటింగ్...

కరోనా వైరస్‌పై క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు వర్చువల్ సమావేశం ఏర్పాటు చేయాలని రఘురామ కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నందన... ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి.. నిర్మూలన చర్యలపై చర్చిస్తే బాగుంటుందని కోరారు.

సహజ మరణం కాదు...

సహజ మరణం కాదు...

టీడీపీ నేత నలంద కిశోర్‌ది సహజ మరణం కాదు అని రఘురామ ఆరోపించారు. అతనిని పోలీసులు కర్నూలు తీసుకెళ్లడం వల్లే చనిపోయాడని పేర్కొన్నారు. గంటా శ్రీనివాసరావు గొడవలు ఉంటే.. మంత్రి అవంతి శ్రీనివాసరావు చూసుకోవాలని రఘురామ అన్నారు. కానీ శ్రేణులపై ప్రతాపం చూపించడం ఏంటీ అని ప్రశ్నించారు. ఇటు రాజధానిపై కూడా రఘురామ స్పందించారు. విశాఖ కన్నా అమరావతి రాజధానిగా సరిపోతుందని రాష్ట్రంలో ఎక్కువమంది కోరుకుంటున్నారని తెలిపారు.

కరోనాతోనే మృతి..

కరోనాతోనే మృతి..

రఘురామ ఆరోపణలను మంత్రి అవంతి శ్రీనివాసరావు ఖండించారు. ఉత్తరాంధ్ర వ్యవహారాల జోలికొస్తే ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్ భిక్షతో ఎంపీగా గెలిచి.. విపక్షంలా మాట్లాడటం సరికాదన్నారు. ఆనాడు జగన్‌ను కాదని వెళ్లిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని సూచించారు. కరోనా వైరస్‌తో చనిపోయిన నలంద కిశోర్ మరణాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు.

English summary
nalanda kishore death not natural ycp mp raghu rama krishnam raju alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X