వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వల్ల‌భ‌నేని వంశీ చిక్కుకున్న‌ట్లేనా : నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ : ఎన్నిక‌ల వేళ టెన్ష‌న్‌..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో అధికార పార్టీ అభ్య‌ర్దులు ఒక‌రి త‌రువాత మ‌రొక‌రు ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా, కృష్ణా జిల్లా గన్న వ‌రం సిట్టింగ్ ఎమ్మెల్యే..తాజా ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్దిగా ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీ పై హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి కోర్టు నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింది. అయితే, ఈ కేసు ఎప్పుడో కొట్టి వేసార‌ని..వేధింపుల్లో భాగంగానే ఇప్పుడు తెర మీద‌కు తెస్తున్నారంటూ వంశీ ఆరోపిస్తున్నారు.

వంశీ పై నాన్ బెయిల‌బుల్ వారెంట్..
గ‌న్న‌వ‌రం టిడిపి అభ్య‌ర్ది వ‌ల్ల‌భ‌నేని వంశీ పై వారెంట్‌ జారీ యింది. 2009 సమయంలో వంశీ పై న‌మోదైన ఓ కేసుకు సంబంధించి ఇప్పుడు కోర్టు నుండి వారెంట్ జారీ అయింది. అప్పట్లో ప్ర‌భుత్వం త‌న‌కు ర‌క్ష‌ణ ఇవ్వ‌టం లేదంటూ వ‌ల్ల‌భ‌నేని వంశీ త‌న‌కు తానున‌గా ప్ర‌యివేటు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న నివాసం లో అక్ర‌మంగా ఉంచిన ఆయుధాలు దొరికాయంటూ ఆయ‌న పై కేసు న‌మోదైంది. దీని పై విచార‌ణ జ‌రిగిన త‌రువాత త‌న పై న‌మోదైన కేసును కొట్టి వేయాల‌ని కోరుతూ వంశీ హైకోర్టును ఆశ్ర‌యించారు. క్వాష్ పిటీష‌న్ ను దాఖ‌లు చేసారు . వంశీ అభ్య‌ర్ద‌న మేర‌కు హైకోర్టు అప్పటికే జారీ అయిన వారెంట్ తో పాటుగా కేసును కొట్టి వేసింది. ఇదే స‌మ‌యంలో నాంప‌ల్లి కోర్టులో ఈ కేసుకు సంబంధించి వంశీ హాజ‌రు కాలేదు. దీంతో, తాజాగా తెలంగాణ పోలీసులు కోర్టుకు హాజ‌రు కాలేద‌నే కార‌ణంతో కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేయ‌గా కోర్టు వారెంట్ జారీ చేసింది.

Nampally court issued non bailable warrant against Vallabhaneni Vamsi ..

ఇది రాజ‌కీయ కుట్రే..
ఇదిలాఉండగా, రాజకీయ కక్షతోనే త‌మ‌ను వేధిస్తున్నార‌ని వంశీ ఆరోపిస్తున్నారు. ఈ కేసును హైకోర్టు కొట్టివేసంద‌ని ఆ ఉత్త‌ర్వు కాపీని తాను నాంప‌ల్లి కోర్టుకు నివేదిస్తాన‌ని వంశీ చెబుతు న్నారు. అయితే, ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్రచారం దాదాపు ముగింపు కు రావ‌టం..రాజ‌కీయంగా అక్క‌డ ప‌రిస్థితులు హోరా హోరీగా ఉండ‌టంతో ప్ర‌తీ నిమిషం కీల‌కంగా మారింది. ఈ స‌మ‌యంలో పోలీసులు అదుపులోకి తీసుకొనేందుకు రావ టం.. త‌న పై నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ కావ‌టంతో వంశీ అభిమానుల్లో కొంత టెన్ష‌న్ క‌నిపిస్తోంది. ఈ స‌మ‌యం లో వ‌రుస‌గా ఒక‌రి త‌రువాత మ‌రొక‌రు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న టిడిపి అభ్య‌ర్దులు స‌మస్య‌లు ఎదుర్కోవాల్సి రావ‌టం టిడిపి అధినాయ‌త్వానికి ఆందోళ‌న క‌లిగిస్తోంది. పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ నివాసంలో ఐటి సోదాల వార్త వ‌చ్చిన స‌మ యం లోనే వ‌ల్ల‌భ‌నేని వంశీ పై వారెంట్ జారీ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వచ్చింది. దీంతో..ఎన్నిక‌ల వేళ టిడిపి శిబిరం లో
ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది.

English summary
Nampally court issused non bailable warrant against Gannavaram TDP contesting Candidate Vallabhaneni Vamshi. IN 2009 Telangana police filed case against Vamsi. In that case court issued warrant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X