• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నటసింహం నక్షత్రం: బాలయ్య హిలేరియస్ హిందీ స్పీచ్: నాడు మోడీపై..ఇప్పుడు ఆహా సీఈఓపై

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరో, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ.. తన కేరీర్‌లోనే మొదటిసారిగా ఓ టాక్‌షోనకు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నారు. ఇదివరకు చాలామంది ఇండస్ట్రీ పెద్దలు టాక్‌షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు, జూనియర్ ఎన్టీఆర్, నాని, అక్కినేని నాగార్జున, రానా, అలీ, మంచు లక్ష్మి, సమంత.. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన ఇలా అగ్రస్థాయి దర్శకులు, హీరోలు హోస్ట్‌గా తళుక్కున మెరిసిన ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదివరకు ఓ షో‌ కోసం హోస్ట్‌గా అవతారం ఎత్తారు.

నందమూరి టర్న్

నందమూరి టర్న్

ఇప్పుడు నందమూరి బాలక‌ృష్ణ వంతు వచ్చింది. ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు చెందిన ఆహా‌లో ఈ టాక్ షో టెలికాస్ట్ కానుంది. తఅనా పేరు అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. దేవీ శరన్నరవ రాత్రుల సందర్భంగా ఈ షోను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. నవంబర్ 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ఇది టెలికాస్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రీ ఫంక్షన్‌ను గురువారం రాత్రి నిర్వహించారు దీన్ని కర్టెన్ రైజర్‌గా భావించుకోవచ్చు.

అలీ టాక్ షో పోటీ..

అలీ టాక్ షో పోటీ..

ఓ బిగ్గెస్ట్ టాక్‌షో‌నకు అదే రేంజ్‌ బిగ్గెస్ట్ స్టార్ హీరో నందమూరి బాలక‌‌ృష్ణ హోస్ట్‌గా ఉండటం వల్ల దీనిపై అంచనాలు అమాంతం పెరిగాయి. అందులోనూ స్టార్ ప్రొడ్యూసర్ హోదా ఉన్న అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఇది ప్రసారం కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలీ టాక్‌షోనకు పోటీగా దీన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీదికి తీసుకొస్తున్నారని అభిప్రాయాలు నెలకొన్నాయి.

అలీ టాక్‌షో విజయవంతమైన నేపథ్యంలో- దాన్ని అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకేను డిజైన్ చేశారని అంటున్నారు. ఏ రేంజ్‌లో ఇది సక్సెస్ అవుతుందనేది తేలాల్సి ఉంది. రెగ్యులర్ టీవీ ప్లాట్‌ఫామ్ కాకపోవడం వల్ల ప్రజల్లోకి ఎలా చొచ్చుకెళ్తుందనేది ఆసక్తిగా మారింది.

కట్టి పడేసిన బాలయ్య స్పీచ్..

కట్టి పడేసిన బాలయ్య స్పీచ్..

కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్‌లో నందమూరి బాలకృష్ణ ఇచ్చిన స్పీచ్.. ఆకట్టుకుంది. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే ఎలా ఉండబోతోందనేది ఓ టీజర్‌లా కనిపించింది. తన స్పీచ్‌కు కాస్త హాస్యాన్ని జోడించి.. నటసింహ ఇచ్చిన స్పీచ్ కట్టి పడేసింది. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌, ఆహా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అజిత్ ఠాకూర్‌పై వేసిన పంచ్‌లు అభిమానులు నవ్వించాయి. బాలకృష్ణ వేసిన పంచ్‌లకు అజిత్ ఠాకూర్‌ దండం పెట్టేశాడు.ఆయన పక్కనే కూర్చున్న అల్లు అరవింద్.. పడీపడీ నవ్వారు.

షోలే డైలాగ్స్..

షోలే డైలాగ్స్..

తన ప్రసంగం ముగించే సమయంలో బాలకృష్ణ అల్లు అరవింద్‌, అజిత్ ఠాకూర్‌లకు ధన్యవాదాలు చెప్పారు. ఆ సమయంలో అజిత్ ఠాకూర్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర నటించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ షోలేలోని ఓ డైలాగ్‌ను ప్రస్తావించారు. గబ్బర్ సింగ్ క్యారెక్టర్ అమ్జాద్ ఖాన్ సూపర్ హిట్ డైలాగ్‌ను విసిరారు. యే హాథ్ ముఝే దేదో ఠాకూర్.. అంటూ సీరియస్‌గా అడిగారు బాలక‌ృష్ణ. హాత్ దియే తో వ్యాక్సిన్ కహాసే లేంగే అంటూ మరో పంచ్ సంధించారు.

ఆప్ బతానా పడేగా హీ అంటూ డిమాండ్ చేశారు. పీఛెముడ్‌ కే.. అంటూ వ్యాక్సిన్ అక్కడ వేసుకోవాల్సి వస్తుందంటూ పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇదివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై హిందీలో పవర్‌ఫుల్ పంచ్‌లను వేశారు నందమూరి బాలకృష్ణ. చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షలో నరేంద్ర మోడీపై హిందీలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 నా నక్షత్రం అదే..

నా నక్షత్రం అదే..

తనది మూలా నక్షత్రం అని నందమూరి బాలక‌ృష్ణ అన్నారు. అందుకే- ఏదైనా మూలాల్లోకి వెళ్లి తేల్చుకోవడం తనకు వెన్నతో పెట్టిన విద్యగా అభివర్ణించారు. చిత్ర పరిశ్రమలో పోటీ తత్వం విపరీతంగా పెరిగిందని చెప్పారు. దానికి అనుగుణంగా ఇండస్ట్రీ తనను తాను మార్చుకుంటోందని చెప్పారు. ఇందులో భాగంగానే.. ఓవర్ ది టాప్ ప్లాట్‌ఫామ్స్‌ను టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వినియోగించుకుంటోందని అన్నారు. ఇది చిత్ర పరిశ్రమకు మంచే చేస్తుందని బాలకృష్ణ అన్నారు.

English summary
Actor and politician Nandamuri Balakrishna hilarious speech in Hindi words in Unstoppable reality show.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X