హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

15 మీ. ఎగిరిన కారు, హరికృష్ణ వెనక్కి తిరగడంతోనే ప్రమాదం: ఎస్పీ, జానకిరాం-హరికృష్ణల కారు నెంబర్ ఒకటే

By Srinivas
|
Google Oneindia TeluguNews

నల్గొండ: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రమాదస్థలాన్ని ఎస్పీ రంగనాథ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Recommended Video

హరికృష్ణ కొంప ముంచిన వాటర్ బాటిల్...!

అతివేగం కారణంగానే హరికృష్ణ కారు ప్రమాదానికి గురయిందని తెలిపారు. ప్రమాదం సమయంలో కారు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తోందని చెప్పారు. కారు వేగంగా వెళ్తున్న సమయంలో హరికృష్ణ వాటర్ బాటిల్ కోసం వెనక్కి తిరగడంతో వాహనం అదుపుతప్పిందని చెప్పారు.

10 ని.ల్లో ఆసుపత్రిలో చేర్పించినా.. హరికృష్ణ మృతి: అతివేగమే కారణం, అలా పల్టీ కొట్టింది10 ని.ల్లో ఆసుపత్రిలో చేర్పించినా.. హరికృష్ణ మృతి: అతివేగమే కారణం, అలా పల్టీ కొట్టింది

 డివైడర్‌ను ఢీకొని 15 మీటర్లు ఎగిరిన వాహనం

డివైడర్‌ను ఢీకొని 15 మీటర్లు ఎగిరిన వాహనం

వాహనం డివైడర్‌ను ఢీకొని 15 మీటర్ల దూరం ఎగిరిపడిందని ఎస్పీ చెప్పారు. దీంతో హరికృష్ణ కారులో నుంచి ఎగిరిపడ్డారని చెప్పారు. ఆయన సీటు బెల్టు పెట్టుకుంటే ప్రాణాపాయం తప్పేదని చెప్పారు.

హరికృష్ణ వెంట వీరే

హరికృష్ణ వెంట వీరే

కాగా, హరికృష్ణ భౌతికకాయాన్ని రోడ్డు మార్గాన హైదరాబాద్ తీసుకు వస్తున్నారు. వెంట జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్ తదితరులు ఉన్నారు. మెహిదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి భౌతికకాయం తరలిస్తున్నారు. రేపు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. మొయినాబాద్ మండలం ముర్తుజగూడ ఫాంహౌస్‌లో అంతిక సంస్కారాలు నిర్వహించనున్నారు.

జానకీరాంకు అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలోనే

జానకీరాంకు అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలోనే

హరికృష్ణకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏర్పాటు చేయాలని సీఎస్‌ను సూచించారు. కొడుకు జానకిరామ్‌కు జరిగిన ప్రదేశంలోనే హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

నాడు జానకిరాం, నేడు హరికృష్ణ కారు నెంబర్ ఒకటే

నాడు జానకిరాం, నేడు హరికృష్ణ కారు నెంబర్ ఒకటే


హైదరాబాద్ నుంచి నెల్లూరుకు ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తుండగా హరికృష్ణ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రమాదం సమయంలో ఆయనే డ్రైవింగ్ చేస్తున్నారు. వాటర్ బాటిల్ కోసం వెనక్కి తిరగ్గా.. మూలమలుపు వద్ద వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు. ప్రమాదం సమయంలో హరికృష్ణ వెంట వెంకట్రావు, శివాజీలు ఉన్నారు. ఇదిలా ఉండగా, హరికృష్ణ ప్రమాదానికి గురైన, ఆయన తనయుడు జానకిరామ్ ప్రమాదానికి గురైన కారు దాదాపు ఒకటే నెంబర్‌తో ఉంది. నాడు జానకిరామ్ ప్రయాణించిన కారు ఏపీ 28 బీడబ్ల్యూ 2323 కాగా, నేడు హరికృష్ణ ప్రయాణించిన కారు ఏపీ 29 బీడీ 2323. కొడుకు జానకిరాం ఇష్టపడి రిజిస్ట్రేషన్ చేయించుకున్న నెంబర్ కావడంతో ఇదే సిరీస్‌లో హరికృష్ణ కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఉండొచ్చునని భావిస్తున్నారు. ఇద్దరు కూడా నల్గొండ జిల్లాలోనే రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.

English summary
Nandamuri Harikrishna passed away on Wednesday morning. He was 61. The actor and TDP leader was driving to Kavali in Nellore district of Andhra Pradesh to attend a fan’s wedding when his car hit the median at a high speed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X