వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10 ని.ల్లో ఆసుపత్రిలో చేర్పించినా.. హరికృష్ణ మృతి: అతివేగమే కారణం, అలా పల్టీ కొట్టింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

నల్గొండ: మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బుధవారం వేకువజామున నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద హరికృష్ణ కారు బోల్దా పడటంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి నెల్లూరులోని ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఆయనతోపాటు మరికొందరు ఉన్నారని తెలుస్తోంది.

 అతివేగమే ప్రమాదానికి కారణం

అతివేగమే ప్రమాదానికి కారణం

అతివేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. కారు వేగంగా వెళ్తోందని చూసిన వారు చెబుతున్నారు. కారు ఎడమవైపు నుంచి కుడివైపునకు పల్టీ కొట్టి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టి ముందుకు వెళ్లి బోల్తా పడింది.

 పదినిమిషాల్లోనే ఆసుపత్రికి

పదినిమిషాల్లోనే ఆసుపత్రికి

ఈ ప్రమాదం జరిగిన పది నిమిషాల్లోనే హరికృష్ణను ఆసుపత్రికి తరలించారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు ఎంతో ప్రయత్నం చేశారు. కానీ కాపాడలేకపోయారు.

 కుటుంబ సభ్యుల రాక

కుటుంబ సభ్యుల రాక

ప్రమాద విషయం తెలుసుకున్న హరికృష్ణ తనయులు ఎన్టీఆర్‌, కల్యాణ్ రామ్‌ హుటాహుటిన కామినేని ఆసుపత్రికి బయలుదేరారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌, బీజేపీ నేత పురంధేశ్వరి తదితరులు తమ కార్యక్రమాలను రద్దు చేసుకొని ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరారు.

ఎన్టీఆర్ నాలుగో సంతానం

ఎన్టీఆర్ నాలుగో సంతానం


ఎన్టీఆర్, బసవతారకం నాలుగో సంతానం హరికృష్ణ. ఆయన సెప్టెంబరు 2, 1956న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. చిన్నతనంలోనే 1967లో శ్రీ కృష్ణావతారం సినిమాతో సినిమాల్లోకి ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో అలరించారు. ఆ తర్వాత కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన శ్రీరాములయ్యతో 1998లో మరోసారి తెరపై కనిపించారు. సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, శివరామరాజు, సీతయ్య, టైగర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌, స్వామి, శ్రావణమాసం తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు.

 పెద్దకొడుకు జానకిరాం ఇక్కడే మృతి

పెద్దకొడుకు జానకిరాం ఇక్కడే మృతి

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఆయన ప్రచార వాహనం చైతన్య రథాన్ని హరికృష్ణే నడిపించారు. 1995లో టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్లాక అన్న తెలుగుదేశంను స్థాపించారు. ఆ తర్వాత తిరిగి టీడీపీలో చేరారు. రాజ్యసభ సభ్యుడిగా, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్‌గా ఉన్నారు. కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్‌ కూడా 2014 జనవరిలో రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు. ఆ ప్రమాదం కూడా నల్గొండ జిల్లా పరిధిలోనే జరిగింది.

English summary
Actor and TDP leader Nandamuri Harikrishna died in a road accident early on Wednesday morning. Harikrishna, a former actor, was driving to Kavali in Nellore district of Andhra Pradesh to attend the wedding of a fan when the car which he was himself driving crashed into a road median on Nalgonda Highway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X