వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవార్డుల వివాదం: ప్రశ్నించినందుకు 'నంది' ఇవ్వలేదా, బాబు-బాలయ్యలపై 'కమ్మ' వివాదం

నంది అవార్డులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించేందుకు హిందూపురం శాసన సభ్యుడు, నటుడు నందమూరి బాలకృష్ణ నిరాకరించినట్లుగా తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Nandi Awards : 'కమ్మ' అవార్డులు, సైకిల్ అవార్డులు ! 'లెజెండ్‌' లో అసలేముంది ?

అమరావతి: నంది అవార్డులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించేందుకు హిందూపురం శాసన సభ్యుడు, నటుడు నందమూరి బాలకృష్ణ నిరాకరించినట్లుగా తెలుస్తోంది.

నంది అవార్డులపై విమర్శల వెల్లువ

నంది అవార్డులపై విమర్శల వెల్లువ

నంది అవార్డులపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ అవార్డుకు సంబంధించి పలువురు సినీ ప్రముఖులు తెలుగుదేశం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. నంది అవార్డులు ఎక్కువగా ఓ సామాజిక వర్గానికి వచ్చాయని మండిపడుతున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికి అవార్డులు ఇచ్చారని ధ్వజమెత్తుతున్నారు.

బాహాటంగా విమర్శలు

బాహాటంగా విమర్శలు

దర్శకుడు గుణశేఖర్, నల్లమలుపు బుజ్జి, బన్ని వాసు వంటి వారు ఈ అవార్డులపై తమ అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కుతున్నారు. నంది అవార్డులు తనకు కొత్త కాదని గుణశేఖర్ విమర్శించారు. అయితే తనకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నానని చెప్పారు.

ప్రశ్నించినందుకు అవార్డు ఇవ్వలేదా

ప్రశ్నించినందుకు అవార్డు ఇవ్వలేదా


రుద్రమదేవి సినిమా రాయితీ కోసం ఎంతోమందిని వేడుకున్నానని గుణశేఖర్ చెప్పారు. కానీ పన్ను రాయితీ ఇవ్వలేదని చెప్పారు. అప్పుడు ప్రశ్నించినందుకు ఇప్పుడు నంది అవార్డు ఇవ్వలేదన్నారు. అద్భుతమైన చారిత్రక సినిమాకు అవార్డు రానందుకు సినిమా దర్శకుడిగా, నిర్మాతగా బాధగా ఉందన్నారు. కాగా, రుద్రమదేవి సినిమాకు వినోదపు పన్ను మినహాయించాలని నాడు గుణశేఖర్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. కానీ మినహాయించలేదు.

కమ్మ అవార్డులుగా ఉన్నాయి

కమ్మ అవార్డులుగా ఉన్నాయి


నంది అవార్డులు ఏకపక్షంగా ఇచ్చారని రేసు గుర్రం నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మండిపడ్డారు. రేసు గుర్రం సినిమాకు ఆశించిన విధంగా అవార్డు రాలేదన్నారు. ఈ సినిమా ఎన్నో వేదికలపై అవార్డులు గెలుచుకుందని, వంద కోట్ల రూపాయలు వసూలు చేసిందని, కానీ ఊహించిన విధంగా అవార్డు రాకపోవడం నిరుత్సాహానికి గురి చేసిందన్నారు. అవి నంది అవార్డులుగా కనిపించలేదని, కమ్మ అవార్డులు అని ధ్వజమెత్తారు.

English summary
The heat erupted over Nandi Awards announced by AP state government yesterday is not going to cool down anytime soon as debate continues with opposition rages. While Rudhramadevi director Gunasekhar has been openly questioning AP government for not giving away any award to his film, the fans of Allu Arjun are adding fuel to the fire while Akkineni fans are snowballing the debate into a major controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X