వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాల ఉపఎన్నిక నేడే: పోలింగ్‌కు సర్వం సిద్దం

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటరు తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.టిడిపి, వైసీపీలు ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగా సర్వశక్తులను ఒడ్డాయి. నంద్యాల ఉపఎన్నికను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు.

నంద్యాల నియోజకవర్గ రాజకీయపార్టీల నాయకులు, అభ్యర్థులు ఇంటిని వదిలి బయటకు రాకూడదని ఆదేశించినట్టు భన్వర్‌లాల్ చెప్పారుఈనెల 23న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. ఆరు గంటల వరకు వరుసలో ఉన్నవారందరికీ ఓటువేసే అవకాశం ఉంటుందన్నారు.

నచ్చిన అభ్యర్థికి స్వేచ్ఛగా ఓటు వేసుకోవచ్చని, ఎవరూ నచ్చకుంటే నోటా ఆప్షన్‌ ఇచ్చామన్నారు. ఓటర్లను ఎలాంటి భయబ్రాంతులకు గురిచేసినా చర్యలు తీసుకొంటామని ఎన్నికల అధికారులు ప్రకటించారు.

నంద్యాలలో ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించేందుకుగాను పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.కేంద్రప్రభుత్వ బలగాలు నంద్యాలలో పహరా కాస్తున్నాయని ఆయన చెప్పారు.

నంద్యాల పోలింగ్ పరిశీలనకు 82 ప్రత్యేక స్వ్కాడ్స్

నంద్యాల పోలింగ్ పరిశీలనకు 82 ప్రత్యేక స్వ్కాడ్స్

నంద్యాల నియోజకవర్గంలో పోలింగ్‌ పరిశీలనకు 82 ప్రత్యేక స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ‘‘నంద్యాల నియోజకవర్గంలో 2.19లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో 2.03లక్షల మందికి ఓటు రశీదులు పంపిణీ చేశాం. మిగతా 16వేల మందిలో 3,626 మంది చనిపోయారు. 4,865 మంది ఓటర్లు బదిలీ అయ్యారు. 4,269 మంది ఆచూకీ లేదు. 2,943 మంది పేర్లు డూప్లికేట్‌ అయ్యాయి. వీరిలో ఎవరైనా అర్హులుండి ఓటు వేయడానికి వస్తే రిటర్నింగ్‌ అధికారి వివరాలన్నీ పరిశీలించి అనుమతిస్తారని భన్వర్‌లాల్ చెప్పారు.

 255 పోలింగ్ కేంద్రాల్లో లైవ్‌వెబ్‌కాస్ట్

255 పోలింగ్ కేంద్రాల్లో లైవ్‌వెబ్‌కాస్ట్


నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో 255 పోలింగ్‌ కేంద్రాల్లో లోపల, బయటి పరిస్థితులను పరిశీలించేందుకు లైవ్‌వెబ్‌కాస్ట్‌ ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలో ఓటు వేశాక ఏడు సెకన్ల పాటు వీవీప్యాడ్‌పై పార్టీ గుర్తు కనిపిస్తుంది. ఓటరుకు ఏమైనా సందేహాలుంటే.. వెంటనే రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయాలి. ఎలాంటి సహాయం కావాలన్నా, ఇబ్బందులు ఎదురైనా వెంటనే 9223166166 నెంబరుకు ఎస్‌ఎంఎస్‌ చేయాలి. ఈ సమాచారం సంబంధిత స్క్వాడ్స్‌కు వెళ్తుంది. ఓటర్లను ప్రభావితం చేసేలా వార్తల ప్రసారం, సర్వేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భన్వర్‌లాల్ చెప్పారు.

భారీ బందోబస్తు

భారీ బందోబస్తు

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో సమస్యాత్మక గ్రామాలున్నాయి. దీంతో బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. బందోబస్తులో ఆరు కంపెనీల కేంద్ర బలగాలు, ఎనిమిది కంపెనీల ఏపీఎస్పీ బలగాలు, 2500మంది పోలీసులు ఉన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాం.''అని వివరించారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకొన్నట్టు చెప్పారు.

ఎన్నికల ప్రధానాధికారికి టిడిపి, వైసీపీల ఫిర్యాదు

ఎన్నికల ప్రధానాధికారికి టిడిపి, వైసీపీల ఫిర్యాదు


నంద్యాలో ఉపఎన్నికను పురస్కరించుకొని టిడిపి, వైసీపీలు ఒకరిపై మరోకరు ఫిర్యాదుచేసుకొన్నాయి. మంత్రులు, టిడిపి ఎమ్మెల్యేలు నంద్యాల నియోజకవర్గానికి సమీపంలోనే మకాం వేసి ఓటర్లను ప్రభావితం చేసే పనిలో ఉన్నారని వైసీపీ ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు.వైసీపీ చీఫ్ జగన్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై చేసిన విమర్శలపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీకి అనుకూలంగా ఓ ప్రతిక వార్తలను రాస్తోందని టిడిపి ఆరోపించింది.

English summary
As many as 3,500 security personnel, including six companies of the central armed forces, have been deployed for Nandyal bypoll in Andhra Pradesh, to be held on August 23, Chief Electoral Officer Bhanwar Lal said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X