వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్నీ.. పందెం కాసి ఉంటే రూ.5 కోట్లు పోయేవి, ఇప్పుడు గుండేగా.. నో ప్రాబ్లం!

నంద్యాల ఉపఎన్నిక పోరులో టీడీపీ గెలవడం.. పాపం.. ఓ సినీ నిర్మాతకు పెద్ద సమస్యనే తెచ్చిపెట్టింది. ఉపఎన్నిక సమయంలో స్నేహితులైన ఇద్దరు సినీ నిర్మాతల నడుమ జరిగిన పందెం ఇది. వివరాల్లోకి వెళితే...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

విజయవాడ: నంద్యాల ఉపఎన్నిక పోరులో టీడీపీ గెలవడం.. పాపం.. ఓ సినీ నిర్మాతకు పెద్ద సమస్యనే తెచ్చిపెట్టింది. ఉపఎన్నిక సమయంలో స్నేహితులైన ఇద్దరు సినీ నిర్మాతల నడుమ జరిగిన పందెం ఇది. వివరాల్లోకి వెళితే...

నంద్యాల ఉపఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా హోరాహోరీకి దిగిన సంగతి విదితమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ 14 రోజుల పాటు నంద్యాల్లోనే ఉండి ఆ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి విజయం కోసం పోరాడినా ఫలితం దక్కలేదు.

mla-vallabhaneni-vamsi

మరోవైపు నంద్యాలలో టీడీపీ అభ్యర్థి కోసం పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడికి పంపారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా నంద్యాల వెళ్లారు. అక్కడ పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేశారు.

వల్లభనేని వంశీ ఆంధ్రావాలా, అదుర్స్ వంటి సినిమాలు తీశారు. సినీ రంగంలో విస్తృతంగా ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే.. నంద్యాలలో వైసీపీ తరపున పని చేసేందుకు వచ్చిన ఓ సినీ నిర్మాత వంశీకి తారస పడ్డారు. కుశలప్రశ్నల తర్వాత జయాపజయాలపై ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి.

ఇద్దరి మధ్యా సాగిన సంభాషణ చివరికి ఒకరినొకరు రెట్టించుకునే వరకూ వెళ్లింది. పందేలు కడదామని ఒకనాటి మిత్రులైన ఈ నిర్మాతలిద్దరూ సవాళ్లు చేసుకున్నారు. తొలుత ఆస్తులను పందానికి పెట్టాలనుకున్నారు. అనంతరం డబ్బుల్లోకి దిగారు. రూ.5 కోట్లు పందెం కాసేందుకు సిద్ధపడ్డారు.

ఈ తరుణంలో ఇరువురి శ్రేయోభిలాషులు రంగంలోకి దిగారు. డబ్బులు, ఆస్తులు వద్దు టీడీపీ ఓడిపోతే వల్లభనేని వంశీ, వైసీపీ ఓడిపోతే సదరు సినీ నిర్మాత గుండు కొట్టించుకోవాలని పందేన్ని ఫిక్స్ చేశారు.

ఎవరు ఓడిపోతే వాళ్లు గుండు కొట్టించుకుని అదే రోజు మధ్యాహ్నం నంద్యాలలో వాళ్లుండే నివాసం నుంచి నడుచుకుంటూ వచ్చి ఎదుటపడి కన్పించాలని నిర్ణయించుకున్నారు. మధ్యవర్తులు కూడా దీనికి ఓకే అన్నారు.

చివరికి చూస్తే.. ఏమైంది? నంద్యాలలో తెలుగుదేశం ఢంకా బజాయించింది. పాపం వైసీపీ తరుపున ప్రచారం బరిలోకి దిగిన సదరు సినీ నిర్మాత పరిస్థితేమిటి? ఇంతకీ ఆయన గుండు కొట్టించుకున్నారా? ఈ విషయం వల్లభనేని వంశీయే చెప్పాలి మరి!

English summary
TDP Victory in Nandyal Bypoll is became a big problem for one of the movie producers. According to the sources the story of behind the scenes are like this. Gannavaram MLA Vallabhaneni Vamsi went to Nandyal during the Bypoll. There he met one of his friends who is also a movie producer. But he came on behalf of YCP there. While talking about the victory in bypoll... a bet was generated between these two producer friends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X