వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూమా ఎఫెక్ట్: శిల్పాను వెంటాడిన దురదృష్టం, 2 నెలలకే, దెబ్బేనా?

నంద్యాల ఉపఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పులకు కారణమౌతున్నాయి. రాజకీయంగా కొందరికి పదవులను తెచ్చిపెడితే మరికొందరికి రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్మేలా చేశాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉపఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పులకు కారణమౌతున్నాయి. రాజకీయంగా కొందరికి పదవులను తెచ్చిపెడితే మరికొందరికి రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్మేలా చేశాయి.

<strong>నంద్యాల ఎఫెక్ట్: ఆర్‌పిఎస్‌కు బైరెడ్డి గుడ్‌బై, అనుచరులతో సమావేశం, టిడిపిలోకి</strong>నంద్యాల ఎఫెక్ట్: ఆర్‌పిఎస్‌కు బైరెడ్డి గుడ్‌బై, అనుచరులతో సమావేశం, టిడిపిలోకి

నంద్యాల ఉపఎన్నికల సమయంలో టిడిపిని వీడి వైసీపీలో చేరిన శిల్పా సోదరులు రాజకీయంగా తాత్కాలికంగా దెబ్బతిన్నారు. ఈ ఉపఎన్నికల్లో విజయం సాధించి రాజకీయంగా తన ప్రత్యర్థులైన భూమా కుటుంబంపై పై చేయి సాధించాలని భావించిన శిల్పా మోహన్‌రెడ్డికి నిరాశే మిగిలింది.

ఆ నిర్ణయమే శిల్పా సోదరుల కొంపముంచిందా, కలిసిరాలేదా, తొందరపాటా?ఆ నిర్ణయమే శిల్పా సోదరుల కొంపముంచిందా, కలిసిరాలేదా, తొందరపాటా?

శిల్పా చక్రపాణిరెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరారు. అయితే ఎమ్మెల్సీ పదవిని కోల్పోయారు. టిడిపిలోనే శిల్పా చక్రపాణిరెడ్డి కొనసాగితే శాసనమండలి ఛైర్మెన్ పదవి ఆయనకే దక్కేది.

ఆ మూలాలపై టిడిపి కన్ను, శిల్పా సోదరుల మధ్య విబేధాలు?ఆ మూలాలపై టిడిపి కన్ను, శిల్పా సోదరుల మధ్య విబేధాలు?

కానీ, టిడిపిని వీడి శిల్పా సోదరులు తొందరపాటు నిర్ణయం తీసుకొని రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారని పలువురు టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే నంద్యాలకు చెందిన మాజీ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌కు శిల్పాకు ఇస్తానన్న పదవి దక్కింది.

శిల్పాను వెంటాడిన దురదృష్టం

శిల్పాను వెంటాడిన దురదృష్టం

టిడిపిని వీడి వైసీపీలో చేరిన శిల్పా చక్రపాణిరెడ్డిని దురదృష్టం వెంటాడింది. ఎమ్మెల్సీగా ఎన్నికై రెండు మాసాలే అయింది. కానీ, ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తేనే వైసీపీలో చేరాలని చక్రపాణిరె్డ్డికి వైఎస్ జగన్ సూచించారు. దీంతో చక్రపాణిరెడ్డి రాజీనామా చేశారు. ఈ రాజీనామా కూడ ఆమోదం పొందింది. గత నెల 3వ, తేదిన చక్రపాణిరెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరారు. అయితే అంతకు నెలరోజుల ముందే శిల్పా మోహన్‌రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరారు. శిల్పా చక్రపాణిరెడ్డి టిడిపిలో ఉంటే శాసనమండలి ఛైర్మెన్ పదవి దక్కేది. పార్టీ మారడంతో ఆ పదవి ఫరూక్‌కు దక్కింది.

రెండు మాసాలకే ఎమ్మెల్సీకి రాజీనామా

రెండు మాసాలకే ఎమ్మెల్సీకి రాజీనామా

నంద్యాల ఉపఎన్నికల్లో తన సోదరుడు శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించుకొనేందుకు శిల్పా చక్రపాణిరెడ్డి టిడిపిని వదిలారు. అయితే టిడిపి నాయకత్వం కూడ శిల్పా చక్రపాణిరెడ్డి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అవమానించిందని చక్రపాణిరెడ్డి ప్రకటించారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో శ్రీశైలం టిక్కెట్టును తనకే ఇస్తానని టిడిపి నాయకత్వం ప్రకటిస్తేనే పార్టీలో ఉంటానని చక్రపాణిరెడ్డి టిడిపికి చెప్పారు. అయితే ఈ విషయాలపై టిడిపి నాయకత్వం మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అప్పటికీ మోహన్‌రెడ్డితో పాటు చక్రపాణిరెడ్డి కూడ టిడిపిని వీడుతారనే అనుమానంతో ఉన్న టిడిపి నాయకత్వం కూడ చక్రపాణిరెడ్డి డిమాండ్లపై స్పందించలేదు.ఇదే అదనుగా భావించిన చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన చక్రపాణిరెడ్డి తన పదవులను కోల్పోయారు.రెండు నెలలకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు శిల్పా చక్రపాణిరెడ్డి.

పదవులను కోల్పోయిన చక్రపాణిరెడ్డి

పదవులను కోల్పోయిన చక్రపాణిరెడ్డి

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీచేసిన శిల్పా చక్రపాణిరెడ్డి తన ప్రత్యర్థిపై గౌరు వెంకట్‌రెడ్డిపై విజయం సాధించారు. నిజానికి కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి బలముంది,కానీ వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరడంతో వైసీపీ అభ్యర్థి వెంకట్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. ఈ విజయంలో దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కీలకంగా వ్వహరించారు. తన వర్గం ప్రజాప్రతినిధులందరూ శిల్పా చక్రపాణిరెడ్డికి ఓటు చేసేలా చూశారు. ఎమ్మెల్సీగా చక్రపాణిరెడ్డి విజయం సాధించారు. అయితే శాసనమండలి చైర్మెన్ పదవిని కూడ ఇస్తానని బాబు చక్రపాణిరెడ్డికి హమీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, మండలి ఛైర్మెన్ ను కూడ చక్రపాణిరెడ్డి కాదనుకొన్నారు.

ఫరూక్‌కు దక్కిన అవకాశం

ఫరూక్‌కు దక్కిన అవకాశం

ఎమ్మెల్సీ ఫరూక్‌ను నంద్యాల ఉప ఎన్నిక రూపంలో అదృష్టం వరిస్తే.. మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డిని దురదృష్టం వెంటాడిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నంద్యాల ఉపఎన్నికను పురస్కరించుకొని ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. మండలి ఛైర్మెన్‌గా కూడ అవకాశం దక్కింది. నంద్యాలకే మండలి ఛైర్మెన్ ను ఇస్తానని హమీ ఇచ్చారు. అయితే శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీ మారడంతో ఫరూక్‌కు ఈ అవకాశం దక్కింది.

English summary
Ysrcp leader Shilpa Chakrapani Reddy lost his Mlc and MLc chairman post.If Shilpa Chakrapani Reddy continues in Tdp he may get MLC chairman post said Tdp sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X