వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే అందరూ నంద్యాలలో: సుజనా వ్యాఖ్య, జగన్ చెబుతోంది నిజమా?

నంద్యాల ఉప ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ నేతల మాటలు చర్చకు తావిస్తున్నాయి. ఉప ఎన్నికలు రిఫరెండం కాదని చెబుతుండటంతో జగన్ చెబుతున్నట్లుగా వారిలో ఓటమి భయం కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ నేతల మాటలు చర్చకు తావిస్తున్నాయి. ఉప ఎన్నికలు రిఫరెండం కాదని చెబుతుండటంతో జగన్ చెబుతున్నట్లుగా వారిలో ఓటమి భయం కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

చదవండి: బాబు ముందు ఎత్తులు చిత్తు: జగన్ చాలనకున్నారు కానీ, అందుకే రంగంలోకి రోజా?

ఇటీవలే ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. నంద్యాల ఉప ఎన్నికలు రిఫరెండం కాదన్నారు. తాజాగా, కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా అదే మాట చెప్పారు. పాలనకు ప్రజామోదం ఉందనుకుంటే రిఫరెండంగా ప్రకటించవచ్చు కదా అంటున్నారు.

రిఫరెండం కాదు

రిఫరెండం కాదు

టిడిపి మూడున్నరేళ్ల పాలనపై నంద్యాల ఉప ఎన్నిక ఫలితం ప్రజాభిప్రాయం (రిఫరెండం) కానే కాదని సుజనా పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో టిడిపి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉపఎన్నికను తమ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు.

అందుకే నేతలంతా నంద్యాలలో

అందుకే నేతలంతా నంద్యాలలో

నంద్యాల సీటును తాము కోల్పోదల్చుకోలేదని సుజన చెప్పారు. ఈ కారణంగానే పార్టీ నేతలంతా అక్కడ పర్యటిస్తున్నారన్నారు. ఎన్నికల్లో వైసిపి తీరును ఆక్షేపించారు. ఆ పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతూ టిడిపిపై బురద చల్లడం సరికాదన్నారు.
ఉపఎన్నిక నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు అంటూ ఉండబోదని, రాష్ట్రంలోని 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

జగన్ అధికారంలోకి వస్తే తట్టుకోలేమనే

జగన్ అధికారంలోకి వస్తే తట్టుకోలేమనే

నంద్యాల ఎన్నికల తర్వాత జగన్‌, కాకినాడ నగరపాలక ఎన్నికల తర్వాత ఆ పార్టీ నేత విజయ సాయి రెడ్డి చాప చుట్టేస్తారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధిస్తుందన్నారు. అధికారంలోకి రాక ముందే ఉన్మాదంతో వ్యవహరిస్తున్న జగన్‌ అధికారంలోకి వస్తే ఎలా తట్టుకోగలమనే ఆలోచనలో ప్రజలు ఉన్నారన్నారు.

అందుకే టిడిపిపై జగన్ దుష్ప్రచారం

అందుకే టిడిపిపై జగన్ దుష్ప్రచారం

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాంట్రీ కారులో డబ్బులు తరలిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేయడం వైసిపి దిగజారుడుతనానికి నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. ఓటమి ఖరారు కావడంతో జగన్ టిడిపిపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

English summary
Union Minister and TDP leader Y Sujana Choudhary, while expressing confidence that his party would win the election, said the Nandyal bypoll would not be a referendum on the performance of the government in the state. Talking to reporters here on Saturday, Sujana Chowdhary said: “Election to the Nandyal Assembly seat is not a referendum. Most of the party leaders have been campaigning here because we don’t want to lose in the election.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X