వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4 రోజుల్లో నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్?: టిడిపి ఇలా.. వైసిపి ఫిర్యాదు

నంద్యాల ఉప ఎన్నికలకు నగారా మోగనుంది. మరో మూడు నాలుగు రోజుల్లో ఉప ఎన్నికల నోటిఫికేషన్ రానుందని తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలకు నగారా మోగనుంది. మరో మూడు నాలుగు రోజుల్లో ఉప ఎన్నికల నోటిఫికేషన్ రానుందని తెలుస్తోంది.

చదవండి: అందుకే అసెంబ్లీకి: అఖిల, 'శిల్పాకు రాజకీయ సన్యాసమే', జగన్ ఆశలపై ఈసీ నీళ్లు

రాష్ట్రపతి ఎన్నికల అనంతరం ఎప్పుడైనా నోటిఫికేషన్ వెలువడవచ్చునని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వారాంతంలో నోటిఫికేషన్ విడుదల కావొచ్చని చెబుతున్నారు.

సెప్టెంబర్ 12లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి

సెప్టెంబర్ 12లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి

నంద్యాల అసెంబ్లీ మార్చి 12 నుంచి ఖాళీగా ఉంది. నిబంధనల మేరకు సెప్టెంబరు 12లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఎన్నికల కమిషన్‌ ప్రకటన విడుదల చేసిన వెంటనే ఎన్నికల ఏర్పాట్లు ప్రారంభం అవుతాయి. నోటిఫికేషన్ పైన తెలుగు రాష్ట్రాల ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ఇటీవల మాట్లాడుతూ.. ప్రకటన తేదీ తమ చేతుల్లో లేదన్నారు.

Recommended Video

Chandrababu Naidu Survey Report on Ministers
నంద్యాలలో 4 జిల్లాల పోలీసులు ఉంటున్నారని ఫిర్యాదు

నంద్యాలలో 4 జిల్లాల పోలీసులు ఉంటున్నారని ఫిర్యాదు

నంద్యాలలో అధికార పార్టీ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వైసిపి ఆరోపిస్తోంది. పీఏసీ ఛైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు సోమవారం భన్వర్‌లాల్‌ను కలిశారు. నాలుగు జిల్లాలకు చెందిన పోలీసులు నియోజకవర్గంలోనే ఉంటూ జట్పీటీసీ, ఎమ్పీటీసీ, సర్పంచులు, కౌన్సిలర్ల మీద ఒత్తిడి తీసుకు వస్తున్నారని ఫిర్యాదు చేశారు.

ఎన్నికల ప్రకటన రాగానే మంత్రులు ఇలా

ఎన్నికల ప్రకటన రాగానే మంత్రులు ఇలా

ఎన్నికల ప్రకటన వచ్చిన వెంటనే మంత్రులు పార్టీ నాయకులుగా మాత్రమే ఉంటారని భన్వర్ లాల్‌ చెప్పారు. ఎన్నికల కమిషన్‌ విధులు నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే ప్రారంభమవుతాయని తెలిపారు.

పార్టీల అభ్యంతరాలు వినేందుకే

పార్టీల అభ్యంతరాలు వినేందుకే

కర్నూలు, నంద్యాలలో ఓటర్ల నమోదుపై సమావేశాలు నిర్వహించినట్లు భన్వర్ లాల్ తెలిపారు. నంద్యాల నియోజకవర్గంలో సుమారు పదివేల దరఖాస్తులు ఓటర్ల నమోదు ప్రక్రియలో వచ్చాయన్నారు. చాలా ఎక్కువగా ఉండడంతో వీటిని పరిశీలన చేస్తున్నామన్నారు. రాజకీయ పార్టీల అభ్యంతరాలు వినడానికి నంద్యాలకు వచ్చానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

English summary
Nandyal bypoll notification will be release soon. Election Commission may released within four days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X