వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూమా ఎఫెక్ట్: బెట్టింగుతో అతను కోటీశ్వరుడయ్యాడు!!

నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున బెట్టింగులు సాగాయి.అభ్యర్థుల గెలుపోటములతో పాటు, మెజార్టీ పైన కూడా భారీగా బెట్టింగులు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Betting After Bhuma Brahmananda Reddy's Win In Nandyal

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున బెట్టింగులు సాగాయి. అభ్యర్థుల గెలుపోటములతో పాటు, మెజార్టీ పైన కూడా భారీగా బెట్టింగులు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి.

భూమా బ్రహ్మానంద రెడ్డి గెలుపు, ఆయన మెజార్టీపై బెట్టింగులు కట్టిన వారు బాగా రాబట్టారు. వేలు, లక్షల్లో పందేలు కాశారు. ఈ బెట్టింగులో ఓ వ్యక్తి కోటీశ్వరుడు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

బెట్టింగులో భారీగా వెనుకేశారు

బెట్టింగులో భారీగా వెనుకేశారు

టిడిపి గెలుపుపై బెట్టింగులు కట్టిన వారు వేలు, లక్షలు వెనుకేశారు. వైసిపి గెలుపుపై బెట్టి కాసినవారు భారీగా నష్టపోయారు. అయితే, టిడిపి గెలుపుపై బెట్టు కట్టిన.. అదే పార్టీకి చెందిన ఓ ద్వితీయశ్రేణి నాయకుడు బెట్టింగులో భారీగా సంపాదించుకున్నాడనే ప్రచారం సాగుతోంది.

టిడిపి గెలుపుపై..

టిడిపి గెలుపుపై..

పార్టీపై ఉన్న అభిమానంతో సదరు టిడిపి నాయకుడు, అతని మిత్రులు కూడా తెలుగుదేశం గెలుస్తుందని వాదించారు. వైసిపి గెలుస్తుందని మరో వ్యక్తి వీరితో వాదనకు దిగాడని తెలుస్తోంది. దీంతో ఇది బెట్టింగ్ వరకు వెళ్లిందని తెలుస్తోంది. టిడిపి గెలుస్తుందని రూ.50 లక్షలు పందెం కట్టారు.

రూ.కోటి పందెం

రూ.కోటి పందెం

అదే నాయకుడు మరో వ్యక్తితో 5 వేలు పైచిలు మెజారిటీ వస్తుందని ఇంకో రూ.50 లక్షలు పందెం కాశారని చెబుతున్నారు. గెలుపుపై నమ్మకంతో అతను మొత్తంగా కోటికి పైగా పందెం కాశాడు. ఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డి గెలవడంతో అతను ఒక్కసారిగా కోట్లు సంపాదించాడని తెలుస్తోంది.

ఇక్కడా బెట్టింగులు

ఇక్కడా బెట్టింగులు

నంద్యాల్లో కాదు.. జిల్లాలొని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, డోన్‌, బనగానపల్లె, ఆళ్లగడ్డ, ఆత్మకూరు ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని 13 జిల్లాలు, కర్ణాటకలోని బళ్లారి, తెలంగాణాలోని మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో నంద్యాల ఉప ఎన్నికపై భారీగా బెట్టింగ్‌ జరిగింది. దాదాపు రూ.500 కోట్లు పైగా పందెం జరిగి ఉంటుందని అంచనా అని అంటున్నారు.

సామాన్యుల నుంచి నాయకుల దాకా..

సామాన్యుల నుంచి నాయకుల దాకా..

సామాన్య వ్యక్తుల నుంచి బడాబడా రాజకీయ నాయకుల నుంచి కాంట్రాక్టర్ల వరకు టిడిపి గెలుపు, మెజారిటీపై కొందరి బెట్టింగ్‌ కడితే, మరికొందరు వైసిపి విజయం తథ్యమంటూ పందెం కట్టారు. వైసిపి గెలుపుపై ప్రధానంగా కడప, గుంటూరు, బళ్లారి ప్రాంతాలతోపాటు నంద్యాల డివిజన్‌లో భారీ మొత్తంలో బెట్టింగ్‌ జరిగిందని అంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికలపై బెట్టింగ్ కాసిన వారిలో... ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారు. మరికొందరు లక్షాదికారులు అయ్యారు.

English summary
It is said that some people won lakhs of rupees in betting after Bhuma Brahmananda Reddy's win in Nandyal. it is said that one leader won one crore rupees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X