వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలస్యం వద్దు: ఉపఎన్నిక టైంలో జగన్‌కు ఈసీ షాక్‌పై యనమల స్పందన

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి అధినేత జగన్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం విజ్ఞప్తి చేశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి అధినేత జగన్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం విజ్ఞప్తి చేశారు.

నంద్యాలలో టిడిపి-వైసిపిల కోసం చెన్నై టెక్కీలు!: రోజా నుంచి జగన్, బాబు దాకా ఇలానంద్యాలలో టిడిపి-వైసిపిల కోసం చెన్నై టెక్కీలు!: రోజా నుంచి జగన్, బాబు దాకా ఇలా

జగన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం తప్పు పట్టిందని, ఆయనపై కేసు నమోదు చేయాలని రెండు రోజుల క్రితం ఆదేశించిందని, కాబట్టి వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు.

జగన్‌పై హత్యాయత్నం కేసు పెట్టాలి

జగన్‌పై హత్యాయత్నం కేసు పెట్టాలి

సీఈసీ ఆదేశాల నేపథ్యంలో వెంటనే జగన్‌పై హత్యాయత్నం కేసు పెట్టాలన్నారు. ఐపీసీ సెక్షన్ అంటే అదే అన్నారు. జగన్ క్రూరత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అర్థం చేసుకుందని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని యనమల విజ్ఞప్తి చేశారు.

Recommended Video

YS Jagan Having 12 Charge Sheets : Yanamala | AP Cabinet Expansion - Oneindia Telugu
జగన్‌ను ఎన్నికల పరిధి నుంచి బహిష్కరించాలి

జగన్‌ను ఎన్నికల పరిధి నుంచి బహిష్కరించాలి

జగన్ లాంటి క్రూర మనస్తత్వం ఉన్న వ్యక్తిని ఎన్నికల పరిధి నుంచి బహిష్కరించాలని యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. కాకినాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జగన్‌కు అనుమతివ్వడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలన్నారు.

అరాచకులకు అవకాశం ఇవ్వొద్దు

అరాచకులకు అవకాశం ఇవ్వొద్దు

అరాచకులకు అవకాశం ఇవ్వవద్దని మరో మంత్రి కళా వెంకట్రావు అన్నారు. ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి అరాచకవాదులకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

రెండు రోజుల క్రితమే సీఈసీ ఆదేశాలు

రెండు రోజుల క్రితమే సీఈసీ ఆదేశాలు

కాగా, జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చిన విషయం తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబుపై జగన్‌ చేసిన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని సీఈసీ పేర్కొంది. జగన్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణం చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలను రెండు రోజుల క్రితమే జారీ చేసింది. ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలని, ఉరి తీయాలని జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

English summary
The Election Commission has asked the State Election Commission to issue a stern warning to YS Jagan Mohan Reddy for his comments on Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu which, it said, violated the model code of conduct. During campaigning for Nandyal bypoll, Jagan had, on August 3, said “there is nothing wrong if Chandrababu Naidu is shot dead on the road for not fulfilling election promises”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X