వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాల: రిజల్ట్స్‌పై నిద్రపోలేదన్న అచ్చెన్న, దిమ్మతిరిగే జవాబిచ్చిన బాబు

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Nandyal Bypoll : Intresting News About Chandrababu Naidu Before Nandyal Result |

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా కన్పించారు. ఉదయం పూట ఎన్నికల ఫలితాలు వచ్చే సమయానికి ఆయన టెలికాన్పరెన్స్ నిర్వహించడంతో మంత్రులు, పార్టీ నేతలు బిత్తరపోయారు.ఫలితాలు ముందే ఊహించిన బాబు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

నంద్యాల: మౌనిక దూకుడు, అదే జరిగితే వైసీపీకి తీవ్ర నష్టమేనా?నంద్యాల: మౌనిక దూకుడు, అదే జరిగితే వైసీపీకి తీవ్ర నష్టమేనా?

ఈ నెల 28వ, తేదిన నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూశారు.2019 ఎన్నికలకు నంద్యాల ఉపఎన్నికను సెమీఫైనల్స్‌గా భావిస్తున్న నేపథ్యంలో టిడిపి, వైసీపీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.

నంద్యాల: బిజెపికి దూరంగా టిడిపి, వైసీపీ కొంపముంచిందా?నంద్యాల: బిజెపికి దూరంగా టిడిపి, వైసీపీ కొంపముంచిందా?

అయితే నంద్యాల ఉపఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి 28వేల మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయం వైసీపీకి చుక్కలు చూపింది. శిల్పా సోదరుల రాజకీయ భవితవ్యంపై నంద్యాల ఉప ఎన్నిక తీవ్ర ప్రభావం చూపింది.

గోస్పాడు ఎఫెక్ట్: నంద్యాలలో వైసీపీకి దెబ్బ, జగన్ అంచనాలు తారుమారుగోస్పాడు ఎఫెక్ట్: నంద్యాలలో వైసీపీకి దెబ్బ, జగన్ అంచనాలు తారుమారు

నంద్యాల ఉప ఎన్నిక ఏపీ రాష్ట్రంలో రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీ నుండి టిడిపిలోకి వలసలు మరింత పెరిగే అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతోంది.

నిద్రపట్టలేదన్న అచ్చెన్నాయుడు

నిద్రపట్టలేదన్న అచ్చెన్నాయుడు

నంద్యాల ఉపఎన్నిక ఫలితాలకు ముందురోజు తనకు నిద్ర పట్టలేదని మంత్రి అచ్చెన్నాయుడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ఈ నెల 28వ, తేదిన చెప్పారుఉపఎన్నిక ఫలితం వెల్లడి కాకముందు కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలపై మంత్రులు, పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు టెలి కాన్పరెన్స్ నిర్వహించారు.టెలికాన్ఫరెన్స్ పూర్తి కాగానే మంత్రి అచ్చెన్నాయుడు చంద్రబాబు నివాసానికి చేరుకొన్నారు.నంద్యాల ఉపఎన్నిక ఫలితాలను బాబు టీవిల్లో వీక్షిస్తున్నారు. ఆ తర్వాత వరుసగా మంత్రులు నారాయణ, దేవినేని తదితరులు బాబు నివాసానికి వచ్చారు.ఉప ఎన్నిక ఫలితం టిడిపికి అనుకూలంగా రావడంతో మంత్రుల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి.ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆందోళన నెలకొని ముందురోజు నిద్రకూడ పట్టలేదని అచ్చెన్నాయుడు బాబుకు చెప్పారు.ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ కూడ చేయలేదని ఆయన బాబుకు చెప్పారు. కష్టపడితే ఫలితం అనుకూలంగా ఉంటుందన్నారు బాబు.

లోకేష్‌ను పిలిచి కేక్ తినిపించాలని కోరిన మంత్రులు

లోకేష్‌ను పిలిచి కేక్ తినిపించాలని కోరిన మంత్రులు

నంద్యాల ఉపఎన్నిక ఫలితాలను బాబు నివాసంలో వీక్షిస్తున్న మంత్రులు.. కేక్ కట్ చేయాలని చంద్రబాబును కోరారు. అయితే అప్పటికే టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి 18 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అప్పటికి సుమారు 12 రౌండ్లు పూర్తయ్యాయి. ఫలితం పూర్తిగా వచ్చాకే కేక్ కట్ చేద్దామని చంద్రబాబు ప్రతిపాదించారు. అయితే కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలపై కంట్రోల్ రూమ్ లో ఉండాల్సిన మంత్రులంతా బాబు నివాసానికి చేరుకోవడంతో చంద్రబాబునాయుడు నంద్యాల ఉప ఎన్నిక చివరి రౌండ్ లెక్కింపు కొనసాగుతుండగా కేక్ తెప్పించి కట్ చేశారు. మంత్రులను పేరు పేరున పిలిచి బాబు కేక్ తినిపించారు. లోకేష్ ను కూడ పిలిచి కేక్ తినిపించాలని మంత్రులు సూచించడంతో బాబు లోకేష్‌కు కేక్ తినిపించారు.

గద్దెరామ్మోహన్ ప్రశంసించిన బాబు

గద్దెరామ్మోహన్ ప్రశంసించిన బాబు

నంద్యాల ఉప ఎన్నిక ఫలితం సందర్భాన్ని పురస్కరించుకొని టివి ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావును చంద్రబాబు ప్రశంసించారు. చర్చలో బాగా మాట్లాడావంటూ బాబు గద్దెను ప్రశంసలతో ముంచెత్తారు.రామ్మోహన్‌రావును పిలిచి మరీ బాబు ఆయనకు కేక్ తినిపించారు.

బొండా ఉమను అభినందించిన బాబు

బొండా ఉమను అభినందించిన బాబు

నంద్యాల ఉప ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ నెలరోజులపాటు తన అనుచరులతో కలిసి ప్రచారం నిర్వహించారు. బాబు మీడియా సమావేశం నుండి బయటకు వచ్చిన సమయంలో ఎదురుపడిన బొండా ఉమ భుజం తట్టి నంద్యాలలో బాగా పనిచేశావంటూ బాబు అభినందించారు. ఉమ పనిచేసిన వార్డులో టిడిపికి మెజారిటీ దక్కిందని బాబు ఉమకు చెప్పారు. తన చాంబర్ వరకు ఉమను భుజంపై చేయి వేసి తీసుకెళ్ళారు చంద్రబాబు.

English summary
Ap cm Chandrababu naidu very happy on Nandyal result.Chandrababu naidu conducted teleconference with party leaders before Nandyal bypoll result on Aug 28.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X