వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాల: తలపండిన నేతలంతా అక్కడే, వార్డుకో ఎమ్మెల్యే స్థాయి నేత

నంద్యాల ఉప ఎన్నికలో విజయం కోసం అధికార టిడిపి, విపక్ష వైసీపీలు వ్యూహలను రచిస్తున్నాయి. రాజకీయాల్లో రాటుదేలిన నేతలంతా ఈ ఉపఎన్నికల్లో విజయం కోసం వ్యూహరచన చేస్తున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ట

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలో విజయం కోసం అధికార టిడిపి, విపక్ష వైసీపీలు వ్యూహలను రచిస్తున్నాయి. రాజకీయాల్లో రాటుదేలిన నేతలంతా ఈ ఉపఎన్నికల్లో విజయం కోసం వ్యూహరచన చేస్తున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. టిడిపి, వైసీపీలకు చెందిన తలపండిన నేతలు నంద్యాలలో తిష్ట వేశారు.

నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఈ నెల 23వ, తేదిన ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా భూమా బ్రహ్మనందరెడ్డి, వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డి బరిలో ఉన్నారు. వీరిద్దరూ కూడ నామినేషన్లు దాఖలు చేశారు.

రంగంలోకి బొత్స: చక్రపాణిరెడ్డి డిమాండ్ ఇదే, చివరివరకు భూమా ఇలా.... రంగంలోకి బొత్స: చక్రపాణిరెడ్డి డిమాండ్ ఇదే, చివరివరకు భూమా ఇలా....

2019 ఎన్నికలకు నంద్యాల ఉప ఎన్నికను సెమీ ఫైనల్‌గా భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితమే రానున్న ఎన్నికల్లో ప్రభావితమయ్యే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు..

నంద్యాలలో ఎక్కడ చూసినా రెండు పార్టీలకు చెందిన నేతలు కన్పిస్తున్నారు. విజయం కోసం రెండు పార్టీల నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.

తలపండిన నేతలంతా నంద్యాలలోనే

తలపండిన నేతలంతా నంద్యాలలోనే

నంద్యాల ఉప ఎన్నికలు జరుగుతున్నందున అధికార టిడిపి, విపక్ష పార్టీకి చెందిన వైసీపీ నేతలు నంద్యాలలోనే మకాం వేశారు. అధికార పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డికి మద్దతుగా డిప్యూటీ సీఎం కె.ఈ. కృష్ణమూర్తితోపాటు 8మంది మంత్రులు ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్నారు.మరోవైపు ఇతర జిల్లాల నుండి వచ్చిన టిడిపి ఎమ్మెల్యేలు కూడ ఈ నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వైసీపీ తరపున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, మాజీ ఎంపి అనంత వెంకట్రామ్‌రెడ్డి, ఎంపీలు, అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, పీఎసీ చైర్మెన్ బుగ్గన రాజేందర్‌రెడ్డి తదితరులున్నారు.

వార్డుకో కీలకమైన నాయకుడు

వార్డుకో కీలకమైన నాయకుడు

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో నంద్యాల పట్టణంలో అత్యధికంగా ఓట్లున్నాయి. దీంతో నంద్యాలలో ఓటర్లను ఆకట్టుకొనేందుకు రెండు పార్టీలు ప్రయత్నాలను ప్రారంభించాయి. ప్రతి వార్డుకు ఎమ్మెల్యేస్థాయి నాయకుడికి రెండు పార్టీలు బాధ్యతలను అప్పగించాయి. ఆయా వార్డుల్లోని పరిస్థితులను వారు సమీక్షించుకొంటున్నారు. ఓటర్లను తమ వైపుకు తిప్పుకొనేందుకు వ్యూహరచన చేస్తున్నారు.

. ఎత్తులకు పై ఎత్తులు

. ఎత్తులకు పై ఎత్తులు

రెండు పార్టీలకు చెందిన కీలకమైన నాయకులంతా నంద్యాలలోనే మకాం వేశారు. దీంతో గెలుపు కోసం ఈ స్థానంలో రెండు పార్టీలకు చెందిన నేతలంతా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఎప్పటికప్పుడు రెండు పార్టీలకు చెందిన నేతలు తమ వ్యూహలను మార్చుకొంటున్నాయి.

లాడ్జీలన్నీ ఫుల్

లాడ్జీలన్నీ ఫుల్

నంద్యాలలోని చిన్న, పెద్ద లాడ్జీలన్నీ పుల్ అయ్యాయి. పట్టణంలో సుమారు 15 వరకు లాడ్జీలున్నాయి.టీడీపీ, వైసీపీ నేతలు ఆయా లాడ్జీల్లో మకాం వేశారు.దీంతో లాడ్జీలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎవరైనా నంద్యాలకు వస్తే కనీసం లాడ్జీల్లో వసతి దొరికే పరిస్థితి కూడ లేదు.

English summary
Tdp, ysrcp planning to win Nandyal by poll. Deputy chief minister K.E. Krishnamurthy and other 8 ministers campaigning for Tdp candidate Bhuma Brahmanandha reddy.former ministers Bosta satyanaraya and other leaders campaigning for ysrcp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X