వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాల బైపోల్:శిల్పా, భూమా ఫ్యామిలీకి కీలకం, 2019కి సైమీఫైనల్స్

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: 2019 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న నంద్యాల ఉప ఎన్నిక ఇవాళ జరగనుంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం టిడిపి, వైసీపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రెండు దఫాలు నంద్యాలలో ప్రచారం నిర్వహించారు. వైసీపీ చీఫ్ జగన్ 13 రోజులపాటు నంద్యాలలోనే మకాం వేసి ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలు శిల్పా, భూమా కుటుంబాలకు టర్నింగ్‌పాయింట్‌గా నిలవనున్నాయి. ఈ అసెంబ్లీ స్థానంలో ప్రజలు ఎవరికి పట్టం కడుతారోననేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.

గంగుల Vs భూమా, ఒకే పార్టీలో ఇమిడేనా, అఖిలకు షాకేనా?గంగుల Vs భూమా, ఒకే పార్టీలో ఇమిడేనా, అఖిలకు షాకేనా?

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జిరగే ఉపఎన్నికను టిడిపి, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. 8 మంది మంత్రులు నంద్యాలలోనే మకాం వేసి ప్రచారం నిర్వహించారు.వైసీపీకి చెందిన కీలక నేతలు కూడ నంద్యాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

గంగుల ఎఫెక్ట్: వైసీపీకి షాక్, గోస్పాడుపై పట్టుకు ప్రతాప్‌రెడ్డి వ్యూహంగంగుల ఎఫెక్ట్: వైసీపీకి షాక్, గోస్పాడుపై పట్టుకు ప్రతాప్‌రెడ్డి వ్యూహం


అధికార, ప్రతిపక్ష పార్టీల పరస్పర విమర్శలు, రోడ్డుషోలు, ఇంటింటి ప్రచారాలు, తెరలపై ప్రదర్శనలతో నంద్యాలవాసులను ఉక్కిరిబిక్కిరి చేశారు.నోటిఫికేషన్‌కు ముందు రెండుసార్లు, ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇక్కడ పర్యటించారు.

గంగుల ఎఫెక్ట్: గోస్పాడు ఏకపక్షమేనా, తమ్ముడిని కాదని, వైసీపీకి దెబ్బేనా?గంగుల ఎఫెక్ట్: గోస్పాడు ఏకపక్షమేనా, తమ్ముడిని కాదని, వైసీపీకి దెబ్బేనా?

వైసీపీ చీఫ్ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి 13రోజులపాటు నంద్యాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు జగన్‌ ప్రచారం నిర్వహించారు.

తేలనున్న శిల్పా , అఖిల భవితవ్యం

తేలనున్న శిల్పా , అఖిల భవితవ్యం

నంద్యాల ఉపఎన్నికను పురస్కరించుకొని మంత్రి అఖిలప్రియ..వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిల భవితవ్యం తేలనుంది. ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి ఓటమి పాలైతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తామని మంత్రి అఖిలప్రియ ప్రకటించారు..మరోవైపు తాను ఓటమిపాలైతే రాజకీయాల నుండి శాశ్వాతంగా తప్పుకొంటానని ప్రకటించారు. అయితే ఈ సవాల్‌పై ఇద్దరు తుది ప్రకటన చేయలేదు.ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా కానీ, వీరిద్దరూ కూడ ఈ సవాళ్ళకు కట్టుబడి ఉండే అవకాశం లేదు.కానీ, రాజకీయంగా మాత్రం వీరిద్దరికి ఈ ఉపఎన్నిక టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం కన్పిస్తోంది.

Recommended Video

Nandyal By-poll : Chandrababu Naidu Tense Over Elections | Oneindia Telugu
భూమా కుటుంబం రాజకీయాల్లో రాణించేనా?

భూమా కుటుంబం రాజకీయాల్లో రాణించేనా?

రాజకీయాల్లో రాటుదేలిన భూమా నాగిరెడ్డి, ఆయన సతీమణి శోభా నాగిరెడ్డి అకాల మరణంతో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో భూమా కుటుంబాన్ని రాజకీయాల్లో నడిపే బాధ్యతను మంత్రి భూమా అఖిలప్రియ తీసుకొన్నారు. ఆమె కూడ రాజకీయాలకు కొత్తే. తల్లి మరణంతో మూడేళ్ళ క్రితం ఆమె రాజకీయాల్లోకి వచ్చారు.భూమా నాగిరెడ్డి మరణంతో బ్రహ్మనందరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు.నంద్యాల ఉప ఎన్నికలు వీరికి మంచి అనుభవాన్ని నేర్పించనున్నాయి. అయితే నాగిరెడ్డి మరణంతో మంత్రివర్గంలో స్థానం దక్కించుకొన్న అఖిలప్రియ భూమా ఆశయాలను ఏ మేరకు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తోందో చూడాలి. అంతేకాదు తన ప్రత్యర్థులు కూడ పార్టీలో చేరారు. ఈ తరుణంలో తన వర్గాన్ని కాపాడుకొంటూ పార్టీలో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం అంత ఆషామాసీ వ్యవహరం కాదు. ప్రత్యర్థిపార్టీల్లో ఉన్నవారు రాజకీయాల్లో ఆరితేరి ఉన్నవారు.

2019 ఎన్నికలకు సెమీఫైనల్స్

2019 ఎన్నికలకు సెమీఫైనల్స్

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నిక .. 2019లో జరిగే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు.ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలే 2019 ఎన్నికల్లో దాదాపుగా పునరావృతమయ్యే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.ఎన్నికలకు కూడ సమయం ఏడాదిన్నర కాలం మాత్రమే ఉంది. దీంతో ఈ రెండు పార్టీలు నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఓటర్లను తమ వైపుకు తిప్పుకొనేందుకు రెండు పార్టీలు అన్ని రకాల ప్రయత్నాలను చేశారు

ఓటరు ఎవరికి మొగ్గు చూపుతారో?

ఓటరు ఎవరికి మొగ్గు చూపుతారో?


నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో విజయం తమదంటే తమదేనని టిడిపి, వైసీపీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో నంద్యాల పట్టణం, గ్రామీణం, గోస్పాడు మండలాలున్నాయి. మొత్తం 2,18,858 మంది ఓటర్లు ఉండగా.. ఒక్క పట్టణంలోనే 1,42,628 మంది ఉన్నారు. గ్రామీణంలో 47,386 మంది, గోస్పాడు మండలంలో 28,844 మంది ఓటర్లు ఉన్నారు. నంద్యాల పట్టణమే కీలకమైనందున తెదేపా, వైకాపాలు తమ దృష్టిని ఎక్కువగా ఇక్కడే కేంద్రీకరించాయి. వైకాపా అధినేత జగన్‌ పది రోజులపాటు నంద్యాలలో ప్రాంతాలవారీగా ప్రచారం నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారికి కేటాయించిన వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. తెదేపా తరపున మంత్రులు కాలవ శ్రీనివాసులు, అమరనాథ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు ఎన్నికల బాధ్యతలను పర్యవేక్షించారు.గెలుపు ఓటములపై ప్రభావం చూపే ముస్లిం, కాపు సామాజిక వర్గ ఓట్లపై ఈ రెండు పార్టీలు కేంద్రీకరించాయి.

పోటాపోటీ ప్రచారం చేసిన రెండు పార్టీలు

పోటాపోటీ ప్రచారం చేసిన రెండు పార్టీలు


నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టణ ఓట్లపై రెండు పార్టీలు కేంద్రీకరించాయి. పట్టణంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు తమకు ఓట్లను తెచ్చిపెడతాయని టిడిపి నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు తమకు కలిసివస్తాయని ప్రధాన ప్రతిపక్షం భావిస్తోంది.
మొదట్లో గోస్పాడు, నంద్యాల గ్రామీణంపై పట్టు సాధించేందుకు తెదేపా హోరాహోరీ ప్రచారం చేసింది. పట్టణ ఓటర్లను ఆకర్షించేందుకు వైకాపా అధినేత అభ్యర్థిని వెంటబెట్టుకుని మరీ ప్రచారం చేశారు. తెదేపా అభివృద్ధినే అస్త్రంగా చేసుకోగా, జగన్‌ ప్రభుత్వ హామీల అమలు తీరు, వ్యతిరేకతనే ప్రధాన అంశాలుగా చేసుకున్నారు.

English summary
Tdp, ysrcp planning to win Nandyal by poll.political analysts said that this election is a turning point to shilpa, bhuma families.who will win this elections voters will decide
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X