వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ, టిడిపి లెక్కలివి, స్వల్ప మెజారిటీనే, భారీ పోలింగ్ దెబ్బేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార టిడిపి, విపక్ష వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న నంద్యాల ఉపఎన్నికల్లో విజేత ఎవరనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.సర్వే ఫలితాలు ఒక్కో రకంగా ఉన్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార టిడిపి, విపక్ష వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న నంద్యాల ఉపఎన్నికల్లో విజేత ఎవరనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.సర్వే ఫలితాలు ఒక్కో రకంగా ఉన్నాయి.ఇదిలా ఉంటే ఈ స్ధానంలో ఎవరు విజయం సాధించినా అతి తక్కువ మెజారిటీ మాత్రమే వస్తోందనే అభిప్రాయంతో రెండు పార్టీలున్నాయి. పోలింగ్ శాతం ఆధారంగా ఈ రెండు పార్టీలు లెక్కలు వేసుకొంటున్నాయి.

డిసైడింగ్ గోస్పాడు: 10వేల మెజారిటీ, తేల్చేసిన టిడిపి, వైసీపీకి షాక్?డిసైడింగ్ గోస్పాడు: 10వేల మెజారిటీ, తేల్చేసిన టిడిపి, వైసీపీకి షాక్?

నంద్యాల ఉప ఎన్నిక ముగిసినా ఇంకా ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధికారికంగా ఫలితాలు వెలువడేందుకు ఇంకా మూడు రోజుల సమయం ఉంది. ఈ నెల 28వ, తేదిన ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.

రాజీనామాకు కట్టుబడి ఉన్నా: అఖిల సంచలనంరాజీనామాకు కట్టుబడి ఉన్నా: అఖిల సంచలనం

నంద్యాలలో విజయం సాధిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ధీమాతో ఉన్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్పరెన్స్‌లో బాబు ఈ విషయాన్ని చెప్పారు. విజయవాడ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వేలో కూడ టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి విజయం సాధిస్తారని తేలింది. ఈ విషయాన్ని లగడపాటి స్వయంగా తేల్చి చెప్పారు.

నంద్యాల బైపోల్: కోట్లలో బెట్టింగ్‌లు, మెజారిటీపైనేనంద్యాల బైపోల్: కోట్లలో బెట్టింగ్‌లు, మెజారిటీపైనే

మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం రకరకాల సర్వేలు వైరల్‌గా మారుతున్నాయి. సర్వేలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే, ఆ పార్టీకి చెందిన మద్దతుదారులు ఆ సర్వేలను పోస్ట్ చేస్తున్నారు.

పట్టణ ఓటర్లు పట్టం కడుతారని టిడిపి నమ్మకం

పట్టణ ఓటర్లు పట్టం కడుతారని టిడిపి నమ్మకం

పట్టణంలో చేపట్టిన అభివృద్ది పనులు ఓట్ల రూపంలో విజయం అందిస్తాయని వారి ధీమా. పట్టణంలో 1,42,628 మంది ఓటర్లు ఉంటే 1,05,629 మంది ఓటు హక్కును వినియోగించుకొన్నారు.పట్టణంలో 74.06 శాతం పోలింగ్‌ నమోదైంది. వారిలో పురుషులు 51,410 మంది, మహిళలు 54,218 మంది ఉన్నారు. టీడీపీ మొదటి నుంచి పట్టణంపైనే నమ్మకం పెట్టుకొంది. 30 ఏళ్లుగా కలగా మారిన రహదారుల విస్తరణను చేపట్టారు. అత్యధికంగా ఉన్న మెప్మా పొదుపు మహిళలకు బకాయి ఉన్న పసుపు కుంకుమ నిధులు, వడ్డీ మాఫీ నిధులు ఒక్కొక్కరికి రూ.10వేల దాకా ఖాతాలో జమ చేశారు. సర్వే చేసి మహిళలకు అవసరమైన కుట్టుమిషన్లు, ఇతర సామగ్రి కూడా అందించారు. దీంతో మహిళలు టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారని భావిస్తున్నారు. దీంతో పాటు అభివృద్ధిని చూసి పట్టణ జనం టీడీపీకి ఓటు వేస్తారని టిడిపి నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

గెలుపు ఓటములను నిర్ణయించేది గోస్పాడు

గెలుపు ఓటములను నిర్ణయించేది గోస్పాడు

గోస్పాడు, నంద్యాల మండలాల పరిధిలో మొదటి నుంచి వైసీపీకి పట్టు ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీంతో ముందు నుంచే టీడీపీ వ్యూహాత్మకంగా పట్టణంలో బలం పెంచుకుంటూ.. పల్లెల్లో వైసీపీ బలం తగ్గించేందుకు పావులు కదిపింది. గెలుపు తమదేనని ఆ పార్టీ బలమైన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది. వైసీపీ సైతం పట్టణంలో తమ ఓటు బ్యాంకు తమకు వచ్చిందని, గోస్పాడు మండలంలో 90.81 శాతం, నంద్యాల రూరల్‌ పరిధిలో 87.61 శాతం పోలింగ్‌ నమోదు కావడం తమకు కలిసి రానుంది వైసీపీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. ఈ రెండు మండలాల్లో 10వేలకు పైగా తమకు మెజారిటీ వస్తుందని, పట్టణంలో టీడీపీకి వచ్చే ఆరేడు వేల మెజారిటీని తగ్గించి నాలుగైదు వేల మెజారిటీతో విజయం సాధిస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

అతి తక్కువ మెజారిటీతోనే విజయం

అతి తక్కువ మెజారిటీతోనే విజయం

నంద్యాలలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధించినా మెజారిటీ తక్కువగానే ఉంటుందనే అభిప్రాయాన్ని రెండు పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సరళి ఆధారంగా రెండు పార్టీల నేతలు లెక్కలు తీస్తున్నారు. మెజారిటీ మాత్రం ఐదువేలకు లోపుగానే ఉండే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల పట్టణం, రూరల్, గోస్పాడు మండలాల్లోని ఆయా పోలింగ్‌బూత్‌ల్లో నమోదైన ఓట్ల ఆధారంగా మెజారిటీపై ఆరా తీస్తున్నారు.

సామాజికవర్గాల వారీగా పార్టీల విశ్లేషణ

సామాజికవర్గాల వారీగా పార్టీల విశ్లేషణ

ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. ఇప్పుడంతా విజేత ఎవరనే దానిపై చర్చ. రికార్డు స్థాయిలో పోలింగ్‌ జరగడంతో.. ఇది తమకే ఉపకరిస్తందని ఇరుపార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి నాయకులు లెక్కల్లో మునిగి తేలుతున్నారు. గెలుపు తమదేనని, మెజార్టీ ఎంత వస్తుందో చూడాలని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 255 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఎక్కడెక్కడ ఎంత శాతం పోలింగ్‌ నమోదైంది? పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఏఏ సామాజిక వర్గాలు ఉన్నాయి? వారు ఎటువైపు మొగ్గు చూపి ఉంటారు? ఇలా లెక్కలను ముందేసుకుని అంచనాల్లో నిమగ్నమయ్యారు. అయితే ఈ నెల 28వ, తేదిన పార్టీల అంచనాలపై స్పష్టత రానుంది.

ఏ సర్వేను నమ్మాలి

ఏ సర్వేను నమ్మాలి

పోలింగ్‌ తర్వాత ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలతో ఒక్కో సర్వే ఒక్కోరకంగా చెబుతోంది. అత్యధికంగా సర్వేలు మాత్రం టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి విజయం సాధిస్తారని అంటున్నాయి. సోషల్‌ మీడియాలో పలు సర్వే ఫలితాలు వైరల్‌ అవుతున్నాయి. ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతో గట్టెక్కే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెబితే.. 56 శాతం ఓట్లతో భారీ ఆధిక్యంతో టీడీపీ విజయం సాధిస్తుందని మరికొన్ని చెబుతున్నాయి. ఇంకొన్ని సర్వేలు వైసీపీ గెలుపును చూపిస్తున్నాయి. గత కొన్ని ఎన్నికల్లో కాస్త అటు ఇటు కచ్చితమైన ఫలితాలు అందించిన ఓ సర్వే సంస్థ టీడీపీ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ విజయం సాధిస్తుందని టిడిపి నేతలు అభిప్రాయంతో ఉన్నారు..

English summary
Both parties analysis on polling percentage of Nandyal.Huge voting reflects to on result. as per analysts opinion anyone win with less majority from Nandyal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X