వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాలపై చంద్రబాబు వ్యూహాలు, ప్రశాంత్ కిషోర్‌తో జగన్ చెక్

నంద్యాల ఉప ఎన్నికలపై అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ సీటు ఇరు పార్టీలకు చాలా కీలకంగా మారింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: నంద్యాల ఉప ఎన్నికలపై అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ సీటు ఇరు పార్టీలకు చాలా కీలకంగా మారింది.

ఇప్పటికే వైసిపి తరఫున రంగంలోకి దిగిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నంద్యాల కోసం పని చేస్తున్నారు. చంద్రబాబు కూడా ఉప ఎన్నికపై నేతలను అప్రమత్తం చేస్తున్నారు.

పలు అంశాలపై చంద్రబాబు సర్వే

పలు అంశాలపై చంద్రబాబు సర్వే

నంద్యాలలో పలు అంశాలపై చంద్రబాబు సర్వే చేయించారని తెలుస్తోంది. గృహ నిర్మాణం మినహా మిగతా అంశాల్లో టిడిపికి ప్రజలు మార్కులు వేశారని తేలిందని సమాచారం.

ప్రశాంత్ కిషోర్ కూడా ప్రత్యేక దృష్టి

ప్రశాంత్ కిషోర్ కూడా ప్రత్యేక దృష్టి

వైసిపికి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ నంద్యాలపై వ్యూహరచనలు చేశారని, చేస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ప్రశాంత్ కిషోర్ వార్డులు, పంచాయతీ లెవల్లో పరిస్థితులను ఆరా తీసి, స్థానిక నేతలకు సూచనలు ఇస్తున్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికలకు నంద్యాల ఎన్నికలను ఓ విధంగా ఇరు పార్టీలు కూడా సెమీ ఫైనల్‌గా భావిస్తున్నాయి.

Recommended Video

Chandrababu discussions In co ordination meeting Over strategies for Nandyal by-polls
నంద్యాలలో వారే ప్రచార పర్యవేక్షకులు

నంద్యాలలో వారే ప్రచార పర్యవేక్షకులు

ఏపీలో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇంచార్జీగా నియమించిన సీఎం చంద్రబాబు అదనంగా ఒక సీనియర్‌ ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీని ఇంచార్జీగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 25 పార్లమెంటరీ స్థానాలకు 25 మందిని ఎంపిక చేశారు. ఈ బృందంలో 20 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎవర్ని ఏ పార్లమెంటరీ స్థానానికి ఇంచార్జీగా నియమించేదీ తర్వాత నిర్ణయిస్తారు. ఈ 25 మందినే నంద్యాల ఉప ఎన్నికలో పార్టీ ప్రచార పర్యవేక్షకులుగానూ నియమించారు.

పోటాపోటీగా ఇంచార్జులు

పోటాపోటీగా ఇంచార్జులు

నంద్యాలకు పంపిస్తున్న 25 మందిలో ఒక్కొక్కరిని 10-12 వేల మంది ఓటర్లకు ఇంచార్జిగా నియమించారు. తక్షణం బయల్దేరి నంద్యాలకు వెళ్లాల్సిందిగా వీరిని సోమవారం చంద్రబాబు ఆదేశించారు. టిడిపికి పోటీగా వైసిపి కూడా పదిమందికి పైగా ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది.

మనం గెలుస్తున్నాం

మనం గెలుస్తున్నాం

నంద్యాలలో మనం గెలుస్తున్నామని, అక్కడ హడావుడి, ప్రచార్భాటం చేయాలని తాను అనుకోవడం లేదని, మంత్రులు కూడా పెద్దగా రారని, బాధ్యతంతా మీదేనని, మీకు కేటాయించిన పరిధిలో ఓటర్లందర్నీ కలవాలని, జాగ్రత్తగా పని చేయాలని చంద్రబాబు నేతలను ఆదేశించారు.

English summary
It is said that Telugu Desam and YSR Congress party are thinking that Nandyal by elections are the semi finals for 2019 general elections in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X