• search
  • Live TV
ఆళ్లగడ్డ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆళ్లగడ్డలో డిన్నరా? వెళ్లొద్దు: మంత్రి అఖిలప్రియ.. ‘నూతన వసంత’ విందుకే ఏవీ

By Swetha Basvababu
|

అమరావతి: కర్నూల్ జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు మరోసారి బయట పడ్డాయి. మంత్రి భూమా అఖిలప్రియ, పార్టీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి ఘర్షణ చేరింది. ఆదివారం నూతన సంవత్సరానికి స్వాగతం పలికే పేరుతో ఏవీ సుబ్బారెడ్డి.. నంద్యాల, ఆళ్లగడ్డ టీడీపీ నేతలకు విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయమై ఈ నెల 31వ తేదీన డిన్నర్ ఏర్పాటు చేశారు.

పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. నూతన ఏడాదిని స్వాగతిస్తూ ఆ రోజున ఏవీ సుబ్బారెడ్డి ఏర్పాటు చేసిన డిన్నర్‌కు రావాలంటూ నంద్యాల, ఆళ్లగడ్డ నేతలకు స్వయంగా ఆహ్వానం పలికారు. ఈ విషయం తెలిసిన మంత్రికి భూమా అఖిలప్రియకు కోపమొచ్చింది. తనకు తెలియకుండా ఆళ్లగడ్డలో డిన్నర్‌ ఇవ్వడమేంటని, ఎవ్వరూ వెళ్లొద్దని హుకుం జారీ చేశారు.

మంత్రితో అమీతుమీకి ఏవీ సుబ్బారెడ్డి రెడీ

మంత్రితో అమీతుమీకి ఏవీ సుబ్బారెడ్డి రెడీ

అయినా ఏవీ సుబ్బారెడ్డి తన బలం నిరూపించుకోవడానికి ఏవీసుబ్బారెడ్డి సంసిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏకంగా ఒక ఫంక్షన్‌ హాల్‌ను తీసుకుని భారీగా డిన్నర్‌ ఇస్తున్నారు. దీనికి రెండు నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యేలా చూసుకుంటున్నారు. తద్వారా తన బలమేమిటో చూపించాలని దృఢనిశ్చయంతో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద ఆనందంగా గడుపుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ సాగాల్సిన డిన్నర్‌ కాస్త ఇద్దరి మధ్య పరస్పర ఘర్షణకు దారితీయడం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

మంత్రి, ఏవీ మధ్య మాటలు కూడా లేవు

మంత్రి, ఏవీ మధ్య మాటలు కూడా లేవు

ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డిలది సుదీర్ఘ స్నేహ సంబంధం. భూమా నాగిరెడ్డి ఆత్మగా ఏవీని పిలిచేవారు. సుబ్బారెడ్డికి తెలియకుండా భూమా అడుగు కూడా వేసేవారు కాదనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. అయితే, భూమా నాగిరెడ్డి మరణం తర్వాత పరిస్థితి మారుతూ వచ్చింది. భూమా అఖిలప్రియకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య మరింత దూరం పెరిగింది. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ఒకానొక దశలో ఏవీ సుబ్బారెడ్డి టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న ప్రచారం జరిగింది. ఏవీ సుబ్బారెడ్డిని భూమా అఖిలప్రియ కనీసం పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఉప ఎన్నిక వేళ గెలుపు లక్ష్యం కావడంతో మంత్రి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య సీఎం చంద్రబాబు రాయబారం నెరిపి తాత్కాలిక సంధి కుదిర్చారు. ఇక ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, కాలువ శ్రీనివాసులు తదితరులు, పార్టీ సీనియర్ నేతలు నియోజకవర్గంలో తిష్ట వేసి ప్రచారం చేయడంతో వారిద్దరి మధ్య విభేదాలు తాత్కాలికంగా కనిపించ లేదు.

ఏవీ భవనంపైనా మంత్రి అఖిలప్రియ నోటీసులు

ఏవీ భవనంపైనా మంత్రి అఖిలప్రియ నోటీసులు

నంద్యాల ఉప ఎన్నిక తర్వాత మంత్రి భూమా అఖిలప్రియ, సీనియర్ నేతగా ఏవీ సుబ్బారెడ్డి మధ్య మాటలు కూడా లేకుండా పోయాయి. నంద్యాల ఉప ఎన్నిక అనంతరం ఆళ్లగడ్డలో తన పుట్టినరోజు సందర్భంగా ర్యాలీ నిర్వహించాలని ఏవీ పోలీసుల అనుమతి తీసుకున్నారు. అయితే, ర్యాలీ జరపకుండా మంత్రి నేరుగా రంగంలోకి దిగి అడ్డుకున్నారనే ప్రచారముంది. ఆళ్లగడ్డలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఏవీ బిల్డింగ్‌కు కూడా మంత్రి నోటీసులు ఇప్పించారు. నిర్మాణం ముందుకు సాగకుండా మంత్రి అడ్డుకున్నారనేది ఏవీ ఆరోపణ. ఈ క్రమంలోనే ‘న్యూఇయర్‌ డిన్నర్‌'తో ఇద్దరి మధ్య విభేదాలు మరింతగా ముదురుతున్నాయి.

బల ప్రదర్శనకు సిద్ధం అవుతున్న ఏవీ

బల ప్రదర్శనకు సిద్ధం అవుతున్న ఏవీ

మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య వైరాన్ని తగ్గించి సర్దుబాటు చేసేందుకు అధికార తెలుగుదేశం పార్టీలో ఎవ్వరూ సాహసించడం లేదు. ఎవ్వరు చెప్పినప్పటికీ ఇద్దరూ వినే స్థితిలో లేరని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. ఇక ఏవీ సుబ్బారెడ్డికి ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే, ఈ విషయంలో ఇప్పటివరకు ఎటువంటి కదలిక లేదు.కేవలం నంద్యాల ఉప ఎన్నికల్లో ఏవీని ఉపయోగించుకుని అవసరం తీరిన తర్వాత డమ్మీగా మార్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ నెల 31న డిన్నర్‌ వేదికగా ఏవీ సుబ్బారెడ్డి టీడీపీ నాయకత్వం ముందు బల నిరూపణకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kurnool Minister Bhuma Akhilapriya has directly faces party senior leader AV Subbareddy. AV Subbareddy planning to "New Year Meet" on Sunday with Allagadda and Nandyal assembly segments. But Minister Bhuma Akhilapriya ordered party cadre don't to attend the meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more