• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈడీ, సీబీఐ కేసులున్న మీరెలా వ్యవస్థను కడుగుతారు ? జగన్ కు కేశినేని సూటి ప్రశ్న

|
  జగన్ పై సెటైర్లు వేసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని || TDP MP Kesineni Nani Tweets On AP CM YS Jagan

  ఏపీలో రాజకీయ నాయకుల మధ్య సోషల్ మీడియా వార్ పెరిగిపోయింది. ఒకప్పుడు ఎవరు ఏం చెప్పాలన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవారు. ఇప్పుడు అనుకున్నదే తడవుగా ఫేస్ బుక్, ట్విట్టర్ లలో పోస్ట్ లు పెట్టి హల్ చల్ చేస్తున్నారు. ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీ అయినా , సొంత పార్టీ అయినా తనదైన స్టైల్ లో విరుచుకుపడుతున్న విజయవాడ ఎంపీ కేశినేని నానీ సీఎం జగన్ మీద మరోసారి సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు.

  వ్యవస్థను ప్రక్షాళన చెయ్యాలన్న సీఎం జగన్ .. ఎలా చేస్తారు జగన్ గారు అని ప్రశ్నించిన కేశినేని నానీ

  వ్యవస్థను ప్రక్షాళన చెయ్యాలన్న సీఎం జగన్ .. ఎలా చేస్తారు జగన్ గారు అని ప్రశ్నించిన కేశినేని నానీ

  గత కొంతకాలంగా కేశినేని తాను చెప్పాలనుకునే ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే . నిన్నటికి నిన్న వైసీపీ అధినేత, సీఎం జగన్ ను టార్గెట్ చేసి సెటైర్లు వేసిన నానీ మళ్ళీ తాజాగా జగన్ పై చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే సూటి ప్రశ్న సంధించారు . ‘‘కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి బడ్జెట్‌లో రూ.21 కోట్లు సాధించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి గారూ.. మీరు, మీ 22 మంది ఎంపీలు చాలా చాలా గ్రేట్ సార్‌'' అని నిన్న ట్వీట్ చేసిన నానీ నేడు వ్యవస్థను సమూలంగా కడిగేద్దామని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చిన నేపధ్యంలో ప్రక్షాళన గురించి స్పందించారు .తన స్థాయిలో వ్యవస్థను శుభ్రం చేసే పనిని తాను ప్రారంభించానని చెప్పిన జగన్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా అదే చేయాలని, మీరిద్దరూ మనసు పెడితే అవినీతిని సమూలంగా నిర్మూలించడం సాధ్యమేనని జగన్ అధికారులకు సూచించారు . జగన్ మాట్లాడిన దానిపై నానీ కౌంటర్ ఇచ్చారు.

  ఈడీ, సీబీఐ కేసులు ఉన్న మీరు ఈ వ్యవస్థను ఎలా కడుగుతారంటూ సీఎం జగన్ కు సూటి ప్రశ్న

  ఈడీ, సీబీఐ కేసులు ఉన్న మీరు ఈ వ్యవస్థను ఎలా కడుగుతారంటూ సీఎం జగన్ కు సూటి ప్రశ్న

  జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. 'వ్యవస్థను కడిగే ముందు మనల్ని మనం కడుక్కోవాలి జగన్ గారూ' అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కడిగిన మాత్యాలు మాత్రమే వ్యవస్థలను కడగగలవని ఎద్దేవా చేశారు ఎంపీ కేశినేని నానీ . ఈడీ, సీబీఐ కేసులు ఉన్న మీరు ఈ వ్యవస్థను ఎలా కడుగుతారంటూ సీఎం జగన్ కు సూటి ప్రశ్న వేశారు కేశినేని నానీ. అవినీతి రహిత పాలన చెయ్యటం , వ్యవస్థను ప్రక్షాళన చెయ్యటం వంటి విషయాలు సీఎం జగన్ మాట్లాడటం హాస్యాస్పదం అని ఇప్పటికే టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక నానీ ఏకంగా అవినీతి ఆరోపణలతో సీబీఐ , ఈడీ కేసుల్లో ఉన్న మీరు ఎలా వ్యవస్థను ప్రక్షాళన చేస్తారు .. ముందు మీరు వ్యవస్థను కడిగే ముందు మిమ్మల్ని మీరు కడుక్కోండి అని నానీ చాలా ఘాటుగా స్పందించారు.

  కడిగిన ముత్యాలే వ్యవస్థను కడగగలవు అన్న నానీ.. వైసీపీ ఎలా స్పందిస్తుందో

  కడిగిన ముత్యాలే వ్యవస్థను కడగగలవు అన్న నానీ.. వైసీపీ ఎలా స్పందిస్తుందో

  నిన్నటికి నిన్న కేంద్ర బడ్జెట్ లో కేవలం రూ.21 కోట్లు మాత్రమే ఇచ్చారని కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన జగన్ ఏం చేశారని కేశినేని నానీ పోస్ట్ ద్వారా ప్రశ్నించారు. ఇక ఇంతటి ఘనత సాధించిన మీరు , మీ ఎంపీలు చాలా గ్రేట్ అని వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు కేశినేని నానీ .ఇక తాజాగా వ్యవస్థను తర్వాత కడగొచ్చు ముందు మీరు మీ ఈడీ కేసులు, సీబీఐ కేసులు కడుక్కోండి అని సీఎం జగన్ కు సలహా ఇచ్చారు కేశినేని నానీ . కడిగిన ముత్యాలే వ్యవస్థను కడగగలవు అన్న నానీ పోస్ట్ కు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో మరి.

  English summary
  Recently, TDP MP Kesineni posted a tweet on Twitter platform. Hon'ble Chief Minister Jagan Mohan Reddy garnered only Rs 21 crore in the central budget for state by bending the center's neck. You and your 22 MPs are really great sir ..and another tweet from Keshineni Nani chief Minister Jagan has called for a purge of the system. Nani gave a counter to what the Jagan were talking about.. Jagan said district collectors and SPs have begun the task of cleaning up the system , and he said that he started already to clean up they also should do the same.but Nani asked You have a straightforward question how do you wash this system with the cases of ED and CBI
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X