వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబోయ్:అతడు తిన్నది పుల్ల ఐస్ కాదు...బల్లి ఐస్...ఎక్కడంటే?

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అనంతపురం:ఎండ మాడ్చేస్తోంది...ఎన్ని నీళ్లు తాగినా దప్పిక తీరడం లేదు...అంతలో పుల్ల ఐస్ అమ్మే వ్యక్తి కనిపించాడు. ఆ చల్లటి పదార్థం తినైనా కాసేపు ఊరట చెందొచ్చని ఆ పుల్ల ఐస్ కొని తినడం మొదలు పెట్టాడు

అలా ఐస్ తింటుండగానే అందులో పుల్లకు అతుక్కుపోయి ఉన్న బల్లి బైటపడింది. అంతే ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. బల్లిపడిన ఆహార పదార్థాలు తినడం ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఏమవుతుందో నని భీతిల్లాడు. అంతలో ఈ విషయం చుట్టుప్రక్కల జనాలందరికీ తెలిసి పెద్ద సంఖ్యలో అక్కడ పోగయ్యారు.

nanthapur:Lizard found In Ice bar

ద్విచక్ర వాహనంపై ఐస్ బాక్స్ పెట్టి ఆ ఐసులు అమ్ముతున్న వ్యక్తిని అందరూ కలసి నిలదీశారు. అంత పెద్ద బల్లి పడినా చూసుకోకుండా ఐస్‌ ఎలా తయారు చేస్తారని స్థానికులు ఆ ఐస్‌ అమ్ముతున్న వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కొండూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వీటిని తయారు చేసేది తాను కాదని, హిందూపురంలోని తిరుమల ఐస్‌క్రీం కంపెనీ వాళ్లు తయారు చేసే ఐస్ లు కొనుగోలు చేసి అమ్ముకుంటూ బతుకుతున్నానని ఆ వ్యక్తి కాళ్లా వేళ్లా పడ్డాడు.

దీంతో ఆ ఐస్‌ తయారీ కర్మాగారం యజమానితో స్థానికులు మాట్లాడారు. ఐస్‌లో బల్లి రావడం దురదృష్టకరమని, తిన్న వ్యక్తికి ఎలాంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తినా వైద్యసేవలు అందిస్తామని సదరు ఐస్ తయారీ సంస్థ యజమాని హామీ ఇచ్చాడు. మళ్లీ ఎప్పుడు ఇలాంటి సంఘటనలు రాకుండా జాగ్రత్త పడుతామని చెప్పారు. దీంతో ఆ ఐస్ అమ్మిన వ్యక్తిని అక్కడే ఒక గంట కూర్చోబెట్టిన స్థానికులు ఆ బల్లి ఐస్ తిన్న వ్యక్తికి ఏమీ కాకపోవడంతో ఆ తరువాత హెచ్చరించి వదిలేశారు.
అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కొండూరులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

English summary
Ananthapuram:one man found Lizard in ice bar when he is eating it. This incident happened in Anaputhuram district, Konduru village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X