వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ తల్లి..తో బుట్టువుకు జరిగినట్లుగా - నాకు జరిగిన అవమానం మరెవరికీ జరగకుండా : నారా భువనేశ్వరి బహిరంగ లేఖ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాల పైన టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి స్పందించారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు తన సతీమణిని దూషించారంటూ చంద్రబాబు సభలో ఆవేదన వ్యక్తం చేస్తూ తాను సభలో తిరిగి సీఎం అయ్యే వరకూ కాలు పెట్టనంటూ శపధం చేసారు. ఆ తరువాత మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో..టీడీపీ నేతలతో పాటుగా ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు..నందమూరి కుటుంబ సభ్యులు స్పందించారు. వైసీపీ నేతల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు కన్నీరు పెట్టటం పైన పలువురు ఆవేదన వ్యక్తం చేసారు.

తనకు అండగా నిలబడిన వారికి ధన్యవాదాలు

తనకు అండగా నిలబడిన వారికి ధన్యవాదాలు

ఇక, ఈ పరిణామాల పైన తాజాగా ఏపీ ప్రజలకు నారా భువనేశ్వరి బహిరంగ లేఖ రాసారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో భువనేశ్వరి లేఖ రాస్తూ..అందులో.. అసెంబ్లీలో తన పైన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. తనకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి / తోబుట్టువుకు/ కూతురికి జరిగినట్లుగా భావించి తనకు అండగా నిలబడటం తన జీవితంలో మర్చిపోలేనని పేర్కొన్నారు. చిన్నతనం నుంచి అమ్మగారు..నాన్నగారు విలువలతో తమను పెంచారని..నేటికీ వాటిని పాటిస్తున్నామని చెప్పారు.

ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చేయద్దు

ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చేయద్దు

విలువలతో కూడిన సమాజం కోసం ప్రతీ ఒక్కరూ ప్రయత్నం చేయాలని సూచించారు. కష్టాల్లో / ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలని సూచించారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని హితవు పలికారు.తనకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా చూడాలని ఆశిస్తున్నట్లు భువనేశ్వరి తన లేఖలో స్పష్టం చేసారు. అయితే, ఇదే అంశం పైన ఇంకా రాజకీయ రగడ కొనసాగుతోంది.

కొనసాగుతున్న రాజకీయ వివాదం

కొనసాగుతున్న రాజకీయ వివాదం


తన సతీమణిని దూషించారంటూ చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ ప్రస్తావించారు. వైసీపీ నేతలు మాత్రం తాము అసలు సభలో..బయటా ఎక్కడా భువనేశ్వరి పేరు ప్రస్తావించ లేదని చెబుతున్నారు. ఇక, ఇప్పుడు భువనేశ్వరి బహిరంగ లేఖలో ఎక్కడా పార్టీలు..వ్యక్తుల పేర్లు ప్రస్తావించలేదు. ఇక, ఈ లేఖ పైన వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి.

English summary
Nara Bhuvaneswari wrote an open letter on making indecent remarks in the AP assembly. She thanked those who supported him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X