వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవాన్ష్‌ హెరిటేజ్‌ పాలే తాగుతాడు, మామ కూడా: తమిళ మంత్రికి బ్రాహ్మణి కౌంటర్

హెరిటేజ్ ఉత్పత్తులపై తమిళనాడు మంత్రి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఏసీ సీఎం చంద్రబాబునాయుడు కోడలు, హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి. హెరిటేజ్‌ పాలలో కల్తీకి తావులేదని,

|
Google Oneindia TeluguNews

చెన్నై: హెరిటేజ్ ఉత్పత్తులపై తమిళనాడు మంత్రి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఏసీ సీఎం చంద్రబాబునాయుడు కోడలు, హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి. హెరిటేజ్‌ పాలలో కల్తీకి తావులేదని, పాతికేళ్లుగా నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తున్నామని నారా బ్రహ్మణి స్పష్టంచేశారు. పాల సేకరణకు స్టెయిన్‌లెస్ క్యాన్‌లు వాడుతున్నామని చెప్పారు.

చంద్రబాబు తలుచుకుంటే: పళనిసామి సీరియస్, ప్రభుత్వం కూలిపోతోంది!పాల దెబ్బ!చంద్రబాబు తలుచుకుంటే: పళనిసామి సీరియస్, ప్రభుత్వం కూలిపోతోంది!పాల దెబ్బ!

 దేవాన్ష్, చంద్రబాబు కూడా హెరిటేజ్ పాలే తాగుతారు

దేవాన్ష్, చంద్రబాబు కూడా హెరిటేజ్ పాలే తాగుతారు

ప్రైవేట్‌ సంస్థలు పాలను కల్తీ చేస్తున్నాయని, ఎక్కువకాలం నిల్వ చేసేందుకు రసాయనాలను కలుపుతున్నాయని తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలాజీ ఆరోపించారు. దీనిపై స్పందిస్తూ.. ఏపీ సీఎం చంద్రబాబుతో సహా తమ కుటుంబం మొత్తం హెరిటేజ్‌ పాలనే ఉపయోగిస్తున్నామని బ్రహ్మణి తెలిపారు. తన రెండేళ్ల కుమారుడు దేవాన్ష్‌కు సైతం ఆ పాలనే తాగిస్తున్నానని చెప్పారు.

 పాదయాత్ర సమయంలోనూ..

పాదయాత్ర సమయంలోనూ..

అరవయ్యేళ్ల వయస్సులో చంద్రబాబునాయుడు 2,700 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినప్పుడు కూడా హెరిటేజ్‌ పాలు, పానీయాలను సేవించి ఆరోగ్యాన్ని సంరక్షించుకున్నారని తెలిపారు.

 చెన్నైలో..

చెన్నైలో..

హెరిటేజ్‌ తయారుచేసిన పెట్‌ బాటిల్‌ పానీయాలను గురువారం చెన్నైలో ఆమె లాంఛనప్రాయంగా ఆవిష్కరించారు. సేకరించిన పా లను 150 సెంటర్లలో ప్రాసెసింగ్‌ చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. నాణ్యతలో రాజీకి తావివ్వకపోవడంతోనే హెరిటేజ్‌ రజతోత్సవ వేడుకలు జరుపుకునే స్థాయికి ఎదిగిందని బ్రాహ్మణి తెలిపారు.

 6వేల కోట్ల టార్గెట్

6వేల కోట్ల టార్గెట్

రానున్న ఐదేళ్లలో టర్నోవర్‌ను రూ.6000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీన్ని అందుకునే క్రమంలో పోషక పదార్థాలతో కూడిన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు బ్రాహ్మణి చెప్పారు. పాల ఉత్పత్తిదారులకోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. పశువుల కొనుగోలుకు సంస్థ అందించే రుణాల కోసం రూ.100 కోట్లు కేటాయించామన్నారు. రైతులకు రూ.2 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నట్లు తెలిపారు

English summary
Andhra Pradesh CM daughter in law and Heritage foods executive director Nara Brahmani told about heritage products.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X