
నారా బ్రాహ్మిణి బైక్ రైడింగ్: ఎక్కడో తెలుసా?, వీడియో చూడండి
శ్రీనగర్: ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూతురు, టీడీపీ నేత నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. ఇప్పటి వరకు వ్యాపారవేత్తగా రాణించిన ఆమె.. ఇప్పుడు ఓ బైక్ రైడర్‌గా మారారు. బైక్ ట్రావెలర్ గా తాను చేసిన అడ్వెంచర్ల గురించి స్వయంగా చెప్పుకొచ్చారు.
తాను లడఖ్‌లోని లేహ్ ప్రాంతానికి వెళ్లినట్లుగా చెప్పారు. ఉదయంపూట ఇక్కడ్నుంచి బైక్ రైడింగ్ చేస్తూ బయల్దేరామన్నారు. థిక్సే మాంటెన్సరికీ చేరిన తర్వాత అక్కడే టిఫిన్, మెడిటేషన్ కూడా చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇక బ్రాహ్మణి స్పిరిట్యువల్ ఎక్స్ పీరియెన్స్ జర్నీ గురించి చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

జావా యజ్ది స్పోర్ట్స్ బైక్ మీద లేహ్-లడక్ లాంటి హిల్ స్టేషన్ ప్రాంతంలో బ్రాహ్మణి ట్రావెల్ చేశారు. ఎంతో బరువున్న బైక్‌ను అంతదూరం ఆమె సునాయాసంగా నడుపుకుంటూ వెళ్లడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. నారా బ్రాహ్మణి ఒక మంచి బైక్ రైడర్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
నారా బ్రాహ్మణి వదినమ్మ..
— KOLLI DURGA VARA PRASAD (@JaiKolliS_Lolli) November 30, 2022
ఒక ప్రొఫెషనల్ బైకర్...
Passionate Travaller
yes మీరు విన్నది, చూసేది నిజమే..
జావా యజ్ది స్పోర్ట్స్ బైక్ మీద లేహ్ - లద్దక్ లాంటి హిల్ స్టేషన్ ఏరియా లో ట్రావెల్ చేశారు.వాళ్ల ట్రావెల్ experiance ఎలా ఉందో వాళ్ల మాటల్లోనే చూసేయండి😍#HOPEKolli
1/4 pic.twitter.com/SNRuAwleAp
చిన్ననాటి నుంచి ఇటు సినీ, అటు రాజకీయ రంగాలను దగ్గరగా చూసిన నారా బ్రాహ్మణి.. తనకు ఇష్టమైన వ్యాపార రంగంలోకి వెళ్లారు. అంతేగాక, హేరిటేజ్ ఫుడ్స్ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. పలు సేవా కార్యక్రమాలను కూడా ఆమె చేపట్టారు. హేరిటేజ్ సంస్థలో పనిచేస్తున్న పేద కార్మికుల పిల్లలకు చదువు కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు.